న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'కుల్దీప్‌ రూపంలో భారత్‌కు కొత్త ఆయుధం దొరికింది'

India vs West Indies: Kuldeep Yadav unleashes ‘new weapon’ in Kolkata T20I - Watch

హైదరాబాద్: సిరీస్ ఏదైనా.. ఫార్మాట్‌లను బట్టి బౌలర్లను మార్చుతున్న టీమిండియా సెలక్షన్ కమిటీ ఏ రకంగానూ నిరుత్సాహపడట్లేదు. సొంతగడ్డపై జరుగుతోన్న వెస్టిండీస్ సిరీస్‌లో స్పిన్నర్లతో కలిసి టీమిండియా విండీస్ జట్టును చిత్తుగా ఓడిస్తుంది. ఈ క్రమంలో ప్రధానంగా తమ మార్క్‌ను చూపిస్తున్నారు స్పిన్నర్లు. ఈ నేపథ్యంలో టీమిండియా చైనామన్‌ బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌ ప్రత్యర్థులను చిత్తు చేస్తున్నాడంటూ సంజయ్ మంజ్రేకర్ పొగిడేస్తున్నాడు.

వికెట్‌ లభించకున్నా.. ఆసక్తికరంగా

వికెట్‌ లభించకున్నా.. ఆసక్తికరంగా

కొత్త ఆయుధంతో వికెట్‌ లభించకున్నా విశ్లేషకులు దానిపై ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్నారు. ఇన్నింగ్స్‌ తొమ్మిదో ఓవర్‌లో కుల్‌దీప్‌ ఈ కొత్త బంతిని ప్రయోగించాడు. కుల్‌దీప్‌ కొత్త ఆయుధంపై సునీల్‌ గవాస్కర్‌, సంజయ్ ‌మంజ్రేకర్‌ కాసేపు కామెంటరీ బాక్స్‌లో చర్చించారు.

షాహిది అఫ్రిది 115/120 కి.మీ వేగంతో

షాహిది అఫ్రిది 115/120 కి.మీ వేగంతో

‘గతంలో షాహిది అఫ్రిది 115-120 కి.మీ వేగంతో బ్యాట్స్‌మెన్‌కు బంతి విసిరేవాడు. ఈ కుర్రాడు ఇప్పుడు పెద్దోడు అవుతున్నాడు' అని కుల్‌దీప్‌ను మంజ్రేకర్‌ ప్రశంసించాడు. వేగవంతమైన డెలవరీ కోసం చాన్నాళ్లుగా కృషి చేస్తున్నానని మ్యాచ్‌ ముగిసిన తర్వాత కుల్‌దీప్‌ చెప్పిన సంగతి తెలిసిందే.

గంటకు 107.7కి.మీ వేగం

గంటకు 107.7కి.మీ వేగం

‘చాలా వేగంగా వేశాడు. మీడియం పేస్.‌ గంటకు 107.7 కిలోమీటర్ల వేగం. ఇదో కొత్త డెలివరీ' అని గవాస్కర్‌ అన్నాడు. ‘నేరుగా వచ్చిన క్రాస్‌సీమ్‌ డెలివరీ బ్యాట్స్‌మన్‌ను ఆశ్చర్యపరిచింది. సాధారణంగా అతడు 75- 80 కి.మీ. వేగంతో బంతిని టాస్‌ చేస్తాడు' అని మంజ్రేకర్‌ పేర్కొన్నాడు.

వికెట్లు పడగొట్టడం కాకుండా పరుగులు నియంత్రిస్తూ

మణికట్టు మాయాజాలంతో బ్యాట్స్‌మెన్‌ను గందరగోళంలోకి నెట్టే కుల్దీప్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అద్భుతమైన బంతులతో ఉక్కిరిబిక్కిరి చేస్తూ వికెట్లు పడగొట్టడమే కాకుండా పరుగులను నియంత్రిస్తున్నాడు. ఈ ఎడమచేతి వాటం స్పిన్నర్‌ విండీస్‌ ఆటగాడు కీరన్‌ పొలార్డ్‌ను ఓ సరికొత్త బంతితో ఇబ్బంది పెట్టాడు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో ఆడిన కుల్దీప్.. 4 ఓవర్లు వేసి 3 వికెట్లు తీసి 13 పరుగులిచ్చాడు కుల్‌దీప్‌. ఎకానమీ అయితే 3.25.

Story first published: Tuesday, November 6, 2018, 11:37 [IST]
Other articles published on Nov 6, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X