న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs England: భారత్ ఆలౌట్‌.. తృటిలో సుందర్‌ సెంచరీ మిస్! 160 ర‌న్స్ ఆధిక్యం!

India vs England: Team India all out for 365, Washington Sundar 96 not out

అహ్మ‌దాబాద్‌: మొతెరా స్టేడియంలో జ‌రుగుతున్న నాల‌గ‌వ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 365 పరుగులకు ఆలౌటైంది. దీంతో భార‌త్‌కు 160 ప‌రుగుల ఆధిక్యం ల‌భించింది. ఆల్‌రౌండ‌ర్ వాషింగ్ట‌న్ సుంద‌ర్ 96 ప‌రుగుల‌తో నాటౌట్‌గా నిలిచాడు. టేయిలెండర్లు త్వరగా పెవిలియన్ చేరడంతో.. సుందర్‌ సెంచరీ చేయలేకపోయాడు. మరో ఆల్‌రౌండ‌ర్ అక్షర్ పటేల్ 43 రన్స్ చేశాడు. ఏడు వికెట్ల‌కు 294 ప‌రుగుల వ‌ద్ద మూడ‌వ రోజు బ్యాటింగ్‌ను ప్రారంభించిన భార‌త్‌.. మ‌రో 71 ర‌న్స్ జోడించి మిగితా వికెట్లను కోల్పోయింది.

294/7 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో మూడో రోజు బ్యాటింగ్‌ ఆరంభించిన అక్షర్ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్ ఇంగ్లండ్ బౌలర్లపై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించారు. ఇద్దరూ స్వేచ్ఛగా షాట్లు ఆడుతూ సెంచరీ భాగస్వామ్యం జోడించారు. ఈ క్రమంలోనే భారత్ ఆధిక్యాన్ని 160 పరుగులకు చేరవేశారు. అయితే కెప్టెన్ జో రూట్‌ వేసిన 113వ ఓవర్‌ చివరి బంతికి వాషింగ్టన్‌ ఆడిన షాట్‌కు నాన్‌స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉన్న అక్షర్‌ క్రీజు వదిలి ముందుకు వెళ్లాడు. బెయిర్‌స్టో వెంటనే స్పందించి బంతిని అందుకొని త్రో విసరడంతో అక్షర్‌ క్రీజులోకి చేరకముందే రూట్‌ బెయిల్స్‌ను ఎగర వేశాడు.

365 పరుగుల వద్ద అక్షర్‌ (43; 97 బంతుల్లో 5x4, 1x6) ఎనిమిదో వికెట్‌ రూపంలో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాతి ఓవర్‌లో బెన్ స్టోక్స్‌ చివరి ఇద్దరి బ్యాట్స్‌మెన్‌ ఇషాంత్ శర్మ‌, మొహ్మద్ సిరాజ్‌లను పెవిలియన్‌ చేర్చడంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌కు తెరపడింది. సుంద‌ర్ (96; 174 బంతుల్లో 10x4, 1x6) అజేయంగా నిలిచాడు. కాగా శుక్రవారం రిషబ్ పంత్‌ (101; 118 బంతుల్లో 13x4, 2x6) అద్భుత శతకం సాధించిన సంగతి తెలిసిందే. అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 205 పరుగులకు ఆలౌటైంది.

సెహ్వాగ్‌ జోరు ఏమాత్రం తగ్గలేదుగా.. 35 బంతుల్లో 80! బంగ్లాదేశ్‌ చిత్తు!సెహ్వాగ్‌ జోరు ఏమాత్రం తగ్గలేదుగా.. 35 బంతుల్లో 80! బంగ్లాదేశ్‌ చిత్తు!

Story first published: Saturday, March 6, 2021, 11:45 [IST]
Other articles published on Mar 6, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X