న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అంపైర్ ఔట్ అనకముందే ధోనీయే చెప్పేశాడు..

India vs Sri Lanka, 1st ODI: MS Dhoni Asks For Review Even Before Umpire Raises Finger, Gets It Bang On

హైదరాబాద్: ధర్మశాల వేదికగా జరిగిన శ్రీలంక-భారత్ వన్డే మ్యాచ్‌లో అప్పటి వరకు విజయాల పరంపరలో ఉన్న టీమిండియా ఘోరపరాజయాన్ని చవిచూసింది. అయితే దీన్ని కొందరు నెటిజన్లు కోహ్లీ కొరతే టీం ఓడిపోవడానికి కారణమని అంటూ ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. ఇదిలా ఉంచితే టీంకు బలంగా నిలిచిన మహేంద్ర సింగ్ ధోనీ తన వంతు ప్రయత్నం చేసి టీం పరువు నిలబెట్టాడు. ఆఖరివరకు పోరాడిన ధోనీ చివరి వికెట్ కూడా కోల్పోవడంతో అసహనానికి గురైయ్యాడు. బౌండరీలనే టార్గెట్ చేసి ఆడి వికెట్‌ను కోల్పోయాడు.

ఎప్పుడూ డీఆర్‌ఎస్‌ కోరడంలో అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంఎస్‌ ధోనీని మించిన వారు లేరు! అని అతని అభిమానుల వ్యాఖ్య. ఇది మరోసారి రుజువైంది. ఎలా అంటే, తాజాగా శ్రీలంకతో ఆదివారం ధర్మశాలలో జరిగిన వన్డేలోనూ ధోనీ మరోసారి తన క్రికెట్‌ పరిజ్ఞానాన్ని చాటుకున్నాడు. ఎంత వేగంగా అంటే అంపైర్‌ వేలు పూర్తిగా పైకి ఎత్తకముందే డీఆర్‌ఎస్‌ కోరాడు.

శ్రీలంక స్పిన్నర్‌ పథిరన 32వ ఓవర్లో బుమ్రాను అంపైర్‌ ఎల్బీగా ప్రకటించాడు. అవతలి ఎండ్‌లో ఉన్న ధోనీ వెంటనే స్పందించాడు. తక్షణం రివ్యూ కోరాలని బుమ్రాకు సూచించాడు. రివ్యూ బుమ్రాకు అనుకూలంగానే వచ్చింది. బుమ్రాకు బంతి ఆఫ్‌ స్టంప్‌ పక్కగా వెళ్లేదని తేలింది. దీంతో అంపైర్‌ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోక తప్పలేదు.

ధోనీ తీసుకునే డీఆర్‌ఎస్‌ నిర్ణయాలు 90 శాతం వరకు కరెక్టవుతాయి. ఇదే నమ్మకాన్ని ధర్మశాలలో మరోసారి నిరూపించుకున్నాుడ. అతడి నైపుణ్యాన్ని చూసి అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అది అంపైర్‌ నిర్ణయ సమీక్ష పద్ధతి కాదని ధోనీ నిర్ణయ సమీక్ష పద్ధతి అని సరదాగా ట్వీట్లు చేస్తున్నారు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, December 11, 2017, 14:10 [IST]
Other articles published on Dec 11, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X