అచ్చం అలానే.. హర్భజన్ బౌలింగ్ యాక్షన్‌ని దించేసిన కోహ్లీ (వీడియో)!!

ఇండోర్: టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ బౌలింగ్ యాక్షన్ చాలా భిన్నంగా ఉంటుంది. తేలికపాటి రన్నప్‌తో చేతులను పైకెత్తి వైవిధ్యంగా బౌలింగ్ చేస్తాడు. హర్భజన్ బౌలింగ్ యాక్షన్ గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు ఓ రెండు నెలల క్రితం ఓ బాలిక హర్భజన్ బౌలింగ్ యాక్షన్‌కి అచ్చంగా అలానే దించేసింది. తాజాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా అచ్చం అలానే భజ్జీ యాక్షన్‌ను దించేశాడు.

అచ్చం భజ్జీ యాక్షన్‌ను దించేశాడు:
మంగళవారం రాత్రి భారత్-శ్రీలంక జట్ల మధ్య ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో రెండో టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సెషన్‌లో భజ్జీని కోహ్లీ మళ్లీ గుర్తు చేశాడు. టాస్ గెలిచిన కోహ్లీ లంకను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. మ్యాచ్ ప్రారంభం అయ్యే ముందు టీమిండియా బౌలర్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ సమయంలో బంతిని అందుకున్న కోహ్లీ.. భజ్జీ శైలితో బౌలింగ్ వేసాడు. కోహ్లీ అచ్చం హర్భజన్ బౌలింగ్ యాక్షన్‌ని దించేసాడు.
కోహ్లీని చూసి నవ్వుకున్న భజ్జీ:
భజ్జీ శైలితో బౌలింగ్ ప్రాక్టీస్ చేసే క్రమంలో కోహ్లీ తన నవ్వు ఆపుకోలేకపోయాడు. పగలబడి మరీ నవ్వుకున్నాడు. అనంతరం మైదానంలోనే ఉన్న హర్భజన్‌ను కౌగిలించుకున్నాడు. ఆపై ఇర్ఫాన్ పఠాన్‌ను కూడా. కోహ్లీని చూసి ఇద్దరు నవ్వులు పూయించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన అభిమానులు తెగ నవ్వుకుంటున్నారు.

2016లో చివరి మ్యాచ్:
హర్భజన్ సింగ్ గత మూడేళ్లుగా జట్టుకి దూరంగా ఉంటున్నా.. తన క్రికెట్ కామెంట్రీతో అభిమానుల్ని అలరిస్తూనే ఉన్నాడు. టీమిండియా తరఫున చివరగా 2016 మార్చిలో యూఏఈపై మ్యాచ్ ఆడిన భజ్జీ.. ఆ తర్వాత మళ్లీ జట్టులోకి పునరాగమనం చేయలేదు. భారత్ తరఫున 103 టెస్టులాడిన హర్భజన్ సింగ్ 417 వికెట్లు పడగొట్టాడు. 236 వన్డేల్లో 269 వికెట్లు, 28 టీ20ల్లో 25 వికెట్లు తీశాడు.

ఐపీఎల్‌లో అలరిస్తున్న భజ్జీ:
హర్భజన్ టీమిండియాకు ఆడకున్నా.. ఐపీఎల్‌లో ఆడుతూ అభిమానుల్ని అలరిస్తున్నాడు. సుదీర్ఘకాలం ముంబై ఇండియన్స్‌కి ఆడిన భజ్జీ.. గత ఏడాది నుంచి చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు. గత సంవత్సరం చెన్నై తరపున మంచి ప్రదర్శనే చేసాడు. ఈ ఏడాది కూడా చెన్నై జట్టుకే ఆడుతున్నాడు.

టీమిండియా ఘన విజయం:
రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన 143 పరుగుల టార్గెట్‌ను భారత్ మూడు వికెట్లు కోల్పోయి 17.3 ఓవర్‌లోనే ఛేదించింది. కేఎల్ రాహుల్ (45; 32 బంతుల్లో 6 ఫోర్లు), శిఖర్ ధావన్ (32; 29 బంతుల్లో 2 ఫోర్లు), శ్రేయస్ అయ్యర్ (34; 26 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), కోహ్లీ ( 30 నాటౌట్; 17 బంతుల్లో 2 సిక్స్‌లు, 1 ఫోర్) విజయంలో కీలకపాత్ర పోషించారు. .
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications