న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మంధాన రికార్డు హాఫ్ సెంచరీ: తొలి టీ20లో భారత్ ఓటమి

Indian Team lost In Women's 1st T20 | Oneindia Telugu
India vs New Zealand: Smriti Mandhana hammers fastest fifty for India in Women’s T20Is

హైదరాబాద్: న్యూజిలాండ్‌ గడ్డపై భారత మహిళా జట్టు ఓపెనర్ స్మృతి మంధాన అరుదైన రికార్డుని నెలకొల్పింది. వెల్లింగ్టన్ వేదికగా బుధవారం న్యూజిలాండ్ మహిళల జట్టుతో ప్రారంభమైన తొలి టీ20లో కేవలం 24 బంతుల్లోనే 6ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ సాధించింది. భార‌త్ త‌ర‌ఫున టీ20ల్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ నమోదు చేసిన బ్యాట్స్‌వుమ‌న్‌గా మంధాన చరిత్ర సృష్టించింది. ఓపెనర్‌ స్మృతి మంధాన (58:34 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), జెమీమా రోడ్రిగ్స్‌ (39: 33 బంతుల్లో 6 ఫోర్లు)లు రాణించినప్పటికి జట్టులోని సహచర క్రికెటర్లు ఘోరంగా విఫలం కావడంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయింది.

'కాఫీ విత్‌ కరణ్‌ షో' వ్యాఖ్యలు: పాండ్యా, రాహుల్‌పై కేసు నమోదు'కాఫీ విత్‌ కరణ్‌ షో' వ్యాఖ్యలు: పాండ్యా, రాహుల్‌పై కేసు నమోదు

హాఫ్ సెంచరీతో రాణించిన మంధాన

హాఫ్ సెంచరీతో రాణించిన మంధాన

అంతకు ముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్‌ మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. టీ20ల్లోకి ప్రియా పూనియా అరంగేట్రం చేయగా.. సీనియర్‌ క్రికెటర్‌ మిథాలీ రాజ్‌కు తుదిజట్టులో అవకాశం దక్కలేదు. భారత బౌలర్లలో అరుంధతి రెడ్డి, రాధా యాదవ్‌, దీప్తీ శర్మ, పూనమ్‌ యాదవ్‌ తలో వికెట్‌ తీసుకున్నారు.

23 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

23 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

అనంతరం 160 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళల జట్టు 19.1 ఓవర్లలో 136 పరుగులకు ఆలౌటైంది. దీంతో తొలి టీ20లో న్యూజిలాండ్ జట్టు 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో హర్మన్‌ సేనకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. అరంగేట్ర బ్యాటర్‌ ప్రియా(4) తీవ్రంగా నిరాశపర్చింది. అనంతరం క్రీజులోకి వచ్చిన జెమీమాతో కలిసి ఓపెనర్‌ మంధాన స్కోరు బోర్డుని పరిగెత్తించింది.

మంధాన ఔటైన తర్వాత

మంధాన ఔటైన తర్వాత

రెండో వికెట్‌కు 98 పరుగుల జోడించిన అనంతరం అద్భత క్యాచ్‌కు​ మంధాన (58:34 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) పెవిలియన్‌కు చేరింది. ఈ సమయంలో భారత విజయానికి 51 బంతుల్లో 58 పరుగులు కావాలి. ఈ పరిస్థితుల్లో భారత విజయం లాంఛనమేనని అందరూ భావించారు. కానీ కివీస్‌ బౌలర్లు చెలరేగడంతో భారత బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. మంధాన ఔటైన తర్వాత స్వల్ప వ్యవధిలోనే రోడ్రిగ్స్ వెనుదిరగడంతో టీమిండియా వరుసగా వికెట్లను చేజార్చుకుంది.

స్వల్ప వ్యవధిలోనే వికెట్లను కోల్పోయిన భారత్

స్వల్ప వ్యవధిలోనే వికెట్లను కోల్పోయిన భారత్

భారత్ తరుపున ఐదుగురు బ్యాట్స్‌వుమెన్ రెండంకెల స్కోరు సాధించలేకపోయారు. జెమీమా రోడ్రిగ్స్‌ (38), హేమలత (3), అనూజ పాటిల్‌(0), అరుంధతి రెడ్డి(2), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌(17), దీప్తి శర్మ(5), తానియ బాటియా(1), పూనమ్‌(3)ల వికెట్లు వరుసగా కోల్పోయింది. కివీస్‌ బౌలర్లలో తాహుహు 3 వికెట్లు.. కస్పెరెక్‌, కేర్‌లు రెండేసి వికెట్లు.. డివైన్‌, మేర్‌, సట్టర్‌వైట్‌లకు తలో వికెట్‌ తీశారు.

Story first published: Wednesday, February 6, 2019, 16:12 [IST]
Other articles published on Feb 6, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X