న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సెంచూరియన్ టెస్టు: కోహ్లీసేన విజయ లక్ష్యం 287

India Vs South Africa

సెంచూరియన్‌ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఆతథ్య దక్షిణాఫ్రికా జట్టు భారత్‌కు 287 పరుగుల విజయ లక్ష్యం నిర్దేశించింది. నాలుగో రోజైన మంగళవారం ఓవర్‌నైట్‌ స్కోరు 90/2తో బ్యాటింగ్‌ కొనసాగించిన దక్షిణాఫ్రికా జట్టు 91.3 ఓవర్లకు 258 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో షమి 4, బుమ్రా 3 వికెట్లు తీసుకోగా... ఇషాంత్‌ శర్మ 2, అశ్విన్‌ ఒక వికెట్‌ తీసుకున్నారు.

సెంచూరియన్‌లో నాలుగో ఇన్నింగ్స్‌లో ఇప్పటి వరకు ఓ జట్టు ఛేదించిన అత్యధిక విజయ లక్ష్యం 226 పరుగులు. దీని ప్రకారం చూస్తే టీమిండియా ఛేదించాల్సిన 287 పరుగులు భారీ లక్ష్యంగానే కనిపిస్తోంది. ఈ టెస్టులో భారత బ్యాట్స్‌మన్‌ నిలిస్తే మ్యాచ్‌ డ్రా అవుతుంది. లక్ష్యాన్ని ఛేదిస్తే టెస్టులో విజయం సాధిస్తుంది.

టీ విరామం.. దక్షిణాఫ్రికా 230/7

సెంచూరియన్ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. టీ విరామ సమయానికి దక్షిణాఫ్రికా 82 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యాన్ని కలుపుకుని 258 పరుగుల ఆధిక్యంలో ఉంది. క్రీజులో డుప్లెసిస్(37), రబడ(0) పరుగులేమీ చేయకుండా ఉన్నాడు. కెప్టెన్ డుప్లెసిస్ నిలకడగా ఆడుతూ అదను చూసి పరుగులు రాబడుతున్నాడు. ఈ క్రమంలో టెస్టుల్లో డుప్లెసిస్ మూడు వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు.

3వేల పరుగుల మైలురాయిని అందుకున్న డుప్లెసిస్

సెంచూరియన్ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ మూడు వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. దక్షిణాఫ్రికా తరుపున ఈ ఘనత సాధించిన 14న ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు.

ఏడు వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా
సెంచూరియన్ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా ఏడు వికెట్లు కోల్పోయింది. నాలుగో రోజైన మంగళవారం లంచ్ విరామం అనంతరం దక్షిణాఫ్రికా ఆటగాళ్లు డుప్లెసిస్, ఫిలాందర్ చాలాసేపు వికెట్ కాపాడుకొంటూ స్కోర్ పెంచేందుకు ప్రయత్నం చేశారు.

అయితే ఇషాంత్‌ శర్మ వరుస ఓవర్లలో రెండు వికెట్లు తీశాడు. ఇన్నింగ్స్ 74వ ఓవర్‌ నాలుగో బంతికి నిలకడగా ఆడుతున్న ఫిలాండర్‌ (26)ను పెవిలియన్‌ పంపించాడు. ఆ తర్వాత ఇన్నింగ్స్ 76వ ఓవర్‌ చివరి బంతికి కేశవ్‌ మహరాజ్‌ (6)ను ఔట్‌ చేశాడు. కేశవ్ మహారాజ్ కీపర్‌ పార్థివ్‌ పటేల్‌ క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

దీంతో 79 ఓవర్లు ముగిసేసరికి దక్షిణాఫ్రికా 7 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసి 251 పరుగుల ఆధిక్యంలో ఉంది. క్రీజులో డుప్లెసిస్(32), రబడ పరుగులేమీ చేయకుండా ఉన్నారు.

లంచ్ విరామానికి దక్షిణాఫ్రికా 173/5
సెంచూరియన్ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు, నాలుగో రోజు లంచ్ విరామానికి దక్షిణాఫ్రికా 5 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో డుప్లెసిస్ (12), ఫిలాండర్ (3) పరుగులతో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్ కలుపుకొని ఓవరాల్‌గా 201 పరుగుల ఆధిక్యంలో ఉంది. డివిలియర్స్ 80 పరుగులు చేసి ఔటయ్యాడు. తొలి సెషన్‌లో పేస్ బౌలర్ షమి విజృంభించడంతో సౌతాఫ్రికా వరుసగా వికెట్లు కోల్పోయింది. మంగళవారం దక్షిణాఫ్రికా కోల్పోయిన మూడు వికెట్లు షమీకే దక్కడం విశేషం.

డివిలియర్స్ ఔట్‌: ఐదు వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా

భారత్ తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా ఐదో వికెట్ కోల్పోయింది. ఏబీ డివిలియర్స్‌ (80; 121 బంతుల్లో 10×4)ను మొహమ్మద్ షమీ పెవిలియన్‌కు పంపించాడు. రెండో ఇన్నింగ్స్‌లో 3 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ దక్షిణాఫ్రికాను డివిలియర్స్ ఆదుకున్నాడు.

India Vs South Africa, 2nd Test, Day 4: Hosts eye big innings from De Villiers for commanding total

దీంతో భారత్‌కు 144 పరుగుల వరకూ మరో వికెట్‌ దక్కలేదు. ఓపెనర్‌ డీన్‌ ఎల్గర్‌ (60; 108 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సు) వేగంగా ఆడుతున్నాడు. అతనికి మద్దతుగా డుప్లెసిస్‌ పరుగులేమి చేయకుండా క్రీజులోకి ఉన్నాడు. ప్రస్తుతం 53 ఓవర్లకు గాను 172/5 స్కోరుతో కొనసాగుతోంది.

భారత్ బౌలర్ల చేతిలో సఫారీలకు చుక్కలు

రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో బౌలర్లకు పెద్దగా కలిసిరాకపోయిన సెంచూరియన్ మైదానం రెండో ఇన్నింగ్స్‌లో అనుకూల ఫలితాలిచ్చేలా ఉంది. కోహ్లీ సేన బంతుల మాయాజాలాన్ని సఫారీలపై ప్రదర్శిస్తున్నారు. జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీ ధాటికి దక్షిణాఫ్రికా వికెట్లు 41,45,47ఓవర్లకు గాను ఒకొక్క వికెట్‌ను కోల్పోతూ వస్తోంది. ప్రస్తుతం 166/5గా సఫారీ స్కోరును కొనసాగిస్తుంది.

భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా రెండో టెస్టు నాలుగో రోజు స్కోరు కార్డు:

నాలుగో రోజు ప్రారంభమైన ఆట:

మంగళవారం దక్షిణాఫ్రకా ఓవర్ నైట్ స్కోరు 90/2తో మ్యాచ్ ను ఆరంభించింది. 34 ఓవర్లకు గాను దక్షిణాఫ్రికా 105పరుగులను చేసింది.

ప్రస్తుతం డీన్ ఎల్గర్(39), డెవిలియర్స్(63) పరుగులతో క్రీజులో ఉన్నారు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 335 పరుగులు చేయగా, భారత్‌ 307 పరుగులకు ఆలౌటైంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, January 16, 2018, 21:17 [IST]
Other articles published on Jan 16, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X