న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నేడు రెండో టీ20: సిరీస్‌పై భారత్ కన్ను.. కసితో కరీబియన్లు!!

India vs West Indies 2nd T20I: Preview, Dream11 prediction, Fantasy tips, Playing XI, TV timing

తిరువనంతపురం: తొలి టీ20 మ్యాచ్‌లో భారీ టార్గెట్ ఛేదించి మంచి జోరుమీదున్న కోహ్లీసేన మరో సమరానికి సిద్దమయింది. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియంలో భారత్ ఆదివారం వెస్టిండీస్‌తో తలపడనుంది. తమ టీ20 చరిత్రలోనే అత్యధిక పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన టీమిండియా సిరీస్‌ విజయంపై కన్నేసింది. మరోవైపు భారత్ జోరుకు అడ్డుకట్ట వేసి సిరీస్‌లో నిలవాలని చూస్తోంది.

భారత్‌ డబుల్‌ సెంచరీ.. స్వర్ణాల్లో సెంచరీ!!భారత్‌ డబుల్‌ సెంచరీ.. స్వర్ణాల్లో సెంచరీ!!

రోహిత్ కూడా ఆడితే:

రోహిత్ కూడా ఆడితే:

వచ్చే ఏడాది జరుగనున్న టీ20 ప్రపంచకప్ కోసం భారత్ ఇప్పటి నుంచే సన్నాహకాలు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. పటిష్ట జట్టును తయారుచేసుకునే పనిలో పట్టింది. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ విఫలమైనా.. జట్టును ముందుండి నడిపించాడు. అతడికి మరో ఓపెనర్ లోకేశ్ రాహుల్ మంచి సహకారం అందించాడు. టీ20 ఫార్మాట్‌లో క్లాస్ ప్లేయర్‌గా గుర్తింపు ఉన్న రాహుల్.. ఆరంభంలో బాగా ఆడి కోహ్లీపై ఒత్తిడి తగ్గించాడు. లక్షం పెద్దదే అయినా.. కోహ్లీ ఎక్కడా వెనక్కి తగ్గకుండా బ్యాటింగ్ చేసాడు. ఈ ఇద్దరు మరోసారి రెచ్చిపోతే తిరుగుండదు.

శాంసన్‌కు చోటు కష్టమే:

శాంసన్‌కు చోటు కష్టమే:

రిషబ్ పంత్ మరోసారి పేలవ షాట్ కొట్టి ఔట్ కావడం నిరాశ పరిచింది. అయితే కీలక సమయంలో భారీ షాట్లు ఆడి కోహ్లీపై ఒత్తిడి తగ్గించాడు. పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశం రాని శ్రేయాస్ అయ్యర్, శివం దుబే ఈ మ్యాచ్‌లో సత్తాచాటాలని చూస్తున్నారు. లోకల్ స్టార్ సంజూ శాంసన్‌కు తుది జట్టులో చోటు దక్కడం అనుమానమే.

 రాణించిన జడేజా, చహల్‌:

రాణించిన జడేజా, చహల్‌:

తొలి టీ20లో విండీస్‌ వీర బాదుడుకు భారత బౌలర్లు దారుణంగా బలయ్యారు. ఏకంగా 15 సిక్సర్లు నమోదయ్యాయి. పునరాగమనం చేసిన భువనేశ్వర్‌ తన ప్రభావం చూపలేకపోయాడు. దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌ సిరీస్‌లలో ఆకట్టుకున్న దీపక్‌ చాహర్‌ అందరికన్నా ఎక్కువగా 56 పరుగులు సమర్పించుకున్నాడు. స్పిన్నర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ తన కోటాను కూడా పూర్తి చేయలేకపోయాడు. జడేజా, చహల్‌ రాణించారు. ఫీల్డింగ్‌లోనూ భారత్‌ తడబడింది. అన్ని రెండో టీ20 సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది.

 తేలిపోయిన విండీస్ బౌలర్లు:

తేలిపోయిన విండీస్ బౌలర్లు:

వెస్టిండీస్‌ బ్యాట్స్‌మెన్‌ అద్భుతంగా రాణించారు. హెట్‌మైర్, ఎవిన్‌ లూయిస్, కీరన్‌ పొలార్డ్, హోల్డర్, బ్రాండన్‌ కింగ్‌ పరుగుల వరద పారించారు. ఇదే ఆత్మవిశ్వాసంతో రెండో మ్యాచ్‌లో మరింత చెలరేగి సిరీస్‌లో నిలిచి ఉండేందుకు విండీస్‌ ప్రయత్నింస్తుంది. నికోలస్‌ పూరన్‌ సస్పెన్షన్‌ ముగియడంతో రెండో టీ20లో దినేశ్‌ రామ్‌దిన్‌ స్థానంలో తుది జట్టులోకి వచ్చే అవకాశముంది. కోహ్లీ ఊచకోతకు విండీస్‌ బౌలర్లు బలి కావాల్సి వచ్చింది. ముఖ్యంగా పేసర్‌ విలియమ్స్‌. ఆరంభంలోనే హోల్డర్‌, కాట్రెల్‌ భారత వికెట్లను తీసి ఒత్తిడిలో పడేయాలనుకుంటున్నారు.

 చిరుజల్లులు కురిసే అవకాశం:

చిరుజల్లులు కురిసే అవకాశం:

ఇప్పటి వరకు గ్రీన్‌ఫీల్డ్‌ స్టేడియంలో జరిగిన రెండు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లోనూ స్పిన్నర్ల హవా కొనసాగింది. ఇప్పుడు కూడా వికెట్ నుంచి స్పిన్నర్లకు సహకారం లభించొచ్చు. ఆదివారం చిరుజల్లులు కురిసే అవకాశముంది. ఈ మైదానంలో విండీస్‌ గతంలో వన్డే ఆడింది. 2018లో జరిగిన ఈ వన్డేలో విండీస్‌ 104 పరుగులకే ఆలౌటైంది. రాత్రి గం. 7 నుంచి స్టార్ స్పోర్ట్‌లో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది.

తుది జట్లు (అంచనా):

తుది జట్లు (అంచనా):

భారత్: కోహ్లీ (కెప్టెన్), రోహిత్, రాహుల్, పంత్, అయ్యర్, శివం, జడేజా, సుందర్, దీపక్, భువనేశ్వర్, చాహల్.

వెస్టిండీస్: కీరన్ పొలార్డ్ (కెప్టెన్), సిమన్స్, లూయిస్, బ్రాండన్ కింగ్, హెట్‌మైర్, పూరన్, హోల్డర్, పైర్,్ర కెస్రిక్, కాట్రెల్, హైడెన్ వాల్ష్.

Story first published: Sunday, December 8, 2019, 11:36 [IST]
Other articles published on Dec 8, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X