న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఉదయం 11.30 గంటలకే మ్యాచ్: ధర్మశాల వాతావరణానికి లంక క్రికెటర్లు ఫిదా

By Nageshwara Rao
India vs Srilanka: First two ODIs to start at early

హైదరాబాద్: డిసెంబర్ 10న ధర్మశాల వేదికగా జరిగే తొలి వన్డేతో భారత్-శ్రీలంక జట్ల మధ్య మూడు వన్డేల సిరిస్ ప్రారంభం కానుంది. మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా తొలి రెండు వన్డేలు ఉదయం 11.30 గంటలకే ప్రారంభం కానున్నాయి. నిజానికి భారత్‌లో జరిగే వన్డేలన్నీ కూడా మధ్యాహ్నాం 1.30 గంటలకు ప్రారంభమై రాత్రి పది గంటలకల్లా ముగుస్తాయి.

అయితే ఈ సిరిస్‌లో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతుంది. ఉదయం 11.30 గంటలకే మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. దీనికి కారణం ఉంది. ఈ సిరిస్‌లో జరుగుతున్న తొలి రెండు వన్డేల్లో మొదటిది ధర్మశాల వేదికగా జరుగుతుండగా... రెండోది మొహాలీ వేదికగా జరగనుంది.

ఈ రెండు వేదికలు నార్త్ ఇండియాలో ఉండటం... చలికాలం కావడంతో రాత్రి మ్యాచ్‌లు ఆలస్యమైతే మంచు ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని భావించిన బీసీసీఐ ఈ రెండు వన్డేలను మాత్రం ఉదయం 11.30కే ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ మేరకు బీసీసీఐ ఇంతకముందే ప్రకటన చేసింది.

ఇక, ఈ సిరిస్‌లో చివరిదైన మూడో వన్డే విశాఖపట్నంలో జరగనుంది. ఈ వన్డే మాత్రం మధ్యాహ్నం 1.30 కే ప్రారంభం అవుతుంది. ఇదిలా ఉంటే ఆదివారం జరిగే తొలి వన్డే కోసం ఇప్పటికే ఇరు జట్లు ధర్మశాలకు చేరుకున్నాయి. శుక్రవారం ఇరు జట్లు నెట్ ప్రాక్టీస్ మొదలుపెట్టాయి.

ధర్మశాలలో ఉన్న ఆహ్లాదకర వాతావరణానికి శ్రీలంక క్రికెటర్లు ఫిదా అయ్యారు. హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ స్టేడియంలో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్ అనంతరం మూడు టీ20ల ప్రారంభం కానుంది. టీ20 మ్యాచ్‌లు రాత్రి 7 గంటలకు ప్రారంభం అవుతాయి.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, December 8, 2017, 18:43 [IST]
Other articles published on Dec 8, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X