న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

3rd T20I: టీమిండియా విజయ లక్ష్యం 213

 India Vs New Zealand, 3rd T20I: Colin Munro, Tim Seifert Help New Zealand Reach 212/4 In Hamilton

హైదరాబాద్: హామిల్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టీ20లో భారత బౌలర్లు తడబడ్డారు. దీంతో పర్యాటక జట్టుకి న్యూజిలాండ్‌ 213 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ జట్టుకి ఓపెనర్లు టీమ్‌ సీఫెర్ట్‌ (43;25 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు), కొలిన్ మున్రో (72: 40 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు) చక్కటి శుభారంభాన్నిచ్చారు.

తొలి వికెట్‌కు 80 పరుగుల భాగస్వామ్యం

తొలి వికెట్‌కు 80 పరుగుల భాగస్వామ్యం

వీరిద్దరూ తొలి వికెట్‌కు 80 పరుగులు జత చేసిన తర్వాత సీఫెర్ట్‌ ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విలియమ్సన్‌తో కలిసి మున్రో స్కోరు బోర్డును నడిపించాడు. ఈ క్రమంలోనే ఇరువురు 55 పరుగులు జత చేసిన తర్వాత మున్రో రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు.

మూడో వికెట్‌గా విలియమ్సన్ ఔట్

మూడో వికెట్‌గా విలియమ్సన్ ఔట్

ఆ తర్వాత మరో 15 పరుగుల వ్యవధిలో విలియమ్సన్‌(27) కూడా ఔట్‌ కావడంతో న్యూజిలాండ్ జట్టు స్కోరు 150 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన గ్రాండ్‌హోమ్‌(30;16 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌), డార్లీ మిచెల్‌(19 నాటౌట్; 11 బంతుల్లో 3 ఫోర్లు‌), రాస్‌ టేలర్‌(14 నాటౌట్‌; 7 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌) ఫరవాలేదనిపించారు.

రెండు వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్

రెండు వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్

ముఖ్యంగా చివర్లో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ పరుగుల వరద పారించారు. భారత బౌలర్లలో చాహల్ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన కుల్దీప్ యాదవ్ (2/26) పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు ఓపెనర్లు మున్రో, సీఫర్ట్ వికెట్లను పడగొట్టాడు. ఇక, భువనేశ్వర్‌ కుమార్‌, ఖలీల్‌ అహ్మద్‌లకు తలో వికెట్‌ తీసుకున్నారు.

ఇరు జట్లు ఇప్పటికే 1-1తో సమంగా

ఇరు జట్లు ఇప్పటికే 1-1తో సమంగా

ఈ మ్యాచ్‌‌లో టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆతిథ్య జట్టుని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఒక మార్పుతో బరిలోకి దిగింది. భారత్ తుది జట్టులో మణికట్టు స్పిన్నర్ చాహల్‌ని తప్పించి.. ఎడమ చేతి వాటం స్పిన్నర్ కుల్దీప్‌ని తుది జట్టులోకి తీసుకున్నారు. మూడు టీ20ల సిరీస్‌‌లో ఇరు జట్లు ఇప్పటికే 1-1తో సమంగా ఉన్నాయి.

Story first published: Sunday, February 10, 2019, 14:44 [IST]
Other articles published on Feb 10, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X