న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs West Indies: సిరీస్‌పై భార‌త్ గురి.. విండీస్‌కు చావో రేవో.. నేడే రెండో టీ20 మ్యాచ్‌

India vs West Indies: 2nd T20 match will be played today. Team India already has a 1-0 lead in the series
IND vs WI 2nd T20 : Kohli VS Rohit Clash For Biggest T20I Record | Oneindia Telugu

కోల్‌క‌తా: భార‌త్, వెస్టిండీస్ మ‌ధ్య నేడు రెండో టీ20 మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే తొలి టీ20 మ్యాచ్‌ను గెలిచి జోరు మీదున్న టీమిండియా.. ఈ మ్యాచ్‌ను కూడా గెలిచి మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే సిరీస్‌ను కైవసం చేసుకోవాల‌ని ప‌ట్టుద‌ల‌గా ఉంది. మ‌రో వైపు వెస్టిండీస్ మాత్రం ఈ మ్యాచ్ గెలిచి టీ20 సిరీస్ చేజారి పోకుండా కాపాడుకోవాల‌ని భావిస్తోంది. ఇందు కోసం త‌గిన వ్యూహాల‌ను ర‌చిస్తోంది. కాగా రాత్రి 7 గంట‌ల‌కు మ్యాచ్ ప్రారంభం కానుంది.

గెలుపే ల‌క్ష్యంగా భార‌త్‌

గెలుపే ల‌క్ష్యంగా భార‌త్‌

ఇప్ప‌టికే వ‌న్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి జోరు మీదున్న టీమిండియా.. త‌గిన ఆత్మ‌విశ్వాసంతో టీ20 సిరీస్ మొద‌లుపెట్టింది. దానికి త‌గ్గ‌ట్టుగానే తొలి టీ20 మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో శుభారంభం చేసింది. దీంతో నేడు జ‌రిగే రెండో టీ20 మ్యాచ్‌లోనూ గెలిచి, మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే సిరీస్ కైవ‌సం చేసుకోవాల‌ని ప‌ట్టుద‌ల‌గా ఉంది. ఇందు కోసం త‌గిన వ్యూహాల‌ను సిద్ధం చేస్తోంది. తొలి టీ20 మ్యాచ్‌లో త‌మ స్పిన్ బౌలింగ్‌తో క‌రేబియ‌న్ల‌ను ఉక్కిరిబిక్కిరి చేసిన టీమిండియా.. ఈ రెండో టీ20 మ్యాచ్‌లోనూ అదే పున‌రావృతం చేయాల‌ని భావిస్తోంది. చాహ‌ల్, ర‌వి బిష్ణోయ్‌తో టీమిండియా స్పిన్ డిపార్ట్‌మెంట్ బ‌లంగా కనిపిస్తోంది. వీరికి తోడు పేస‌ర్లు కూడా రాణిస్తున్నారు. ఇక‌ బ్యాటింగ్‌లో కూడా టీమిండియా బ‌లంగా ఉంది.

స‌మం చేయాలని విండీస్‌

స‌మం చేయాలని విండీస్‌

ఇప్ప‌టికే వ‌న్డే సిరీస్ కోల్పోయిన వెస్టిండీస్ టీ20 సిరీస్‌లోనైనా గెల‌వాల‌ని భావిస్తోంది. ఇప్ప‌టికే తొలి మ్యాచ్ ఓడి వెనుక‌బ‌డ‌డంతో నేడు జ‌రిగే రెండో టీ20 మ్యాచ్‌ను గెలిచి సిరీస్ రేసులో నిల‌వాల‌ని భావిస్తోంది. ఇందుకు త‌మ బ్యాటింగ్, బౌలింగ్ డిపార్ట్‌మెంట్లు క‌లిసిక‌ట్టుగా రాణించాల‌ని భావిస్తున్నాయి. చివ‌రి మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో నికోల‌స్ పూర‌న్, కీర‌న్ పొలార్డ్ మిన‌హా ఎవ‌రూ రాణించ‌లేదు. దీంతో ఈ మ్యాచ్‌లో మిగ‌తా వారు కూడా రాణిస్తే భారీ స్కోర్ చేయోచ్చ‌ని క‌రేబియ‌న్లు భావిస్తున్నారు.

కోహ్లీపైనే అంద‌రి చూపు

కోహ్లీపైనే అంద‌రి చూపు

ఈ మ్యాచ్‌లో టీమిండియా వెట‌ర‌న్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లీపైనే అంద‌రి చూపు ఉంది. ఈ మ‌ధ్య కాలంలో స‌రైన ఇన్నింగ్స్ ఆడ‌ని కోహ్లీ ఈ మ్యాచ్‌లోనైనా ఫాంలోకి రావాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు. అలాగే టీ20ల్లో కోహ్లీ మ‌రో 56 ప‌రుగులు చేస్తే ఈ ఫార్మాట్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన బ్యాట‌ర్‌గా నిలుస్తాడు. దీంతో విరాట్ కోహ్లీ ఆ రికార్డును నేటి మ్యాచ్‌లో అందుకోవాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు.

 పిచ్‌

పిచ్‌

ఈడెన్‌గార్డెన్ పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తుంది. తొలి టీ20 మ్యాచ్‌లోనే ఇది రుజువైంది. మ్యాచ్‌పై మంచు ప్రభావం ఎక్కువ‌గా ఉంటుంది. దీంతో టాస్ గెలిచిన జట్టు చేజింగ్ ఎంచుకునే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. సెకండ్ ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేసే జ‌ట్టుకు కాస్త ఇబ్బంది ఉంటుంది. క్రీజులో బ్యాట‌ర్లు కుదురుకుంటే భారీ స్కోర్ చేసే అవ‌కాశం ఉంది. ఇక ఈడెన్‌గార్డెన్‌లో నేడు వాతావ‌ర‌ణం పొడిగా ఉండ‌నుంది.

 తుది జట్లు (అంచనా)

తుది జట్లు (అంచనా)

భారత్‌:

రోహిత్ శ‌ర్మ (కెప్టెన్‌), ఇషాన్‌, విరాట్‌, రిష‌బ్‌ పంత్ (వికెట్ కీప‌ర్‌), సూర్యకుమార్ యాద‌వ్‌, వెంకటేశ్ అయ్య‌ర్‌, దీప‌క్ చాహ‌ర్/శార్దూల్ ఠాకూర్‌, భువనేశ్వర్ కుమార్, హర్షల్‌ పటేల్‌, రవి బిష్ణోయ్‌, చాహల్‌.

విండీస్‌:

బ్రాండన్‌ కింగ్‌, కైల్‌ మేయర్స్‌, నికోల‌స్ పూరన్‌(వికెట్ కీప‌ర్), పావెల్‌, కీర‌న్‌ పొలార్డ్‌ (కెప్టెన్‌), హోల్డర్‌, ఆలెన్‌, షెఫర్డ్‌, ఒడీన్‌ స్మిత్‌, అకీల్‌ హోసేన్‌, కాట్రెల్‌.

Story first published: Friday, February 18, 2022, 8:14 [IST]
Other articles published on Feb 18, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X