న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇంకొక్కటి చేస్తే ఎవరికి దక్కని రికార్డు రాహుల్ సొంతం

India vs New Zealand: KL Rahul on cusp of creating new T20I record for India

హైదరాబాద్ : అద్భుత ఫామ్‌లో ఉన్న టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ అరుదైన రికార్డ్ ముంగిట నిలిచాడు. న్యూజిలాండ్‌తో ప్రస్తుతం జరుగతున్నసిరీస్‌లో జోరు కనబరుస్తున్న ఈ కర్ణాటక బ్యాట్స్‌‌‌‌మన్.. ఇప్పటికే వరుసగా మూడు హాఫ్ సెంచరీలు చేశాడు. న్యూజిలాండ్ సిరీస్‌లో తొలి టీ20లో 56 పరుగులు చేసిన రాహుల్.. రెండో టీ20లో 57 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇక ఈ సిరీస్‌కి ముందు శ్రీలంకతో జరిగిన చివరి టీ20లో 54 పరుగులు చేసాడు. దీంతో ఇప్పటికే హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలు సాధించిన రికార్డును సొంతం చేసుకున్నాడు.

తొలి బ్యాట్స్‌మన్‌గా..

తొలి బ్యాట్స్‌మన్‌గా..

ఇక బుధవారం హామిల్టన్ వేదికగా జరిగే మూడో టీ20లో మరో హాఫ్ సెంచరీ చేస్తే.. అంతర్జాతీయ టీ20ల్లో వరుసగా 4 హాఫ్ సెంచరీలు నమోదు చేసిన తొలి భారత క్రికెటర్‌గా గుర్తింపు పొందనున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌లుగా టాప్-2లో కొనసాగుతున్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకి సైతం ఈ హాఫ్ సెంచరీల రికార్డ్ సాధ్యం కాలేదు. ఇప్పటి వరకూ 79 టీ20 మ్యాచ్‌లాడిన విరాట్ కోహ్లీ 2,745 పరుగులతో అగ్ర స్థానంలో కొనసాగుతుండగా.. రోహిత్ శర్మ 106 మ్యాచ్‌ల్లో 2,648 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. కేఎల్ రాహుల్ 38 టీ20ల్లో ప్రస్తుతం 1,350 పరుగులు చేశాడు. ప్రస్తుతం కేఎల్ రాహుల్ మానియా నడుస్తోంది. బ్యాటింగ్, కీపింగ్‌లో రాణిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్రపోషిస్తున్నాడు.

డ్యూయల్ రోల్..

డ్యూయల్ రోల్..

దీంతో పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో టీమ్ కాంబినేషన్‌కు సంబంధించి భారత జట్టులోని అన్ని సమస్యలకు కేఎల్ రాహుల్ రూపంలో పరిష్కారం లభించింది. ప్రస్తుత భారత జట్టులో కేఎల్ రాహుల్ డ్యూయల్ రోల్స్ పోషించడంతో మనీష్ పాండే రూపంలో అదనపు బ్యాట్స్‌మన్‌ను ఆడించేందుకు కోహ్లీకి ఓ మంచి అవకాశం లభించింది. ఓపెనర్‌గా, వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్ ప్రదర్శన అటు కెప్టెన్ కోహ్లీతో పాటు ఇటు జట్టు యాజమాన్యాన్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఫలితంగా గాయం నుంచి రిషబ్ పంత్ కోలుకున్నప్పటికీ న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో అతడికి చోటు దక్కలేదు.

గంగూలీ సైతం..

గంగూలీ సైతం..

ఆసీస్‌తో జరిగిన తొలి వన్డేలో పంత్ గాయ పడటంతో కాంకషన్ కింద కేఎల్ రాహుల్ వికెట్ కీపర్‌గా రాణించాడు.కేఎల్ రాహుల్ సైతం ప్రస్తుతానికి జట్టులో డ్యూయల్ రోల్‌ను తాను "ప్రేమిస్తున్నానని" రాహుల్ సైతం వన్డే సిరిస్ అనంతరం వెల్లడించాడు. ఎల్‌ రాహుల్‌ ప్రదర్శనపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ సైతం ప్రశంసలు కురిపించాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లోనూ అతడు ఇదే ఫామ్‌ను కొనసాగించాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. ప్రస్తుతం జట్టు మేనేజ్‌మెంట్ ఇచ్చిన ప్రతి పాత్రను రాహుల్‌ సమర్థంగా పోషిస్తున్నాడని కొనియాడాడు.

Story first published: Tuesday, January 28, 2020, 19:31 [IST]
Other articles published on Jan 28, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X