న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రహానె, భువీల గురించి సిగ్గు చేటు అంటూ మండిపడుతున్న ప్రభాకర్

India vs South Africa: Shame to exclude Rahane, Bhuvi, says Prabhakar

హైదరాబాద్: దక్షిణాఫ్రికాతో రెండో టెస్టుకు భారత తుది జట్టులో మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ అజింక్య రహానె, పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌లకు చోటు ఇవ్వకపోవడాన్ని మాజీ ఆల్‌రౌండర్‌ మనోజ్‌ ప్రభాకర్‌ తప్పుబట్టాడు. రహానెను రెండు టెస్టులకూ పక్కన పెట్టగా, తొలి టెస్టులో రాణించినప్పటికీ భువిని రెండో టెస్టులో ఆడించలేదు. ఈ విషయమై మనోజ్ ప్రభాకర్ స్పందించాడు.

''ఇది సిగ్గుచేటు. టీ20, వన్డే ఫామ్‌ ఆధారంగా టెస్టు జట్టును ఎంపిక చేయడం అర్థరహితం. టెస్టుల్లో కొత్త బంతిని ఆడటం ఒక ప్రత్యేకమైన కళ. ఉదాహరణకు రిషబ్‌ పంత్‌ ఉన్నాడు.. అతను 25-30 బంతుల్లో సెంచరీ కొట్టగలడు. మరి అతడిని టెస్టుల్లో ఆడిస్తారా? టెస్టుల్లో ఆడేందుకు భిన్నమైన టెక్నిక్‌ అవసరం.

కానీ ఇక్కడ ఒక బ్యాట్స్‌మన్‌ వన్డేల్లో డబుల్‌ సెంచరీ చేస్తే టెస్టు జట్టులోనూ అతడి స్థానం సుస్థిరం. అదీ మన సమస్య. దక్షిణాఫ్రికా సిరీస్‌లో రహానె ఆడాల్సింది. భువిని మళ్లీ తుది జట్టులోకి తీసుకోవాలి. అతను బంతిని బాగా స్వింగ్‌ చేస్తాడు.

అలా చేస్తే దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ ఇబ్బంది పడతారు. సీమ్‌ను వాళ్లు బాగా ఆడతారు కానీ.. స్వింగ్‌తో ఇబ్బంది పడతారు. భువి మిగతా బౌలర్లందరి కన్నా మెరుగైన ప్రత్యామ్నాయం. అలాంటి బౌలర్‌ తొలి 20 ఓవర్లలో కీలక పాత్ర పోషిస్తాడు. తొలి 20 ఓవర్లలో బౌలింగ్‌, బ్యాటింగ్‌ ఎలా చేయాలో తెలియకుంటే టెస్టు మ్యాచ్‌ గెలవడం కష్టం'' అని చెప్పాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Sunday, January 21, 2018, 14:18 [IST]
Other articles published on Jan 21, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X