న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇండియా Vs ఇంగ్లాండ్: చరిత్రలో నిలిచిపోయే టెస్టు మ్యాచ్‌లు

By Nageshwara Rao
India vs England: The most memorable Test matches

హైదరాబాద్: మరో వారం రోజుల్లో భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య ప్రతిష్టాత్మక ఐదు రోజుల టెస్టు సిరిస్ ప్రారంభం కానుంది. గతంలో ఇంగ్లాండ్‌లో పర్యటించిన సమయంలో పేలవ ప్రదర్శన చేసిన ప్రస్తుత టీమిండియా కెప్టెన్ ఈ పర్యటనలో మాత్రం ఆతిథ్య ఇంగ్లాండ్‌పై టెస్టు సిరిస్ గెలవాలనే పట్టుదలతో ఉన్నాడు.

అందుకు తగ్గట్టే కోహ్లీ ఫామ్‌లో ఉండటం భారత్‌కు కలిసొచ్చే అంశం. అంతేకాదు ఈ పర్యటనలో కెప్టెన్‌‌గా కోహ్లీ మరో ఆరుదైన ఘనతను సొంతం చేసుకునే అవకాశం లభించింది. ఆగస్టు 1 నుంచి ఆతిథ్య ఇంగ్లాండ్‌తో ఆరంభమయ్యే ఐదు టెస్టుల సిరీస్‌ను టీమిండియా గెలిస్తే మాజీ కెప్టెన్లు అజిత్‌ వాడేకర్‌, కపిల్‌దేవ్‌, రాహుల్‌ ద్రవిడ్‌‌ల సరసన కోహ్లీ చేరనున్నాడు.

ఇప్పటివరకు ఇంగ్లాండ్‌ గడ్డపై టీమిండియా కేవలం మూడు సార్లు మాత్రమే టెస్టు సిరిస్‌ను నెగ్గింది. వాడేకర్‌, కపిల్‌దేవ్‌, ద్రవిడ్‌ సారథ్యంలోనే ఇది సాధ్యమైంది. టీమిండియాకు ఎన్నో అద్భుతమైన విజయాలనందించిన మాజీ కెప్టెన్లు సౌరవ్‌ గంగూలీ, ధోనిలు ఇంగ్లీషు గడ్డపై మాత్రం టెస్టు సిరిస్‌ను గెలవలేకపోయారు.

అయితే, వారిద్దరికీ సాధ్యం కానిది ఇప్పుడు కోహ్లీ సాధిస్తాడో లేదో వేచి చూడాలి. అప్పటివరకు భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య గతంలో జరిగిన ఐదు అద్భుతమైన టెస్టులు పాఠకుల కోసం ప్రత్యేకం...

1971, ఓవల్

1971, ఓవల్

15 డ్రాలు, ఆరు అపజయాల తర్వాత ఆతిథ్య ఇంగ్లాండ్‌పై టీమిండియా తొలిసారి విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో భారత విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించింది బీఎస్ చంద్రశేఖర్. ఈ మ్యాచ్‌లో అతడు 6 వికెట్లు తీయడంతో పాటు 38 పరుగులు నమోదు చేయడంతో ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 101 పరుగులు చేసింది. దీంతో భారత విజయానికి 174 పరుగులు అవసరమయ్యాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.

 1986, లీడ్స్

1986, లీడ్స్

మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భారత్ ఘన విజయం సాధించడంలో వెంగ్‌సర్కార్ సెంచరీతో పాటు రోజర్ బిన్నీ, మదన్ లాల్, మొహిందర్ అమర్నాథ్‌లు కీలకపాత్ర పోషించారు. ఈ టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 272 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 237 పరుగులు చేసింది. అయితే, బౌలర్లు తమ అద్భుత ప్రదర్శనతో సత్తా చాటడంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 102 రెండో ఇన్నింగ్స్‌లో 128 పరుగులకే పరిమితమైంది. దీంతో ఈ టెస్టులో టీమిండియా 279 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.

1990, లార్డ్స్

1990, లార్డ్స్

ఈ టెస్టులో టీమిండియా 247 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే, ఇరు జట్లు ఈ టెస్టులో అద్భుత ప్రదర్శన చేశాయి. గ్రాహామ్ గూచ్ ట్రిపుల్ సెంచరీతో పాటు అలెల్న్ లాంబ్, రాబిన్ స్మిత్‌లు సెంచరీలతో చెలరేగారు. మరోవైపు భారత జట్టులో రవిశాస్త్రి, మహమ్మద్ అజహరుద్దీన్‌లు సెంచరీలతో సత్తా చాటారు. ఈ టెస్టులో అజహరుద్దీన్ చేసిన 126 పరుగులు ఇప్పటకీ టెస్టు క్రికెట్ చరిత్రలో మొమరబుల్ సెంచరీగా క్రికెట్ విశ్లేషకులు పరిగణిస్తారు.

 2002, లీడ్స్

2002, లీడ్స్

ఈ పర్యటనలో టీమిండియా సిరిస్‌ను డ్రాగా ముగించింది. ఈ టెస్టు ద్వారా భారత జట్టుకు కొత్త హీరోలు దొరికారు. నాసిర్ హుస్సేన్‌కు తోడు ద్రవిడ్, టెండూల్కర్, సౌరవ్ గంగూలీలు సెంచరీలతో మెరిశారు. తొలి ఇన్నింగ్స్‌ను 628/8వద్ద డిక్లేర్ చేసిన ఇండియా అనిల్ కుంబ్లే, హార్భజన్ సింగ్‌లు సత్తా చాటడంతో 46 పరుగుల తేడాతో విజయం సాధించింది.

2007, నాటింగ్‌హామ్

2007, నాటింగ్‌హామ్

జహీర్ ఖాన్(4 వికెట్లు), అనిల్ కుంబ్లే(3 వికెట్లు) తీయడంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 198 పరుగులకే కుప్పకూలింది. ఈ టెస్టులో భారత్ బ్యాట్స్‌మెన్ సెంచరీలు చేయకపోయినప్పటికీ దినేశ్ కార్తీక్, వసీం జాఫర్, సచిన్, లక్ష్మణ్, సౌరవ్ గంగూలీలు హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇక, రెండో ఇన్నింగ్స్‌లో జహీర్ ఖాన్ తన బంతులతో చెలరేగగా, కుంబ్లే అతడికి మద్దతుగా నిలవడంతో భారత జట్టు అలవోక విజయాన్ని నమోదు చేసింది.

 2014 లార్డ్స్

2014 లార్డ్స్

తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం లభించడంతో భారత్ అలవోక విజయాన్ని నమోదు చేసింది. ఈ టెస్టులో రహానే సెంచరీతో మెరిశాడు. మరోవైపు ఇషాంత్ శర్మ(7-74)తో ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. దీంతో నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను భారత్ కైవసం చేసుకుంటుందని క్రికెట్ అభిమానులంతా భావించారు. అయితే, చివరకు ధోని నాయకత్వంలోని టీమిండియా 3-1తేడాతో ఓటమిపాలై నిరాశపరిచింది.

Story first published: Monday, July 23, 2018, 15:37 [IST]
Other articles published on Jul 23, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X