న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మూడో టెస్ట్.. రాంచీ పిచ్‌లో రివర్స్‌ స్వింగ్‌, స్పిన్‌లదే కీలక పాత్ర!!

India vs South Africa: Faf du Plessis said Reverse swing and spin will play major role in Ranchi test

రాంచీ: రాంచీ పిచ్‌ స్పిన్‌కు అనుకూలిస్తుందనే అనుకుంటున్నా. నేను పిచ్‌ను చూశా. రివర్స్‌ స్వింగ్‌, స్పిన్‌లు కీలక పాత్ర పోషించడం ఖాయం అని దక్షిణాఫ్రికా కెప్టెన్‌ ఫాఫ్ డుప్లెసిస్‌ అంటున్నాడు. మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన మొదటి రెండు టెస్టులను ఆతిధ్య దక్షిణాఫ్రికా కోల్పోయింది. విశాఖ, పుణె టెస్టుల్లో ప్రొటీస్ జట్టు కనీస పోటీ ఇవ్వలేకపోయింది. పేస్‌తో పాటు స్పిన్‌ బౌలింగ్‌లో ఉచ్చులో చిక్కుకుని సఫారీలు సిరీస్‌ను కోల్పోయారు. ఈ నేపథ్యంలో చివరిదైన మూడో టెస్టులో గెలిచి పరువు నిలుపుకోవాలని దక్షిణాఫ్రికా చూస్తోంది.

India vs Bangladesh: గంగూలీ ఆహ్వానం.. భారత్‌-బంగ్లా మ్యాచ్‌కి ప్రధానులు!!India vs Bangladesh: గంగూలీ ఆహ్వానం.. భారత్‌-బంగ్లా మ్యాచ్‌కి ప్రధానులు!!

రాంచీ టెస్ట్ కోసం ఇరు జట్లు ఇప్పటికే అక్కడ తీవ్ర సాధన చేస్తున్నాయి. ప్రాక్టీస్ సందర్భంగా డుప్లెసిస్‌ పిచ్‌ను పరిశీలించాడు. ఈ సందర్భంగా డుప్లెసిస్‌ మాట్లాడుతూ... 'రాంచీ పిచ్‌ స్పిన్‌కు అనుకూలిస్తుందనే అనుకుంటున్నా. నేను పిచ్‌ను చూశాడు. చాలా పొడిగా ఉంది. రివర్స్‌ స్వింగ్‌, స్పిన్‌లు కీలక పాత్ర పోషించడం ఖాయం. తొలి ఇన్నింగ్స్‌లో భారీ పరుగులు చేయాలి. సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు చేస్తేనే విజయం సాధ్యమవుతుంది. మొదటి ఇన్నింగ్స్‌లో భారీ పరుగులు చేస్తే.. రెండో ఇన్నింగ్స్‌లో విజయంపై నమ్మకంగా ఉండొచ్చు' అన్నాడు.

దక్షిణాఫ్రికా స్టార్ పేసర్‌ రబడా మాట్లాడుతూ... 'భారత బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. పేసర్లు బంతిని రివర్స్‌ స్వింగ్‌ చేస్తున్నారు. మరోవైపు స్పిన్నర్లు కూడా బాగా రాణిస్తున్నారు. మేము బంతిని రివర్స్‌ స్వింగ్‌ చేయడంలో విఫలమయ్యాం. రివర్స్‌ స్వింగ్‌ మా ప్రధాన ఆయుధం. అయినప్పటికీ మేము సక్సెస్‌ కాలేకపోయాం. ఈ కారణంగానే సిరీస్‌ కోల్పోయాం' అని రబడా పేర్కొన్నాడు.

మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ 2-0 ఆధిక్యంలో ఉంది. విశాఖ, పుణె టెస్టుల్లో దక్షిణాఫ్రికాను భారత్ చిత్తుచేసింది. ఇరు జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ అక్టోబర్ 19 నుంచి రాంచీలో ప్రారంభమవుతుంది. టెస్టు చాంపియన్‌షిప్‌ పాయింట్లలో 200 పాయింట్లతో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. చివరి టెస్టును భారత్‌ గెలిస్తే 240 పాయింట్లు సాధిస్తుంది. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) టెస్టు చాంపియన్‌షిప్‌ ఆరంభించిన తర్వాత భారత్‌.. వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్‌ సాధించింది. దాంతో 120 పాయింట్లను ఖాతాలో వేసుకుంది.

Story first published: Thursday, October 17, 2019, 17:02 [IST]
Other articles published on Oct 17, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X