న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం: విరాట్ కోహ్లీని చూడ్డానికి స్కూల్ ఎగ్గొట్టాడట

India vs Leicestershire Practice Match: Young Virat Kohli fan spotted in crowd with a message

ముంబై: భారత్-లీసెస్టర్‌షైర్ కౌంటీ క్లబ్‌ మధ్య కొద్దిసేపటి కిందటే ఆరంభమైన వార్మప్ మ్యాచ్‌లో పలు ఆసక్తికర సన్నివేశాలు కనిపించాయి. చాలాకాలం తరువాత టీమిండియా ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోన్న నేపథ్యంలో అక్కడి భారతీయుల ఆనందానికి అవధుల్లేవు. లీసెస్టర్ స్టేడియం వద్ద పండగ వాతావరణం కనిపించింది. అభిమానుల కోలాహలం నెలకొంది. అభిమానుల అంచనాలకు భిన్నంగా, వారిని నిరాశపరిచేలా భారత జట్టు బ్యాటింగ్ కొనసాగుతోంది.

వార్మప్ మ్యాచ్‌లో అరుదైన సన్నివేశాలు: బుమ్రా బౌలింగ్‌లో రోహిత్ శర్మవార్మప్ మ్యాచ్‌లో అరుదైన సన్నివేశాలు: బుమ్రా బౌలింగ్‌లో రోహిత్ శర్మ

పంజాబీ సంప్రదాయంలో..

భారత జట్టు ప్లేయర్లకు లీసెస్టర్ మైదానంలో ఘన స్వాగతం లభించింది. అంపైర్లతో పాటు గ్రౌండ్‌లోకి వచ్చే ప్లేయర్లందరినీ పంజాబీ సంప్రదాయపద్ధతుల్లో అభిమానులు స్వాగతం పలికారు. ఇరు వైపులా నిల్చుని పెద్ద ఎత్తున డప్పులు మోగిస్తూ, దానికి అనుగుణంగా స్టెప్పులు వేస్తూ స్వాగతించారు. లీసెస్టర్‌షైర్, బర్మింగ్‌హామ్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తోన్న భారతీయులు పెద్ద సంఖ్యల స్టేడియానికి తరలివచ్చారు.

జాతీయ పతాకాలతో..

తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తరఫున ఇన్నింగ్ ఆరంభించడానికి రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ గ్రౌండ్‌లో అడుగు పెట్టే సమయంలో అభిమానుల ఆనందానికి హద్దు లేకుండా పోయింది. జాతీయ పతాకాలను ఎగుర వేస్తూ.. భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. రోహిత్..రోహిత్ అంటూ నినదించారు. విరాట్ కోహ్లీ క్రీజ్‌లోకి వచ్చే సమయంలో కూడా అదే క్రేజ్ కనిపించింది. గట్టిగా కేకలు వేస్తూ టీమిండియాను ఉత్సాహ పరిచారు అభిమానులు.

విరాట్ కోహ్లీ కోసం స్కూల్ బంక్..

ఆడియన్స్‌లో ఓ బాలుడు ప్రదర్శించిన ప్లకార్డ్ ఆకట్టుకుంది. ఓ బాలుడు దీన్ని ప్రదర్శించాడు. విరాట్ సర్ యు ఆర్ ద బెస్ట్, ఐ మిస్డ్ స్కూల్ టు యు అని రాసివున్న ప్లకార్డ్‌ను ఆ బాలుడు చేత్తో పట్టుకుని కనిపించాడు. కింగ్ కోహ్లీకి చిన్నపిల్లల్లోనూ ఉన్న అభిమానానికి, క్రేజ్‌కు ఇది అద్దం పట్టినట్టయింది. విరాట్ కోహ్లీ కోసం తాను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నానని, ఇవ్వాళ తన కోరిక నెరవేరిందంటూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. తన ఆరాధ్య క్రికెటర్‌ను చూడ్డానికి స్కూల్ ఎగ్గొట్టానని చెప్పాడు.

నిరాశపరిచిన బ్యాటర్లు..

నిరాశపరిచిన బ్యాటర్లు..

టీమిండియా బ్యాటర్ల ఆటతీరు మాత్రం ఫ్యాన్స్‌ను తీవ్ర నిరాశకు గురి చేసింది. 81 పరుగులకే ఏకంగా అయిదు వికెట్లను పోగొట్టుకుంది. కేప్టెన్ రోహిత్ శర్మ-25, శుభ్‌మన్ గిల్-21, హనుమ విహారి-3, రవీంద్ర జడేజా-13 పరుగులు చేసి అవుట్ అయ్యారు. శ్రేయాస్ అయ్యర్ డకౌట్ అయ్యాడు. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో రిషభ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి శ్రేయాస్ అయ్యర్ పెవిలియన్ దారి పట్టాడు. 11 బంతులను ఎదుర్కొన్న శ్రేయాస్ బోణీ కొట్టడంలో విఫలం అయ్యాడు. 21 సంవత్సరాల రోమన్ వాకర్.. మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. రోహిత్ శర్మ, హనుమ విహారి, రవీంద్ర జడేజను పెవిలియన్ దారి పట్టించాడు. ప్రసిద్ధ్ కృష్ణ, విల్ డేవిస్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.

Story first published: Thursday, June 23, 2022, 17:18 [IST]
Other articles published on Jun 23, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X