న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తొలి వన్డేలో సెంచరీ.. హెట్‌మెయిర్‌ సరికొత్త రికార్డు!!

India VS West Indies 1st ODI : Hetmyer's 5th Ton Creates Several Records || Oneindia Telugu
India vs West Indies 1st ODI: Shimron Hetmyer acheives new feat youngest player after 5th odi century

చెన్నై: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియంలో టీమిండియాతో జరిగిన తొలి వన్డేలో వెస్టిండీస్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 288 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్.. 47.5 ఓవర్లలో 2 వికెట్లకు 291 పరుగులు చేసి గెలిచింది. యువ బ్యాట్స్‌మెన్ షిమ్రోన్‌ హెట్‌మెయిర్‌ (106 బంతుల్లో 139; 11 ఫోర్లు, 7 సిక్సర్లు) భారత బౌలర్లపై విరుచుకుపడి అద్భుత సెంచరీ చేసాడు.

<strong>టెస్టు, వన్డే మ్యాచ్‌ల అరంగేట్రంలో సెంచరీలు.. తొలి క్రికెటర్‌గా ఆబిద్‌ అలీ రికార్డు!!</strong>టెస్టు, వన్డే మ్యాచ్‌ల అరంగేట్రంలో సెంచరీలు.. తొలి క్రికెటర్‌గా ఆబిద్‌ అలీ రికార్డు!!

 హెట్‌మెయిర్‌ సరికొత్త రికార్డు:

హెట్‌మెయిర్‌ సరికొత్త రికార్డు:

చెన్నై వన్డేలో హెట్‌మెయిర్‌ కేవలం 85 బంతుల్లో 4 సిక్స్‌లు, 8 ఫోర్లతో సెంచరీ చేసాడు. వన్డేల్లో హెట్మయిర్‌కు ఇది ఐదవ సెంచరీ కాగా.. టీమిండియాపై రెండో సెంచరీ. హెట్‌మెయిర్‌ తాజా సెంచరీతో సరికొత్త రికార్డు సృష్టించాడు. వెస్టిండీస్‌ తరఫున అతి తక్కువ ఇన్నింగ్స్‌లో ఐదు వన్డే సెంచరీలు సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. 38వ ఇన్నింగ్స్‌లలోనే ఐదు సెంచరీలు చేసాడు ఈ వెస్టిండీస్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌.

గేల్‌@5:

గేల్‌@5:

వెస్టిండీస్‌ తరఫున తక్కువ ఇన్నింగ్స్‌ల్లో ఐదు వన్డే సెంచరీల మార్కును చేరిన జాబితాలో హెట్‌మెయిర్‌ టాప్‌ ప్లేస్‌కు దూసుకొచ్చాడు. ఈ జాబితాలో షాయ్‌ హోప్‌ (46 ఇన్నింగ్స్‌లు), గ్రీనిడ్జ్‌ (52 ఇన్నింగ్స్‌లు), రిచర్డ్స్‌ (54 ఇన్నింగ్స్‌లు), క్రిస్‌ గేల్‌ (66 ఇన్నింగ్స్‌లు), డేస్మండ్‌ హేన్స్‌ (69 ఇన్నింగ్స్‌లు), బ్రియాన్‌ లారా (83 ఇన్నింగ్స్‌లు)లు వరుసగా ఉన్నారు.

 85 బంతుల్లో సెంచరీ:

85 బంతుల్లో సెంచరీ:

288 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ ఆదిలోనే ఓపెనర్ ఆంబ్రిస్ (9) వికెట్ కోల్పోయింది. తొలుత ఆచితూచి ఆడిన విండీస్ బ్యాట్స్‌మెన్.. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు, సిక్సర్లు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ముఖ్యంగా హెట్‌మెయిర్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అనంతరం షై హోప్ కూడా సమయోచిత సెంచరీ (151 బంతుల్లో 102: 7 ఫోర్లు, 1 సిక్సర్) చేసి విండీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

విశాఖపట్నంలో రెండో వన్డే:

విశాఖపట్నంలో రెండో వన్డే:

ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్‌ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్‌ (88 బంతుల్లో 70; 5 ఫోర్లు, 1 సిక్స్‌), రిషబ్ పంత్‌ (69 బంతుల్లో 71; 7 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీలు సాధించారు. విండీస్‌ బౌలర్లలో కాట్రెల్, కీమో పాల్, జోసెఫ్‌ తలా 2 వికెట్లు తీశారు. ప్రస్తుతం మూడు వన్డేల సిరీస్‌లో విండీస్‌ 1-0తో ముందంజ వేసింది. రెండో వన్డే ఈనెల 18న విశాఖపట్నంలో జరుగుతుంది.

Story first published: Monday, December 16, 2019, 9:53 [IST]
Other articles published on Dec 16, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X