న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs South Africa: చరిత్ర సృష్టించేందుకు 281 పరుగుల దూరంలో విరాట్ కోహ్లీ

India vs South Africa: Virat Kohli on cusp of historic feat, eyes big record

హైదరాబాద్: బుధవారం విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరగనున్న తొలి టెస్టుతో టీమిండియా హోం సీజన్ ప్రారంభం కానుంది. కెప్టెన్‌గా, బ్యాట్స్‌మన్‌గా విరాట్ కోహ్లీ గత కొన్నాళ్లుగా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ డ్రాగా ముగిసిన నేపథ్యంలో కోహ్లీసేన ఇప్పుడు టెస్టు సిరీస్‌పై కన్నేసింది.

దక్షిణాఫ్రికాతో ఆరంభమయ్యే టెస్టు సిరిస్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనతకు చేరువలో ఉన్నాడు. ఈ సిరిస్‌లో విరాట్ కోహ్లీ మరో 281 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో 21వేల పరుగులు మైలురాయిని అందుకుంటాడు. విశాఖ టెస్టులో గనుక కోహ్లీ ఈ మైలురాయిని అందుకుంటే క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన క్రికెటర్‌గా కోహ్లీ చరిత్ర సృష్టిస్తాడు.

<strong>లండన్‌కు బుమ్రా: ముగ్గురు నిపుణులు వేర్వేరుగా పరీక్షిస్తారు!</strong>లండన్‌కు బుమ్రా: ముగ్గురు నిపుణులు వేర్వేరుగా పరీక్షిస్తారు!

కోహ్లీ మరో 281 పరుగులు చేస్తే

విరాట్ కోహ్లీ గనుక మరో 41 ఇన్నింగ్స్‌ల్లో 281 పరుగులు చేస్తే ప్రపంచ క్రికెట్‌లో అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న ఆటగాడిగా అరుదైన ఘనత సాధిస్తాడు. ప్రస్తుతం క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్(473 ఇన్నింగ్స్‌లు)తో 21వేల పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా అగ్రస్థానంలో ఉన్నాడు.

రెండో స్థానంలో బ్రియాన్ లారా

రెండో స్థానంలో బ్రియాన్ లారా

ఈ జాబితాలో వెస్టిండిస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా(485 ఇన్నింగ్స్‌లు) రెండో స్థానంలో ఉన్నాడు. ఇదిలా ఉంటే, దక్షిణాఫ్రికాపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మంచి రికార్డుని కలిగి ఉన్నాడు. ఆ జట్టుపై ఇప్పటివరకు మొత్తం 9 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 47.37 యావరేజితో 758 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా కోహ్లీ

అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా కోహ్లీ

సొంతగడ్డపై జరిగే సిరిస్‌ల్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి పేరుంది. కాగా, ప్రస్తుతం స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో టీమిండియానే ఫేవరేట్‌గా కనిపిస్తోంది. ప్రస్తుంత దక్షిణాఫ్రికా జట్టులో హషీమ్‌ ఆమ్లా, ఏబీ డివిలియర్స్‌ లాంటి మేటి ఆటగాళ్లు లేకపోవడమే ఇందుకు కారణం.

వెస్టిండిస్‌పై 2-0తో నెగ్గిన భారత్

వెస్టిండిస్‌పై 2-0తో నెగ్గిన భారత్

దక్షిణాఫ్రికా భారత పర్యటనకు రాకముందు టీమిండియా కరీబియన్‌ దీవుల్లో పర్యటించింది. ఆ పర్యటనలో ఆతిథ్య విండిస్‌పై 2-0తో సిరీస్‌ నెగ్గి ఛాంపియన్‌షిప్‌ను ఘనంగా ఆరంభించింది. దీంతో టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత క్రికెట్ జట్టు 120 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. దక్షిణాఫ్రికాపై కూడా విజయం సాధించి స్వదేశంలో ఘనంగా సిరిస్‌ను ప్రారంభించాలని భావిస్తోంది.

అరుదైన రికార్డు టీమిండియా సొంతం

అరుదైన రికార్డు టీమిండియా సొంతం

ఈ టెస్టు సిరిస్‌ను గనుక టీమిండియా కైవసం చేసుకుంటే అరుదైన రికార్డు సాధిస్తోంది. స్వదేశంలో ఇప్పటికే టీమిండియా వరుసగా పది టెస్టు సిరీస్‌లు గెలిచింది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాపై విజయం సాధిస్తే కోహ్లీసేన చరిత్ర సృష్టిస్తుంది. ఈ సిరీస్‌లో టీమిండియా గెలిస్తే స్వదేశంలో వరుసగా 11 టెస్టు సిరీస్‌లు నెగ్గిన ఏకైక జట్టుగా నిలుస్తుంది.

Story first published: Tuesday, October 1, 2019, 12:02 [IST]
Other articles published on Oct 1, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X