న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రవీంద్ర జడేజా మాయ.. నాలుగో వికెట్ కోల్పోయిన కివీస్

India vs New Zealand 2nd T20I: Ravindra Jadeja strikes put IND on top

ఆక్లాండ్: ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఈడెన్ పార్క్ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టీ20లో న్యూజిలాండ్‌ నాలుగో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ (14) ఔట్ అయ్యాడు. స్పిన్నర్ రవీంద్ర జడేజా 13వ ఓవర్ మూడో బంతికి క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. అంతకుముందు భారీ హిట్టర్ కోలిన్ డి గ్రాండ్‌హోమ్ కేవలం మూడు పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. జడేజా వేసిన 11వ ఓవర్ రెండో బంతికి అతనికే క్యాచ్ ఇచ్చి గ్రాండ్‌హోమ్ ఔట్ అయ్యాడు. దీంతో కీలక నాలుగు వికెట్లు కోల్పోయి న్యూజిలాండ్‌ కష్టాల్లో పడింది.

'పంత్ ఎవరినీ నిందించలేడు.. అద్భుత ప్రదర్శనతో విమర్శకులకు సమాధానం చెప్పాలి''పంత్ ఎవరినీ నిందించలేడు.. అద్భుత ప్రదర్శనతో విమర్శకులకు సమాధానం చెప్పాలి'

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ మొదటి (బ్యాటింగ్) పవర్‌ప్లేలో అదరొగొట్టింది. ఓపెనర్లు మార్టిన్ గుప్టిల్, కొలిన్ మున్రోలు జట్టుకు పవర్‌ప్లేలో మంచి స్కోర్ అందించారు. పేసర్ శార్దూల్ ఠాకూర్ వేసిన మొదటి గుప్టిల్ రెండు భారీ సిక్సులు బాది హెచ్చరికలు జారీ చేసాడు. అయితే రెండో ఓవర్లో పేసర్ మహమద్ షమీ 5 పరుగులే ఇచ్చి కివీస్ బ్యాట్స్‌మన్‌పై ఒత్తిడి పెంచాడు. ఆ తర్వాత జస్ప్రీత్ బుమ్రా కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసాడు.

గుప్టిల్ 20 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 33 పరుగులు చేసి ఠాకూర్ వేసిన ఆరో ఓవర్ చివరి బంతికి కెప్టెన్ విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కోహ్లీ అద్భుత క్యాచ్ అందుకున్నాడు. దీంతో బ్యాటింగ్ పవర్‌ప్లే (తొలి ఆరు ఓవర్లు) ముగిసేసరికి న్యూజిలాండ్ 1 వికెట్ నష్టానికి 48 పరుగలు చేసింది. గుప్టిల్ పెవిలియన్ చేరిన అనంతరం మున్రో కొన్ని షాట్లు ఆడి స్కోర్ వేగం పెంచాడు. అయితే శివమ్‌ దూబే వేసిన 9వ్ ఓవర్లో గప్తిల్‌ (26) భారీ షాట్‌ ఆడగా.. సర్కిల్ లోపలే ఫీల్డింగ్‌ చేస్తున్న కోహ్లీ అద్భుత క్యాచ్‌తో నిష్క్రమించాడు.

భారత బౌలర్లు చెలరేగడంతో క్రీజులో విలియమ్సన్‌, రాస్ టేలర్ ఉన్నా ధాటిగా బ్యాటింగ్ చేయాలకేకపోయారు. ఇక జడేజా అద్భుతంగా బౌలింగ్ చేసి కీలక బ్యాట్స్‌మన్‌ విలియమ్సన్‌, గ్రాండ్‌హోమ్‌లను పెవిలియన్ చేర్చాడు. ప్రస్తుతం టిమ్ సీఫెర్ట్ అండతో టేలర్ పరుగులు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు.15 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది. క్రీజ్‌లో టేలర్ (8), సీఫెర్ట్ (8) ఉన్నారు.

Story first published: Sunday, January 26, 2020, 14:24 [IST]
Other articles published on Jan 26, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X