న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సిరిస్‌పై కన్నేసిన ఆతిథ్య ఇంగ్లాండ్: తుది జట్టులోకి బెన్ స్టోక్స్‌

By Nageshwara Rao
India vs England: Ben Stokes desperate to help England, says Joe Root

హైదరాబాద్: ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో టీమిండియాపై వరుస రెండు టెస్టు విజయాలతో ఊపు మీదున్న ఆతిథ్య ఇంగ్లాండ్‌ జట్టు మూడో టెస్టుకు సిద్ధమైంది. ట్రెంట్‌బ్రిడ్జ్‌ వేదికగా జరుగనున్న మూడో టెస్టులో గెలిచి సిరీస్‌ కైవసం చేసుకోవాలని ఆతిథ్య ఇంగ్లాండ్ ఊవిళ్లూరుతుండగా... ఈ టెస్టులో గెలిచి సిరీస్‌ ఆశలు నిలుపుకోవాలని కోహ్లి సేన ఆరాటపడుతోంది.

ఇప్పటికే ఐదు టెస్టుల సిరీస్‌లో 2-0తో ఇంగ్లాండ్‌ ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సిరిస్‌‌లో ఇదివరకు జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌ల మాదిరిగానే ఆతిథ్య జట్టు తన తుదిజట్టును మ్యాచ్‌కు ఒకరోజు ముందే ప్రకటించింది. భారత్‌తో మూడో టెస్టు కోసం ప్రకటించిన జట్టులో ఇంగ్లాండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ చోటు దక్కించుకున్నాడు.

గత ఏడాది బ్రిస్టల్‌లోని నైట్‌క్లబ్‌లో ఇద్దరు వ్యక్తులపై దాడి చేసిన కేసులో స్టోక్స్‌ విచారణ నిమిత్తం కోర్టుకు హాజరయ్యాడు. ఈ కారణంగానే అతడు లార్డ్స్‌ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆడలేకపోయాడు. కోర్టు విచారణలో స్టోక్స్‌ నిర్దోషి అని తేలింది. ఆత్మరక్షణ కోసమే స్టోక్స్‌ దాడికి పాల్పడ్డాడని కోర్టు తెలిపింది.

శామ్ కుర్రన్‌ స్థానంలో స్టోక్స్‌

శామ్ కుర్రన్‌ స్థానంలో స్టోక్స్‌

దీంతో తొలి టెస్టులో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న శామ్ కుర్రన్‌ను జట్టు నుంచి తప్పించి స్టోక్స్‌కు అవకాశం కల్పించారు. ఈ మేరకు శామ్‌ కరన్‌ స్థానంలో స్టోక్స్‌కు తుది జట్టులో చోటు కల్పించినట్లు ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్‌ తెలిపాడు. మరోవైపు రెండో టెస్టులో బెన్ స్టోక్స్‌ స్థానంలో వచ్చిన క్రిస్‌ వోక్స్‌పై జో రూట్ మరోసారి నమ్మకం ఉంచాడు.

అత్యంత కఠినమైన వాటిలో ఇదొకటి

ఈ సందర్భంగా జో రూట్ మాట్లాడుతూ "కెప్టెన్‌గా నేను తీసుకున్న నిర్ణయాల్లో అత్యంత కఠినమైన వాటిలో ఇదొకటి. జట్టులో ప్రతి ఒక్కరూ చాలా బాగా రాణిస్తున్నారు. కానీ, కొన్నిసార్లు వేటు తప్పదు. మొదటి రెండు మ్యాచ్‌ల విజయాల్లో శామ్‌ కీలకపాత్ర పోషించాడు. కానీ, ఇప్పుడు అతడికి జట్టులో చోటు దక్కలేదు" అని అన్నాడు.

'బ్రిస్టల్‌ పబ్‌ ఉదంతం' నుంచి బయటపడిన స్టోక్స్‌

"'బ్రిస్టల్‌ పబ్‌ ఉదంతం' నుంచి బయటపడిన స్టోక్స్‌కు మరింత ఉత్తేజాన్ని ఇచ్చే అంశం తుది జట్టులో చోటు దక్కడం. ‘స్టోక్స్‌లో అపారమైన ఆట దాగుంది.. పబ్‌ గొడవ నుంచి త్వరగా బయటపడి ఆటపై దృష్టి పెట్టాలి. టీమిండియాతో జరగబోయే మిగిలిన టెస్టుల్లో అతని నుంచి విధ్వంసకర ఆటను కోరుకుంటున్నాను" అని జో రూట్ తెలిపాడు.

అన్నీ అనుకున్నట్లు జరిగితే సిరీస్‌ ఇక్కడే గెలుస్తాం

అన్నీ అనుకున్నట్లు జరిగితే సిరీస్‌ ఇక్కడే గెలుస్తాం

"నాటింగ్‌హామ్‌ టెస్టులో గెలవడానికి గల వ్యూహాలను రచించాం.. అన్నీ అనుకున్నట్లు జరిగితే సిరీస్‌ ఇక్కడే గెలుస్తాం" అని అన్నాడు. ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో కరన్‌ ఐదు వికెట్లతో పాటు 87 పరుగులు చేయడంతో మ్యాన్‌ ఆఫ్ ద మ్యాచ్‌ అవార్డును దక్కించుకున్నాడు. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య శనివారం నుంచి మూడో టెస్టు జరగనుంది.

ట్రెంట్‌బ్రిడ్జ్ టెస్టుకు ఇంగ్లాండ్ జట్టు:

జోయ్‌ రూట్‌(కెప్టెన్‌), అలిస్టర్‌ కుక్‌, కీటన్ జెన్నింగ్స్‌, పోప్, జానీ బెయిర్‌ స్టో(వికెట్‌ కీపర్‌), బెన్‌ స్టోక్స్‌, జోస్‌ బట్లర్‌‌, క్రిస్‌ వోక్స్‌, అదిల్‌ రషీద్, స్టువార్ట్‌ బ్రాడ్‌, జేమ్స్‌ అండర్సన్‌.

Story first published: Saturday, August 18, 2018, 13:11 [IST]
Other articles published on Aug 18, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X