న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ.. మరింత ప్రమాదకరంగా మారనున్నాడట..!

India vs England: Half-fit Virat Kohli can be more dangerous, says England coach Trevor Bayliss

నాటింగ్‌హామ్: ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్-ఇండియాల మూడో టెస్టుకు సర్వం సిద్దమైంది. ఈ నేపథ్యంలో.. వెన్నునొప్పి నుంచి కోలుకుంటున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మూడో టెస్టులో మరింత ప్రమాదకారిగా మారతాడని ఇంగ్లీషు జట్టు కోచ్ ట్రెవర్ బేలిస్ అన్నాడు. కోహ్లీ ఫిట్‌నెస్ అంశంపై తనకు ఎలాంటి సందేహాలు లేవన్నాడు. గాయంతో ఆడే ఆటగాళ్లు మరింత ప్రమాదకరంగా మారుతారు. చరిత్ర కూడా ఇదే చెబుతోంది.

గాయంతో ఆడిన క్రికెటర్లు విధ్వంసం సృష్టిస్తారు:

గాయంతో ఆడిన క్రికెటర్లు విధ్వంసం సృష్టిస్తారు:

గాయంతో ఆడిన బ్యాట్స్‌మన్ పరుగులు వరద పారించడం, బౌలర్లు వికెట్లు తీసిన దాఖలాలు చాలా ఉన్నాయి. ఎలాంటి సమస్యా లేకుండానే స్లిప్ క్యాచ్‌లు అందుకునే కోహ్లీ.. కచ్చితంగా అతను మూడో టెస్టుకు అందుబాటులో ఉంటాడు. అతన్ని ఎదుర్కోవడంలో మేం ఎలాంటి మార్పులు చేపట్టడం లేదు. ట్రెంట్ బ్రిడ్జ్ పిచ్ కూడా లార్డ్స్‌ను పోలి ఉంటుంది. బంతి రెండు వైపుల స్వింగ్ అవుతుంది. దీనిని సద్వినియోగం చేసుకుంటాం అని బేలిస్ వ్యాఖ్యానించాడు.

కోలుకున్న కోహ్లీ.. నెట్స్‌లో ప్రాక్టీస్

కోర్టు కేసు నుంచి నిర్ధోషిగా బయటపడిన ఆల్‌రౌండర్ స్టోక్స్‌కు.. మూడో టెస్టులో నేరుగా చోటు దక్కే అవకాశాలు చాలా తక్కువ అని బేలిస్ అన్నారు. ఇదిలా ఉంటే.. మూడో టెస్టుకు ముందు టీమిండియా క్రికెట్ అభిమానులకు ఉపశమనం కలిగించే విషయాన్ని ముందుంచింది. రెండో టెస్టు సందర్భంగా వెన్నునొప్పితో ఇబ్బంది పడిన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి... పూర్తిగా కోలుకున్నట్లే కనిపిస్తున్నాడు. మధ్యమధ్యలో ఫిజియోల పర్యవేక్షణలో గురువారం నెట్స్‌లో అతడు తీవ్రంగా బ్యాటింగ్‌ సాధన చేశాడు. స్లిప్‌ ఫీల్డింగ్‌కు వెళ్లి క్యాచ్‌లు పట్టాడు.

బంతులను సరిగ్గా అంచనా వేస్తేనే:

బంతులను సరిగ్గా అంచనా వేస్తేనే:

‘కోహ్లి ఫిట్‌నెస్‌ మెరుగైంది. నెట్స్‌లో సౌకర్యంగా కదిలాడు. మ్యాచ్‌ సమయానికి మరింతగా సంసిద్ధమవుతాడు' అని కోచ్‌ రవిశాస్త్రి పేర్కొన్నాడు. ఇంగ్లాండ్‌ పిచ్‌లు బ్యాట్స్‌మెన్‌కు క్లిష్టంగా ఉన్నాయని, అలాంటప్పుడే అసలైన ఆట బయటకు వస్తుందని రవిశాస్త్రి అన్నాడు. ఆఫ్‌ స్టంప్‌ను చూసుకుంటూ, ఆడలేని బంతులను వదిలేస్తూ, చెత్త బంతులను సరిగ్గా బేరీజు వేయాలని సూచించాడు.

రహానెను వేలెత్తి చూపలేం.. పొరబాటుగా కుల్దీప్‌ను:

రహానెను వేలెత్తి చూపలేం.. పొరబాటుగా కుల్దీప్‌ను:

రహానే ఫామ్‌ గురించి మాట్లాడుతూ... రెండు జట్ల బ్యాట్స్‌మెన్‌ ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో మానసిక స్థైర్యమే కీలక పాత్ర పోషిస్తుందని, ఏ ఒక్కరినో వేలెత్తి చూపలేమని స్పష్టం చేశాడు. లార్డ్స్‌ టెస్టులో రెండో స్పిన్నర్‌గా కుల్దీప్‌ను ఆడించడం పొరబాటేనని... మరో పేసర్‌ అయితే ఉపయోగకరంగా ఉండేదని శాస్త్రి అంగీకరించాడు. వర్షం కారణంగా మ్యాచ్‌ ఐదో రోజుకు వెళ్లి స్పిన్‌ తిరుగుతుందని భావించి కుల్దీప్‌ను తీసుకున్నట్లు వివరించాడు.

 ఇలాంటి పరిస్థితుల్లో గతంలోనూ గెలిచాం:

ఇలాంటి పరిస్థితుల్లో గతంలోనూ గెలిచాం:

ఓటమి అనంతరం... ‘గతంలోనూ ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడి గెలిచిన సందర్భాలను మర్చిపోవద్దని.. మీపై మీరు నమ్మకం కోల్పోవద్దు' అని మాత్రమే ఆటగాళ్లకు సూచించినట్లు రవిశాస్త్రి పేర్కొన్నాడు. మరోవైపు... కోహ్లి గాయం నుంచి కోలుకుంటే మరింత విజృంభించి ఆడతాడని ఇంగ్లాండ్ కోచ్‌ ట్రెవర్‌ బేలిస్‌ తమ జట్టు సభ్యులకు హెచ్చరికతో కూడిన సూచన చేశాడు.

Story first published: Friday, August 17, 2018, 12:21 [IST]
Other articles published on Aug 17, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X