న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియాకు భారీ భారీ షాక్‌.. రోహిత్‌, కోహ్లీ, రాహుల్ ఔట్‌

ICC Cricket World Cup 2019 : IND V NZ : Rohit Sharma,Virat Kohli,KL Rahul Gone In 19 Balls
India vs New Zealand Semi Final: Top order collapse leaves IND reeling, Matt Henry bagged two, Boult dismissed Kohli

మాంచెస్టర్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి సెమీస్ మ్యాచ్‌లో టీమిండియాకు భారీ భారీ షాక్‌ తాకిలింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ సహా కెప్టెన్ విరాట్ కోహ్లీలు పెవిలియన్ చేరారు. కివీస్ నిర్దేశించిన 240 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు కివీస్ బౌలర్ మ్యాట్ హెన్రీ షాక్ ఇచ్చాడు. నాలుగు బంతులు ఆడిన రోహిత్ (1; 4 బంతుల్లో) ఒక్క పరుగు మాత్రమే చేసి కీపర్ లాథమ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

1
43689

మరో పేసర్ ట్రెంట్ బౌల్ట్‌ వేసిన 2.4వ బంతి ఆడే క్రమంలో విరాట్‌ కోహ్లీ (1; 6 వికెట్లు) వికెట్ల ముందు దొరికిపోయాడు. విరాట్ సమీక్ష కోరినా.. ఫలితం లేకుండా పోయింది. దీని నుంచి తేరుకోకముందే మాట్‌ హెన్రీ మరో షాక్ ఇచ్చాడు. హెన్రీ వేసిన 3.1వ బంతికి కేఎల్‌ రాహుల్‌ (1; 7 బంతుల్లో) ఔటయ్యాడు. కీపర్ టామ్‌ లేథమ్‌కు అద్భుత క్యాచ్‌ పట్టాడు. దీంతో టీమిండియా 5 పరుగులకే కీలక ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

వర్షం కారణంగా పిచ్‌ ఎక్కువగా స్వింగ్‌ అవుతుండడం కివీస్ బౌలర్లకు కలిసొచ్చింది. అంతేకాకుండా అవుట్‌ ఫీల్డ్‌ కూడా చాలా నెమ్మదిగా ఉంది. స్పీడ్ బౌల‌ర్ల‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై కివీస్ బౌల‌ర్లు చెల‌రేగుతున్నారు. వీరిని అడ్డుకోవడానికి దినేశ్‌ కార్తీక్‌, రిషబ్ పంత్‌ ఇబ్బందులు పడుతున్నారు. 6 ఓవర్లు ముగిసే సరికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 10 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో దినేశ్‌ కార్తీక్‌ (0), పంత్‌ (5)లు ఉన్నారు.

Story first published: Wednesday, July 10, 2019, 16:20 [IST]
Other articles published on Jul 10, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X