న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పవర్‌ హిట్టింగ్‌ శక్తి ఎక్కడినుండి వచ్చిందో తెలియట్లేదు: సెంచరీ హీరో హెట్‌మెయిర్‌

India vs West Indies 1st ODI: Don’t Know From Where the Power is Coming From Says Shimron Hetmyer

చెన్నై: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా చెన్నై చెపాక్‌ స్టేడయంలో జరిగిన తొలి వన్డేలో వెస్టిండీస్‌ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. విండీస్ విధ్వంసకర ఆటగాడు షిమ్రోన్‌ హెట్‌మెయిర్‌ (106 బంతుల్లో 139; 11 ఫోర్లు, 7 సిక్సర్లు) ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోయి తమ జట్టుకు సునాయాస విజయాన్ని అందించాడు. హెట్‌మెయిర్‌ కేవలం 85 బంతుల్లో 4 సిక్స్‌లు, 8 ఫోర్లతో సెంచరీ చేసాడు. వన్డేల్లో హెట్మయిర్‌కు ఇది ఐదవ సెంచరీ కాగా.. టీమిండియాపై రెండో సెంచరీ.

<strong>'నేనూ, రోహిత్‌ ఆకట్టుకోలేకపోయాం.. పంత్‌, శ్రేయస్‌లకు అవకాశం దొరికింది'</strong>'నేనూ, రోహిత్‌ ఆకట్టుకోలేకపోయాం.. పంత్‌, శ్రేయస్‌లకు అవకాశం దొరికింది'

ఈ సెంచరీ చాలా ప్రత్యేకం

ఈ సెంచరీ చాలా ప్రత్యేకం

సెంచరీ అనంతరం హెట్‌మెయిర్‌ బాదిన ఓ సిక్స్ ఏకంగా స్టేడియం బయట పడిందిదంటే మనోడి పవర్‌ హిట్టింగ్‌ ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఈ పవర్‌ హిట్టింగ్‌ శక్తి ఎక్కడినుండి వచ్చిందో తెలియట్లేదు అని హెట్‌మెయిర్‌ అంటున్నాడు. 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు అందుకున్న అనంతరం మాట్లాడుతూ... 'ఈ సెంచరీ నాకు చాలా ప్రత్యేకం. ఈ ఏడాది ఆరంభంలో సెంచరీ చేయగా.. మళ్లీ చివర్లో సెంచరీ చేశా. చాలాకాలం తర్వాత సెంచరీ చేయడం ఆనందాన్ని ఇచ్చింది' అని హెట్‌మెయిర్‌ తెలిపాడు.

నాకే అర్థం కావడం లేదు

నాకే అర్థం కావడం లేదు

'సెంచరీ చేసినపుడు జట్టు కూడా గెలిస్తే ముఖంలో చిరునవ్వు ఉంటుంది. గతంలో భారత్‌పై సెంచరీ చేసినప్పుడు మ్యాచ్‌ను ఓడిపోయాం. అది నాకు ఎక్కువ సంతృప్తినివ్వలేదు. ఇప్పుడు మాత్రం ఆనందంగా ఉంది. నేను హిట్టింగ్ చేయగలననే విషయం తెలుసు. కానీ.. ఈ పవర్‌ హిట్టింగ్‌ శక్తి ఎక్కడినుండి వచ్చిందో తెలియట్లేదు' అని హెట్‌మెయిర్‌ పేర్కొన్నాడు.

ధాటిగా బ్యాటింగ్‌ చేస్తాడనుకోలేదు

ధాటిగా బ్యాటింగ్‌ చేస్తాడనుకోలేదు

షాయ్‌ హోప్‌ మాట్లాడుతూ... 'నా ముఖంలో ఎక్కువ నవ్వు కనిపించలేదు. సుదీర్ఘ సమయం క్రీజ్‌లో పాతుకుపోవాలనే ప‍్రయత్నంలో మ్యాచ్‌ అంతా సీరియస్‌గా ఉన్నా. మా ఇద్దరిలో ఎవరో ఒకరు చివరివరకు క్రీజులో ఉంటే మ్యాచ్‌ను గెలుస్తామనుకున్నాం. హెట్‌మెయిర్‌ ఇంత ధాటిగా బ్యాటింగ్‌ చేస్తాడని అనుకోలేదు. స్పిన్నర్లపై హెట్‌మెయిర్‌ ఎదురుదాడి చేయడంతో ఒత్తిడి తగ్గింది. కీలక భాగస్వామ్యం కలిసొచ్చింది' అని చెప్పుకొచ్చాడు. హోప్‌ (102 నాటౌట్‌; 151 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీ చేసిన విషయం తెలిసిందే.

హెట్‌మెయిర్‌ సరికొత్త రికార్డు

హెట్‌మెయిర్‌ సరికొత్త రికార్డు

తాజా సెంచరీతో హెట్‌మెయిర్‌ సరికొత్త రికార్డు సృష్టించాడు. వెస్టిండీస్‌ తరఫున అతి తక్కువ ఇన్నింగ్స్‌లో ఐదు వన్డే సెంచరీలు సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. 38వ ఇన్నింగ్స్‌లలోనే ఐదు సెంచరీలు చేసాడు ఈ వెస్టిండీస్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌. వెస్టిండీస్‌ తరఫున తక్కువ ఇన్నింగ్స్‌ల్లో ఐదు వన్డే సెంచరీల మార్కును చేరిన జాబితాలో హెట్‌మెయిర్‌ టాప్‌ ప్లేస్‌కు దూసుకొచ్చాడు. ఈ జాబితాలో షాయ్‌ హోప్‌ (46 ఇన్నింగ్స్‌లు), గ్రీనిడ్జ్‌ (52 ఇన్నింగ్స్‌లు), రిచర్డ్స్‌ (54 ఇన్నింగ్స్‌లు), క్రిస్‌ గేల్‌ (66 ఇన్నింగ్స్‌లు), డేస్మండ్‌ హేన్స్‌ (69 ఇన్నింగ్స్‌లు), బ్రియాన్‌ లారా (83 ఇన్నింగ్స్‌లు)లు వరుసగా ఉన్నారు.

Story first published: Monday, December 16, 2019, 12:33 [IST]
Other articles published on Dec 16, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X