న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'విదేశాల్లో సిరిస్‌లు నెగ్గాలంటే మానసిక ధృడత్వం కావాలి'

By Nageshwara Rao
India vs england 2018 5 Test : Gilchrist Talks About Indian Team's Performance
India vs England: India need to be mentally stronger to win overseas: Adam Gilchrist

హైదరాబాద్: టీమిండియా విదేశాల్లో టెస్టు సిరిస్‌లను గెలవాలంటే మానసికంగా ధృడంగా తయారు కావాలని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం భారత జట్టులో నాణ్యమైన బ్యాట్స్‌మెన్లతో పాటు బలమైన బౌలింగ్‌ లైనప్‌ కలిగి ఉందని గిల్‌క్రిస్ట్ పేర్కొన్నాడు.

రివ్యూలో కోహ్లీ తడబాటు: చెత్త రివ్యూయర్ అంటూ మైకేల్ వాన్ ట్వీట్రివ్యూలో కోహ్లీ తడబాటు: చెత్త రివ్యూయర్ అంటూ మైకేల్ వాన్ ట్వీట్

కానీ, విదేశాల్లో మ్యాచ్‌లకు వచ్చేసరికి భారత క్రికెట్‌ జట్టు మానసిక స్థైర్యాన్ని కోల్పోతుందని బెంగళూరులో ఓ క్రికెట్ మ్యాచ్ ఆడేందుకు వచ్చిన ఆడమ్ గిల్‌క్రిస్ట్ పేర్కొన్నాడు. అదే సమయంలో భారత జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీపై కూడా గిల్‌క్రిస్ట్‌ ప్రశంసలు కురిపించాడు.

"విదేశీ సిరీస్‌లు ఎవరికైనా సవాల్‌తో కూడుకున్నవే. భారత జట్టు బౌలింగ్‌ యూనిట్‌, బ్యాటింగ్‌ విభాగం చాలా పటిష్టంగా ఉంది. విరాట్‌ కోహ్లీ వంటి ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ భారత జట్టులో ఉన్నాడు. విదేశాల్లో సిరీస్‌లను గెలిచే సత్తా భారత జట్టుకు ఉంది. కాకపోతే ఇక్కడ తగినంత మానసిక ధృడత్వం కావాలి" అని గిల్‌క్రిస్ట్‌ పేర్కొన్నాడు.

1
42378

మరొవైపు ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-3తో టీమిండియా కోల్పోవడంపై మాట్లాడేందుకు గిల్‌క్రిస్ట్ నిరాకరించాడు. ఈ సిరీస్‌ లైవ్‌ను తాను చూడలేదని, కేవలం హైలెట్స్‌ మాత్రమే చూశానని తెలిపాడు. దీంతో సిరీస్‌లో కోహ్లీసేన మొత్తం ప‍్రదర్శనపై కామెంట్‌ చేయడం సరైంది కాదని గిల్లీ తెలిపాడు.

భారత జట్టు చిరస్మరణీయమైన విజయాలు సాధించడంలో కెప్టెన్‌ కోహ్లీ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడని గిల్‌క్రిస్ట్ ప్రశంసల వర్షం కురిపించాడు. జట్టును సానుకూల ధోరణితో కోహ్లీ నడిపించే తీరు అద్భుతంగా ఉందని చెప్పాడు. తనకు కోహ్లీలో నచ్చేది అతని దూకుడేనని గిల్‌క్రిస్ట్‌ ఈ సందర్భంగా పేర్కొన్నాడు.

India vs England, 5th Test: 'టెయిలెండర్లను ఔట్ చేయడంలో విఫలమయ్యాం'India vs England, 5th Test: 'టెయిలెండర్లను ఔట్ చేయడంలో విఫలమయ్యాం'

ఈ ఏడాది నవంబర్‌లో కోహ్లీసేన ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టుతో నాలుగు టెస్టులు, మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లాండ్‌ సిరిస్‌లో కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సంగతి తెలిసిందే.

ఓవల్ వేదికగా జరుగుతన్న ఐదో టెస్టులో మూడో రోజైన ఆదివారం భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 95 ఓవర్లలో 292 పరుగుల వద్ద ఆలౌటైంది. దీంతో ఆతిథ్య జట్టుకు కేవలం 40 పరుగుల ఆధిక్యమే లభించింది. అండర్సన్, స్టోక్స్, మొయిన్‌ అలీ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఇంగ్లండ్‌ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 43 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది.

Story first published: Monday, September 10, 2018, 14:24 [IST]
Other articles published on Sep 10, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X