న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సఫారీలు బోణీ: 3వ టీ20లో దక్షిణాఫ్రికా ఘన విజయం

By Nageshwara Rao
 third T20

హైదరాబాద్: భారత్‌ మహిళాల జట్టుతో జరుగుతున్న ఐదు టీ20ల సిరిస్‌లో దక్షిణాఫ్రికా బోణి కొట్టింది. తొలి రెండు టీ20ల్లో ఓటమిపాలైన సఫారీ మహిళల జట్టు మూడో టీ20లో సమిష్టిగా రాణించారు. జోహెన్స్‌బర్గ్ వేదికగా భారత్‌తో జరిగిన మూడో టీ20లో దక్షిణాఫ్రికా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

134 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి నిర్దేశిత లక్ష్యాన్ని అందుకుంది. దక్షిణాఫ్రికా బ్యాట్స్ ఉమెన్‌లలో ఓపెనర్లు లీ (5), డీ వాన్ నికెరెక్ (26) తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరినప్పటికీ అనంతరం క్రీజులోకి వచ్చిన లూస్ (41; 34 బంతుల్లో 5 ఫోర్లు) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది.

భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొని పరుగులు రాబట్టింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ప్రీజ్ (20), ట్రైయాన్ (34) పరుగులతో రాణించి జట్టుని విజయతీరాలకు చేర్చారు. భారత బౌలర్లలో వాస్ట్రాకర్ 2 వికెట్లు తీసుకోగా, గైక్వాడ్, పాటిల్, పూనమ్ యాదవ్ తలో వికెట్ తీసుకున్నారు. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు 133 పరుగులకే ఆలౌటైంది.

కాగా, 5 వికెట్లు తీసి భారత ఓటమికి కారణమైన సఫారీ బౌలర్ షబ్‌నిమ్ ఇస్మాయిల్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ మ్యాచ్‌లో తన కెరీర్‌లోనే షబ్‌నిమ్ ఇస్మాయిల్ (5/30) అత్యుత్తమ గణాంకాలను నమోదు చేసింది.


భారత బ్యాటింగ్ తీరు సాగిందిలా:

సఫారీల విజయ లక్ష్యం 134

జోహెన్స్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత మహిళల జట్టు స్వల్ప స్కోరుకే కుప్పకూలింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో కొనసాగిన భారత బ్యాట్స్‌ ఉమెన్ల జోరు న్యూ వాండరర్స్ మైదానంలో మాత్రం కనిపించలేదు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హర్మన్‌ప్రీత్ కౌర్ సేన 17.5 ఓవర్లకు గాను 133 పరుగులకే ఆలౌటైంది.

దీంతో ఆతిథ్య దక్షిణాఫ్రికాకు 134 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. స్టార్ బ్యాట్స్‌ఉమన్ స్మృతి మంధాన(37), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(48) మాత్రమే చెప్పుకోదగ్గ ప్రదర్శన చేశారు. మిగతా క్రీడాకారిణులు పూర్తిగా విఫలమయ్యారు. మ్యాచ్ ఆరంభంలోనే ఓపెనర్ మిథాలీ రాజ్ డకౌట్‌గా వెనుదిరగడంతో భారత్ ఒత్తిడిలో పడింది.

Third T20

మిడిలార్డర్‌లో కీలకమైన వేద కృష్ణమూర్తి(23) ధాటిగా ఆడేందుకు ప్రయత్నించి స్వల్ప వ్యవధిలోనే వికెట్ చేజార్చుకుంది. సఫారీ బౌలర్లలో షబ్‌నిమ్ ఇస్మాయిల్ 5 వికెట్లు తీయడంతో భారత్ స్వల్ప స్కోరుకే కుప్పుకూలింది.

మిథాలీ డకౌట్
జోహెన్స్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. గత రెండు టీ20ల్లో అజేయ హాఫ్ సెంచరీలతో జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించిన మిథాలీ రాజ్ మూడో టీ20లో డకౌట్‌గా పెవిలియన్‌కు చేరింది. కాప్‌ వేసిన మొదటి ఓవర్‌ ఐదో బంతికి మిథాలి(0) లీకి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగింది. ప్రస్తుతం 5 ఓవర్లు ముగిసేసరికి భారత్‌ వికెట్‌ నష్టానికి 37 పరుగులు చేసింది. రెండో ఓవర్‌లో మంధాన వరుసగా నాలుగు ఫోర్లు బాదింది. ప్రస్తుతం మంధాన 24, కౌర్‌ 12 పరుగుతో క్రీజులో ఉన్నారు.

టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా
ఐదు టీ20ల సిరిస్‌లో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడో వన్డే ఆదివారం ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా మహిళల జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. రెండు జట్లు కూడా స్వల్ప మార్పులతో బరిలోకి దిగాయి. భారత జట్టులో రాధా యాదవ్ స్థానంలో గైక్వాడ్ జట్టులోకి వచ్చింది.

ఇక, దక్షిణాఫ్రికా జట్టులో ఖాకా స్థానంలో క్లాస్‌ను తుది జట్టులోకి తీసుకుంది. ఇప్పటికే ఈ సిరిస్‌లో రెండు మ్యాచ్‌లు నెగ్గిన భారత మహిళల జట్టు ఈ మ్యాచ్‌లోనూ నెగ్గి సిరీస్ నెగ్గాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌‌లో గెలిస్తే దక్షిణాఫ్రికా గడ్డపై ఒకే పర్యటనలో రెండు సిరీస్‌లు సొంతం చేసుకున్న మహిళల తొలి జట్టుగా భారత్‌ చరిత్ర సృష్టిస్తుంది.

ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం భారత్-దక్షిణాఫ్రికా పురుషుల జట్ల మధ్య మ్యాచ్‌ ప్రారంభమవుతుంది.

India Women (Playing XI):
Mithali Raj, Smriti Mandhana, Harmanpreet Kaur(c), Veda Krishnamurthy, Rajeshwari Gayakwad, Anuja Patil, Jemimah Rodrigues, Taniya Bhatia(w), Shikha Pandey, Pooja Vastrakar, Poonam Yadav

South Africa Women (Playing XI):
Lizelle Lee(w), Dane van Niekerk(c), Sune Luus, Mignon du Preez, Marizanne Kapp, Nadine de Klerk, Chloe Tryon, Shabnim Ismail, Masabata Klaas, Moseline Daniels, Raisibe Ntozakhe

Story first published: Sunday, February 18, 2018, 17:34 [IST]
Other articles published on Feb 18, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X