న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs South Africa, 3rd T20I హైలెట్స్: సొంతగడ్డపై టీమిండియా చెత్త రికార్డు

India vs South Africa, 2019: 3rd T20I – India’s biggest home defeat

హైదరాబాద్: మూడు టీ20ల సిరిస్‌ను సఫారీలు సమం చేశారు. ఆదివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో టీమిండియాతో జరిగిన మూడో టీ20లో దక్షిణాఫ్రికా 9 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. భారత్ నిర్దేశించిన 135 పరుగుల విజయ లక్ష్యంను దక్షిణాఫ్రికా 16.5 ఓవర్లలో ఛేదించి విజయాన్ని అందుకుంది.

ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను దక్షిణాఫ్రికా 1-1తో సమం చేసింది. మొదటి మ్యాచ్ వర్షార్పణం కాగా.. రెండో మ్యాచ్ టీమిండియా, మూడో మ్యాచ్ దక్షిణాఫ్రికా గెలిచాయి. దీంతో భారత గడ్డపై సఫారీలు తమ రికార్డుని పదిలం చేసుకున్నారు. స్వదేశంలో దక్షిణాఫ్రికాపై టీమిండియా ఇప్పటివరకు ఒక్క టీ20 సిరిస్ కూడా నెగ్గలేదు.

అబుదాబిలో T10 లీగ్: కలందర్స్ జట్టు ఐకానిక్ ప్లేయర్‌గా అఫ్రిదిఅబుదాబిలో T10 లీగ్: కలందర్స్ జట్టు ఐకానిక్ ప్లేయర్‌గా అఫ్రిది

 చిన్నస్వామిలో టీమిండియా చెత్త రికార్డు

చిన్నస్వామిలో టీమిండియా చెత్త రికార్డు

3 - బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో టీమిండియా ఇప్పటివరకు ఆడిన ఐదు టీ20ల్లో మూడింట ఓడిపోయింది. టీమిండియా అత్యధిక టీ20ల్లో ఓటమిపాలైన టీ20ల్లో చిన్నస్వామి స్టేడియం అగ్రస్థానంలో ఉంది. అంతేకాదు ఒక క్యాలండర్ ఇయర్‌లో రెండు టీ20 మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చిన వేదికగా చిన్నస్వామి స్టేడియం అరుదైన ఘనత సాధించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20లో టీమిండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే.

భారత దేశంలో అతిపెద్ద ఓటమి

భారత దేశంలో అతిపెద్ద ఓటమి

9 - ఆదివారం దక్షిణాఫ్రికా చేతిలో టీమిండియా 9 వికెట్ల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. సొంతగడ్డపై టీమిండియా 9 వికెట్ల తేడాతో ఓడిపోవడం ఇది నాలుగోసారి. అయితే, టీ20ల్లో మాత్రం ఇదే మొదటిసారి. చివరగా 2017లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా టీ20ల్లో 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.

డీకాక్ తొలిసారి

డీకాక్ తొలిసారి

1 - అంతర్జాతీయ క్రికెట్‌లో దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్‌గా క్వింటన్ డీకాక్‌కు ఇదే తొలి విజయం. అంతకముందు డీకాక్ కెప్టెన్సీలో దక్షిణాఫ్రికా రెండు వన్డేలు, ఒక టీ20 ఆడి అన్నింట్లో ఓటమిపాలైంది.

2 - కెప్టెన్‌గా క్వింటన్ డీకాక్ రెండు టీ20ల్లోనూ హాఫ్ సెంచరీలు సాధించాడు. దీంతో క్వింటన్ డీకాక్ అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో కెప్టెన్సీ అరంగేట్రంలోనే వరుసగా యాభైకి పైగా పరుగులు సాధించిన మూడో క్రికెటర్‌గా గుర్తింపు సాధించాడు. ఈ జాబితాలో పాల్‌ స్టిర్లింగ్‌(ఐర్లాండ్‌) అగ్రస్థానంలో ఉండగా.. నవనీత్‌ సింగ్‌(కెనడా) రెండో స్థానంలో ఉన్నాడు.

డీకాక్, ధావన్ మైలురాళ్లు

డీకాక్, ధావన్ మైలురాళ్లు

1018 - దక్షిణాఫ్రికా తరుపున టీ20ల్లో వెయ్యి పరుగులు సాధించిన ఆరో క్రికెటర్‌గా డీకాక్ అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో వెయ్యి పరుగులు సాధించిన వికెట్‌ కీపర్ల జాబితాలో కుమార సంగక్కర(శ్రీలంక)తో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాడు. డీకాక్‌ కేవలం 38 ఇన్నింగ్స్‌లో వెయ్యి పరుగుల మైలురాయిని చేరాడు. ఈ జాబితాలో బ్రెండన్‌ మెకల్లమ్‌(31), మహ్మద్‌ షెహ్‌జాద్‌(37)లు వరుసగా తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

7031 - టీ20ల్లో ఏడువేల పరుగుల మైలురాయిని అందుకున్న నాలుగో భారత క్రికెటర్‌గా శిఖర్ ధావన్ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌కి ముందు ధావన్ ఈ ఘనత అందుకోవడానికి నాలుగు పరుగులు అవసరమయ్యాయి. కాగా, మూడో టీ20ల్లో ధావన్ 36 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

Story first published: Monday, September 23, 2019, 15:24 [IST]
Other articles published on Sep 23, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X