న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అయ్యర్‌కు పీటర్సన్‌ సలహా.. అదేంటో తెలుసా?!!

Kevin Pietersen Wants Shreyas Iyer To Focus On Off-Side Batting || Oneindia Telugu
India vs West Indies: Kevin Pietersen wants Shreyas Iyer to focus on off-side batting

'ముంబై: టీమిండియా యువ బ్యాట్స్‌మన్‌ శ్రేయస్‌ అయ్యర్‌కు ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌, ప్రముఖ వ్యాఖ్యాత కెవిన్‌ పీటర్సన్‌ పలు సూచనలిచ్చాడు. అయ్యర్‌ నెట్స్‌లో మరింత సాధన చేయాలని, ఆఫ్‌సైడ్‌ బాగా ఆడేందుకు ఎక్కువ శ్రమించాలని పీటర్సన్‌ సూచించాడు. టీమిండియా నాలుగో స్థానానికి అయ్యర్‌ సరిగ్గా సరిపోతాడని పీటరన్స్‌ అభిప్రాయపడ్డాడు.

<strong>ధోనీ విరామం తీసుకున్నాడు.. ఐపీఎల్‌ ఆడుతాడు.. ప్రపంచకప్‌ పోటీలో కూడా!!</strong>ధోనీ విరామం తీసుకున్నాడు.. ఐపీఎల్‌ ఆడుతాడు.. ప్రపంచకప్‌ పోటీలో కూడా!!

వెస్టిండీస్‌తో టీ20 సందర్భంగా పీటర్సన్‌ వ్యాఖ్యాతగా ఉన్నాడు. తాజాగా పీటర్సన్‌ మాట్లాడుతూ... 'టీమిండియా గత కొంత కాలంగా బ్యాటింగ్‌ నాలుగో స్థానంలో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. శ్రేయస్‌ అయ్యర్‌ నాలుగో స్థానానికి సరిగ్గా సరిపోతాడు. అయితే అయ్యర్‌ బ్యాటింగ్‌ టెక్నిక్‌లో కొన్ని లోపాలున్నాయి. అవి సరిదిద్దుకుంటే సరిపోతుంది' అని అన్నాడు.

'అయ్యర్‌ ముఖ్యంగా ఆఫ్‌సైడ్‌ బ్యాటింగ్‌పై మరింత దృష్టి పెట్టాలి. దీనికోసం నెట్స్‌లో ఎక్కువ సాధన చేయాలి. ఎక్స్‌ట్రా కవర్స్‌ వైపు బంతిని బాదేందుకు శ్రమించాలి. ఎడమ కాలి ప్యాడ్లను తొలగించి ఆఫ్‌సైడ్‌ బంతులు బాదడంపై కసరత్తులు చేయాలి. ఆటగాళ్ల కోసం డ్రిల్స్‌ ఉంటాయి. నెట్స్‌లో ప్రత్యేకంగా ఓ బౌలర్‌చే ఆఫ్‌ స్టంప్‌ బంతులు వేయించుకొని ప్రాక్టీస్‌ చేయాలి. అప్పడతను ఎక్కువ సౌకర్యంగా స్ట్రెయిట్‌గా ఆడేందుకు వీలుంటుంది' అని పీటర్సన్‌ పేర్కొన్నాడు.

వెస్టిండీస్‌తో జరిగిన రెండు టీ20ల్లో అయ్యర్‌ అంతగా రాణించలేదు. రెండు టీ20ల్లో 4, 10 పరుగులు చేసాడు. తొలి మ్యాచ్‌లో కీరన్‌ పొలార్డ్‌ బౌలింగ్‌లో.. రెండో మ్యాచ్‌లో హెడేన్‌ వాల్స్‌ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. అయితే రెండు మ్యాచ్‌లలో పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశం రాని అయ్యర్.. చెలరేగేందుకు సిద్ధంగా ఉన్నాడు. టీమిండియా-వెస్టిండీస్‌ జట్ల మధ్య నిర్ణయాత్మకమైన మూడో టీ20 బుధవారం ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరగనుంది.

ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి టీ20లో అయ్యర్‌ (33 బంతుల్లో 62) అద్భుతంగా ఆడాడని టీమిండియా మాజీ ఆటగాడు వీవీఎస్‌ లక్ష్యణ్‌ ప్రశంసించాడు. అయ్యర్‌ రాణించడంతోనే టీమిండియా సులువుగా గెలిచిందన్నాడు. అయ్యర్‌ ఎంతో ప్రతిభావంతుడని, భవిష్యత్‌లో టీమిండియాకు ఎన్నో మరుపురాని విజయాలను అందిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక నిర్ణయాత్మకమైన మ్యాచ్‌లో తప్పక రాణిస్తాడని లక్ష్యణ్‌ ధీమా వ్యక్తం చేశాడు.

Story first published: Wednesday, December 11, 2019, 14:53 [IST]
Other articles published on Dec 11, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X