న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs New Zealand: కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ ఖాతాలో మరో రికార్డు!

India Vs New zealand : Rohit Sharma Is Very Close To Rare Records In T20s | Oneindia Telugu
India vs New Zealand: Impact of Rohit Sharma - Indian captain on the cusp of scripting record in T20Is

హైదరాబాద్: ఆసీస్ గడ్డపై చారిత్రక టెస్టు సిరిస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా న్యూజిలాండ్ పర్యటనలో కూడా తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఇప్పటికే ఐదు వన్డేల సిరిస్‌ను 4-1తో కైవసం చేసుకున్న టీమిండియా ప్రస్తుతం మూడు టీ20ల సిరిస్‌పై కన్నేసింది. రెగ్యుల‌ర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి సెలక్టర్లు విశ్రాంతినివ్వడంతో రోహిత్ శర్మ నాయకత్వ బాధ్యతలను అందుకున్నాడు. చివరి రెండు వన్డేలతో పాటు న్యూజిలాండ్‌తో బుధవారం నుంచి ఆరంభమయ్యే మూడు టీ20ల సిరిస్‌కు కూడా రోహిత్ శర్మనే నాయకత్వం వహించనున్నాడు.

అరుదైన రికార్డుకు చేరువ‌లో రోహిత్ శర్మ

అరుదైన రికార్డుకు చేరువ‌లో రోహిత్ శర్మ

ఈ నేప‌థ్యంలో రోహిత్ శ‌ర్మ ఓ అరుదైన రికార్డుకు చేరువ‌య్యాడు. న్యూజిలాండ్‌లో భార‌త జ‌ట్టు ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క టీ20 మ్యాచ్‌ను కూడా గెల‌వ‌లేదు. 2008-09 ప‌ర్య‌ట‌న‌లో ధోని సార‌థ్యంలో టీ20 సిరీస్ ఆడిన టీమిండియా 0-2తో ఓట‌మి పాల‌య్యింది.

ఒక్క మ్యాచ్ గెలిచినా

ఒక్క మ్యాచ్ గెలిచినా

దీంతో ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరిగే మూడు టీ20ల సిరిస్‌లో టీమిండియా ఒక్క మ్యాచ్ గెలిచినా న్యూజిలాండ్ గ‌డ్డ‌పై టీ20 మ్యాచ్ గెలిచిన తొలి భార‌త కెప్టెన్‌గా రోహిత్ శర్మ అరుదైన రికార్డుని సృష్టించనున్నాడు. ఇక, సిరీస్ గెలిస్తే ఆ ఘ‌న‌త కూడా రోహిత్ ఖాతాలోనే చేరుతుంది.

మరో 36 పరుగులు చేస్తే

మరో 36 పరుగులు చేస్తే

దీంతో పాటు ఈ టీ20 సిరిస్‌లో రోహిత్ శర్మ మరో 36 పరుగులు చేస్తే టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా రోహిత్ శర్మ నిలుస్తాడు. ప్రస్తుతం టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మార్టిన్ గుప్తిల్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

గుప్తిల్ స్థానంలో జేమ్స్ నీషమ్‌

గుప్తిల్ స్థానంలో జేమ్స్ నీషమ్‌

అయితే, వెన్ను గాయం కారణంగా భారత్‌తో వన్డే సిరీస్‌ నుంచి అర్ధంతరంగా తప్పుకున్న న్యూజిలాండ్‌ ఓపెనర్‌ మార్టిన్‌ గుప్తిల్‌.. టీ20 సిరీస్‌కూ దూరమయ్యాడు. గప్తిల్‌ ఇంకా కోలుకోకపోవడంతో అతడి స్థానంలో ఆల్‌రౌండర్‌ జేమ్స్ నీషమ్‌ను న్యూజిలాండ్‌ జట్టులోకి తీసుకున్నారు. ఈ మేరకు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అధికారిక ప్రకటన చేసింది.

Story first published: Tuesday, February 5, 2019, 12:11 [IST]
Other articles published on Feb 5, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X