న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఈడెన్‌‌లో విండిస్ ఒకే ఒక్క సిక్స్: టీ20ల్లో ఆరోసారి

India vs West Indies, 1st T20I: Sixth time in T20Is that West Indies could manage just a solitary six in their innings

హైదరాబాద్: టీ20 క్రికెట్ అంటేనే పరుగుల వరద... సిక్సర్లు, ఫోర్లు... బంతి స్టేడియం దాటిందంటే చాలు అభిమానుల్లో వచ్చే మజానే వేరు. అలాంటి టీ20 మ్యాచ్ పేలవంగా సాగితే అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతారు. సరిగ్గా ఇలానే సాగింది భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టీ20.

సెహ్వాగ్ దారిలో వెంకటేశ్ ప్రసాద్: బౌలింగ్ కోచ్ పదవికి రాజీనామా!సెహ్వాగ్ దారిలో వెంకటేశ్ ప్రసాద్: బౌలింగ్ కోచ్ పదవికి రాజీనామా!

ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి కేవలం రెండు సిక్సర్లే బాదారు. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ కేవలం ఒకే ఒక్క సిక్స్‌ మాత్రమే కొట్టింది. 20 ఓవర్ల పాటు క్రీజులో ఉన్న విండిస్ బ్యాట్స్‌మెన్ 8 వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది. ఇందులో 13 ఫోర్లతో పాటు ఒకే ఒక్క సిక్స్‌ ఉండటం విశేషం.

ఈ సిక్సు కూడా ఆ జట్టు హిట్టర్ కీరన్ పొలార్డ్ బాదడం విశేషం. ఇలా ఓ టీ20 మ్యాచ్‌లో వెస్టిండిస్ జట్టు ఒక సిక్స్ మాత్రమే బాదడం ఆరోసారి. గతంలో న్యూజిలాండ్‌ (2006), శ్రీలంక (2009), జింబాబ్వే (2010), శ్రీలంక (2010), పాకిస్థాన్‌ (2016)లతో జరిగిన టీ20 మ్యాచ్‌ల్లో కూడా ఒకే సిక్స్ నమోదైంది.

 ఒక్క సిక్స్ కూడా నమోదు చేయలేదు

ఒక్క సిక్స్ కూడా నమోదు చేయలేదు

2010లో హోబర్ట్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో విండిస్ జట్టు ఒక్క సిక్స్ కూడా నమోదు చేయలేదు. కాగా, ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండిస్ (109/8) నమోదు చేసిన ఈ స్కోరు టీ20 చరిత్రలో భారత్‌పై అత్యల్ప స్కోరు కావడం విశేషం. అంతకముందు 2014లో మిర్‌పుర్ వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండిస్ జట్టు(129/7) పరుగులు చేసింది.

స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా

స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా

కాగా, స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా కూడా తడబడింది. 45 పరుగులకే నాలుగు వికెట్లు చేజార్చుకుని కష్టాల్లో చిక్కుకుంది. పేస్‌ బౌలర్‌ థామస్‌ (2/21) ఆరంభంలోనే భారత జట్టుని దెబ్బకొట్టాడు. 16 పరుగులకే ఓపెనర్లిద్దరినీ పెవిలియన్‌కు చేర్చాడు. ఓపెనర్ రోహిత్‌ శర్మని (6) తొలి ఓవర్లోనే ఔట్ చేశాడు.

ధావన్‌ను బౌల్డ్ చేసిన థామస్‌

ధావన్‌ను బౌల్డ్ చేసిన థామస్‌

ఆ తర్వాతి ఓవర్లో మరో ఓపెనర్ శిఖర్ ధావన్‌(3)ను బౌల్డ్‌ చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్‌‌(16)ను కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ ఔట్‌ చేశాడు. అనంతరం పంత్‌ను కూడా బ్రాత్‌వైటే పెవిలియన్‌కు చేర్చాడు. ఈ దశలో తీవ్ర ఒత్తిడిలో దినేశ్‌ కార్తీక్‌ కీలక ఇన్నింగ్స్‌తో భారత్‌ను ఆదుకున్నాడు.

 పాండేను పెవిలియన్‌కు చేర్చిన పియర్‌

పాండేను పెవిలియన్‌కు చేర్చిన పియర్‌

అతడికి మనీష్‌ పాండే అండగా నిలిచాడు. పొలార్డ్‌ వేసిన ఓ ఓవర్లో దినేశ్ కార్తీక్‌ మూడు ఫోర్లు బాదాడు. విండిస్ బౌలర్లు భారత బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి తీసుకొస్తున్నప్పటికీ, భారత్‌ 14.5 ఓవర్లలో 83/4తో లక్ష్యం దిశగా సాగింది. ఈ క్రమంలో మనీష్ పాండేను పియర్‌ పెవిలియన్‌కు చేర్చాడు.

లక్నో వేదికగా రెండో టీ20

లక్నో వేదికగా రెండో టీ20

ఈ సమయంలో భారత్ విజయానికి కావాల్సింది 27 పరుగులే. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన కృనాల్‌ పాండ్యాకు మద్దతుగా దినేశ్ కార్తీక్‌ నిలవడంతో 17.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కుల్దీప్‌ యాదవ్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు లభించింది. రెండో టీ20 మంగళవారం లక్నో వేదికగా జరుగనుంది.

Story first published: Monday, November 5, 2018, 16:40 [IST]
Other articles published on Nov 5, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X