న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీ కూతురు నా ఛీర్ లీడర్: హార్దిక్ పాండ్యా

Dhoni's Daughter Ziva Is Hardik Pandya's Cutest And Newest Cheerleader
India vs Ireland: MS Dhonis Daughter Ziva Cheering For Hardik Pandya Is The Cutest Thing You Will See Today

హైదరాబాద్: ఐర్లాండ్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్‌ 2-0తో కైవసం చేసుకుని యూకే పర్యటనను విజయవంతంగా ప్రారంభించింది. సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్‌ 143 పరుగుల తేడాతో ఆతిథ్య ఐర్లాండ్‌ను చిత్తుచిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో హార్దిక్‌ పాండ్య ఆఖర్లో చెలరేగి ఆడాడు. కేవలం 9 బంతుల్లో 32 పరుగులు చేసి భారత్‌ జట్టుకు భారీ స్కోరు అందించాడు.

పాండ్య ఇన్నింగ్స్‌ చూసినవాళ్లంతా షాక్:

పాండ్య ఇన్నింగ్స్‌ చూసినవాళ్లంతా షాక్:

ఈ మ్యాచ్‌లో పాండ్య ఇన్నింగ్స్‌ చూసిన వారు ఎవరైనా ఔరా అనాల్సిందే. ఆడిన ప్రతి బంతికి పరుగులు రాబట్టాడు. 9 బంతుల్లో ఐదు బౌండరీలే. అందులో నాలుగు సిక్స్‌లు, ఒక్క ఫోర్‌. మ్యాచ్‌ అనంతరం పాండ్య తన ఇన్‌స్టాగ్రం ద్వారా ఒక వీడియోను అభిమానులతో పంచుకున్నాడు.

ధోనీ కూతురు ఒక చీర్‌ లీడర్‌

‘నన్ను ప్రోత్సహించేందుకు ఒక చీర్‌ లీడర్‌ దొరికిందని అనుకుంటున్నాను' అని పేర్కొన్నాడు. ఇంతకీ ఆ చీర్‌ లీడర్‌ ఎవరో తెలుసా. మహేంద్ర సింగ్‌ ధోనీ గారాలాపట్టి జీవా. ‘కమాన్‌... కమాన్‌.. హార్దిక్‌' అంటూ జీవా ఆ వీడియోలో సందడి చేసింది. ఈ వీడియోను ధోనీ భార్య సాక్షి... పాండ్యకు పంపించిందట. ఆ వీడియోను హార్దిక్ అభిమానులతో పంచుకున్నాడు.

20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు

20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు

తొలుత ఓపెనర్ కేఎల్ రాహుల్ 36 బంతుల్లో 3ఫోర్లు, 6 సిక్సులు(70), సురేశ్ రైనా 45 బంతుల్లో 5ఫోర్లు, 3 సిక్సులు (69), హార్దిక్ పాండ్య 9 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సులతో (32) నాటౌట్‌లతో మెరుపులు మెరిపించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు చేసింది.

ఇదే ఉత్సాహంతో ఇంగ్లాండ్‌తో ఆడేందుకు

ఇదే ఉత్సాహంతో ఇంగ్లాండ్‌తో ఆడేందుకు

అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్ జట్టు మరోసారి భారత స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ (3/16), చాహల్ (3/21) ధాటికి చేతులెత్తేసింది. క్రమం తప్పకుండా స్పిన్నర్లు వికెట్లు తీయడంతో ఆ జట్టు 12.3 ఓవర్లలో 70 పరుగులకే పేకమేడలా కుప్పకూలిపోయింది. ఆ జట్టులో ఏడు మంది బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్‌కే పరిమితమవగా.. అందులో ముగ్గురు డకౌటవడం విశేషం. 2-0తో సిరీస్‌ గెలుచుకున్న టీమిండియా అదే ఉత్సాహంతో ఇంగ్లాండ్‌తో ఆడేందుకు సిద్ధం కానుంది. ఈ క్రమంలో జులై 3 నుంచి భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య టీ20 సిరీస్‌ ప్రారంభంకానుంది. ఆ తర్వాత వన్డే, టెస్టు సిరీస్‌లు జరగనున్నాయి.

Story first published: Saturday, June 30, 2018, 11:17 [IST]
Other articles published on Jun 30, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X