న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇండియా Vs ఇంగ్లాండ్: లార్డ్స్ పిచ్ ఫస్ట్ లుక్ చూశారా?

By Nageshwara Rao
India vs England: First look of Lord’s pitch out

లండన్: ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్టు గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ టెస్టుకి ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యమివ్వనుంది. లార్డ్స్‌లో క్రికెట్ మ్యాచ్ అంటేనే ప్రత్యేకం. ఎందుకంటే లార్డ్స్‌లో టెస్టు మ్యాచ్ అనగానే స్వింగ్‌ గురించే ఎక్కువగా చర్చిస్తుంటారు.

కానీ, ఈసారి పర్యాటక టీమిండియాతో టెస్టు సిరిస్ అనగానే, స్వింగ్ పోయి స్పిన్‌పై ఎక్కువగా చర్చిస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం ఇంగ్లాండ్‌లో వాతావరణం ఎప్పట్లా చల్లగా ఉండకపోవడమే. దీంతో ఇంగ్లీషు పిచ్‌లపై స్పిన్నర్లూ సత్తా చాటగలరని అంచనాలు మొదలయ్యాయి. మరికొందరైతే ఇంగ్లీషు పిచ్‌లపై స్పిన్నర్లు రాణంచడమా అన్న సందేహాలూ లెవనెత్తారు.

1
42375
తొలి టెస్టులో అశ్విన్ మాయ

తొలి టెస్టులో అశ్విన్ మాయ

అయితే క్రికెట్ విశ్లేషకుల సందేహాల్ని పటాపంచలు చేస్తూ ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్ మాయ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్, ఓపెనర్ అలెస్టర్ కుక్‌ను అశ్వినే ఔట్ చేయడం విశేషం. ఉపఖండంలో మాదిరే బంతిని టర్న్‌, బౌన్స్‌ చేస్తూ ఇంగ్లిష్‌ బ్యాట్స్‌మెన్‌కు చుక్కుల చూపించాడు. ఇక, భారత జట్టుపై ఇంగ్లాండ్‌ స్పిన్నర్‌ రషీద్‌ సైతం బాగానే బౌలింగ్‌ చేశాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి పటిష్ట స్థితిలో ఉన్న టీమిండియా నాలుగో రోజు వరుసగా వికెట్లను చేజార్చుకుని ఓటమిపాలైంది.

అందరి దృష్టి లార్డ్స్ టెస్టుపైనే

అందరి దృష్టి లార్డ్స్ టెస్టుపైనే

కచ్చితంగా గెలుస్తుందని అనుకున్న మ్యాచ్‌లో భారత టాపార్డర్ విఫలం కాడవం... ఇంగ్లీషు బౌలర్లు చెలరేగడంతో 31 పరుగుల తేడాతో కోహ్లీసేన ఓడిపోయింది. మ్యాచ్‌లో స్పిన్నర్ల ప్రదర్శన బట్టి చూస్తే.. అశ్విన్‌కు తోడు కుల్దీప్‌నో లేదా జడేజానో తీసుకుని ఉంటే బాగుండేదన్న అభిప్రాయం కూడా వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి లార్డ్స్ టెస్టుపై పడింది. ఎడ్జ్‌బాస్టన్‌లో కంటే కూడా లార్డ్స్ పిచ్‌ స్పిన్నర్లకు ఎక్కువ సహకరించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంగ్లాండ్‌లో ఉష్ణ్రోగ్రతలు అధిక స్థాయిలో ఉన్నాయి. లండన్‌లో వేడి గాలులతో లార్డ్స్‌ పిచ్‌, ఔట్‌ఫీల్డ్‌ పొడిబారినట్లు కనిపిస్తున్నాయి.

లార్డ్స్‌లో చివరగా ఎప్పుడో 1976లో ఈ స్థాయి ఉష్ణ్రోగ్రత

లార్డ్స్‌లో చివరగా ఎప్పుడో 1976లో ఈ స్థాయి ఉష్ణ్రోగ్రత

ప్రస్తుతం లండన్‌లో ఉష్ణ్రోగ్రత దాదాపు 35 డిగ్రీల దాకా ఉంటోంది. ఇంగ్లాండ్‌లో సగటు ఉష్ణ్రోగ్రత కంటే ఇది చాలా ఎక్కువ. లార్డ్స్‌లో చివరగా ఎప్పుడో 1976లో ఈ స్థాయి ఉష్ణ్రోగ్రత నమోదైందట. ఈ నేపథ్యంలో పిచ్‌పై పచ్చిక ఉంచినా.. స్పిన్నర్లకు బాగానే అవకాశాలుంటాయని మైదాన వర్గాలు చెబుతున్నాయి. గాలిలో తేమ లేని నేపథ్యంలో బంతి పెద్దగా స్వింగ్‌ కాదని కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రెండో టెస్టులో టీమిండియా ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాసం ఉందని తెలుస్తోంది. తొలి టెస్టు ఓటమితో లార్డ్స్ టెస్టుని కోహ్లీసేన ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రెండో టెస్టు కోసం టీమిండియా లార్డ్స్‌కు చేరుకుంది.

లార్డ్స్‌ మైదానంలో ప్రాక్టీస్ చేసిన టీమిండియా

లార్డ్స్‌ మైదానంలో ప్రాక్టీస్ చేసిన టీమిండియా

ఇందులో భాగంగా మంగళవారం భారత ఆటగాళ్లు లార్డ్స్‌ మైదానంలో ప్రాక్టీస్ చేశారు. ఆటగాళ్లందరూ బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో ప్రాక్టీస్‌ చేశారు. టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి లార్డ్స్ పిచ్‌ను పరిశీలించాడు. పిచ్‌ గురించి క్యూరేటర్‌ను అడిగి పూర్తి సమాచారం తెలుసుకున్నాడు. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్‌ యాదవ్‌ టీమిండియా ప్రాక్టీస్‌ సెషన్లో కనిపించడంతో రెండో టెస్టులో అతడికి చోటు దక్కుతుందేమోనని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ మైదానంలో ఇప్పటి వరకు 17 టెస్టులాడిన టీమిండియా కేవలం రెండింట్లో మాత్రమే విజయాలను నమోదు చేసింది. మరోవైపు 11 టెస్టుల్లో ఓటమి పాలుకాగా, నాలుగు టెస్టులను డ్రాగా ముగించింది.

Story first published: Wednesday, August 8, 2018, 16:04 [IST]
Other articles published on Aug 8, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X