న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మూడో టెస్టు ఆధిక్యంతో అదరగొడుతోన్న టీమిండియా

India vs England 3rd Test Highlights: Kohli, Rahane boost India

నాటింగ్‌హామ్: ఇంగ్లాండ్‌తో నాటింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భారత్ జట్టు భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. మ్యాచ్‌లో రెండో రోజైన ఆదివారం ఆట ముగిసే సమయానికి టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 124/2తో నిలిచి మ్యాచ్‌పై పూర్తి స్థాయిలో పట్టు బిగించింది. క్రీజులో చతేశ్వర్ పుజారా (33), విరాట్ కోహ్లి (8) ఉండగా.. తొలి ఇన్నింగ్స్‌‌‌లో లభించిన 168 పరుగుల ఆధిక్యంతో కలుపుకుని ఇప్పుడు భారత్ 292 పరుగుల భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది.

సోమవారం ఒకటి లేదా రెండు సెషన్లు బ్యాటింగ్ చేసిన తర్వాత భారత్ రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసే అవకాశముంది. అంతకముందు ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 161 పరుగులకి ఆలౌటవగా.. భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులకి ఆలౌటైన విషయం తెలిసిందే.

1
42376
అరగంట ఆలస్యమైనా.. ఆధిక్యం దక్కింది:

అరగంట ఆలస్యమైనా.. ఆధిక్యం దక్కింది:

మూడో టెస్టులో భాగమైన రెండో రోజు ఆటకు వర్షం ఆటంకం కలిగించడంతో అరగంట ఆలస్యంగా ప్రారం భమైంది. అయితే 307/6 ఓవర్‌నైట్‌ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారత్‌ 7.5 ఓవర్లు మాత్రమే ఆడి 22 పరుగులకు చివరి నాలుగు వికెట్లను కోల్పోయింది. రిషబ్ (24) ఓవర్‌నైట్‌ స్కోరుకు మరో రెండు పరుగులు మాత్రమే జత చేసి బ్రాడ్‌ అవుట్‌సైడ్‌ ఆఫ్‌ స్టంప్‌ బంతిని ఆడే క్రమంలో బలయ్యాడు.

లంచ్ బ్రేక్ తర్వాత సీన్ మొత్తం రివర్స్:

లంచ్ బ్రేక్ తర్వాత సీన్ మొత్తం రివర్స్:

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు కుక్‌ (29), జెన్నింగ్స్‌ (20) స్వేచ్ఛగా ఆడి 46 పరుగుల వద్ద లంచ్‌ విరామానికి వెళ్లారు. లంచ్‌ బ్రేక్‌ తర్వాత భారత బౌలర్లు ఒక్కసారిగా ఊపందుకున్నారు. ముఖ్యంగా హార్దిక్‌ పాండ్యా తన తొలి ఐదు ఓవర్లలోనే ఐదు వికెట్లు తీసి ఇంగ్లండ్‌‌ను గట్టి దెబ్బ తీశాడు. 12వ ఓవర్‌ చివరి బంతికి ఇషాంత్‌.. కుక్‌ (29)ను అవుట్‌ చేయగా 13వ ఓవర్‌ తొలి బంతికే జెన్నింగ్స్‌ (20)ను బుమ్రా పెవిలియన్‌కు చేర్చాడు. అనంతరం కొద్దిసేపటికే ఇషాంత్‌ మరోసారి చెలరేగి పోప్‌ (10)ను అవుట్‌ చేశాడు. ఈ ముగ్గురి క్యాచ్‌లను కీపర్‌ రిషభ్‌ అందుకోవడం విశేషం. ఈ దశలో రూట్‌, బెయిర్‌స్టో పోరాడారు.

 ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌ను శాసించిన పాండ్యా

ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌ను శాసించిన పాండ్యా

పాండ్యా వేసిన 25వ ఓవర్‌లో రూట్‌ క్యాచ్‌ను రాహుల్‌ అందుకున్నాడు. 30వ ఓవర్‌ తర్వాత పాండ్యా నిప్పులు చెరిగే బంతుల తో ఒక్కసారిగా ఇంగ్లాండ్‌ పతనాన్ని శాసించాడు. 31వ ఓవర్‌ తొలి బంతికి ముందుగా బెయిర్‌స్టో (15) పనిపట్టగా ఆ తర్వాత వోక్స్‌ (8) వరుసగా రెండు ఫోర్లు బాదాడు. కానీ అదే ఓవర్‌ ఆరో బంతికి కీపర్‌ పంత్‌ క్యాచ్‌ పట్టేయడంతో అవుటయ్యాడు. దీంతో 118 పరుగులకే ఇంగ్లండ్‌ ఏడు వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత తన మరుసటి ఓవర్‌లోనే పాండ్యా మాయ చేస్తూ రషీద్‌ (5), బ్రాడ్‌ వికెట్లను ఖాతాలో వేసుకోవడంతో ఇంగ్లండ్‌ కోలుకోలేకపోయింది.

రెండో ఇన్నింగ్స్‌లోనూ బ్యాట్ ఝళిపించి:

రెండో ఇన్నింగ్స్‌లోనూ బ్యాట్ ఝళిపించి:

168 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారత్‌ వన్డే తరహాలో చెలరేగింది. అద్భుత షాట్లతో ఆకట్టుకున్న రాహుల్‌ (36) వరుస బౌండరీలతో రెచ్చిపోయాడు. దీంతో తొలి వికెట్‌కు మరోసారి 60 పరుగుల భాగస్వామ్యం జత చేరింది. 12వ ఓవర్‌లో రాహుల్‌ను స్టోక్స్‌ బౌల్డ్‌ చేశాడు. అనంతరం ధవన్‌కు జతగా పుజారా కూడా వేగంగా ఆడడంతో స్కోరు దూసుకెళ్లింది. 14వ ఓవర్‌లో పుజారా రెండు ఫోర్లు బాదాడు. అర్ధ సెంచరీ దిశగా వెళుతున్న ధవన్‌ను రషీద్‌ అవుట్‌ చేయడంతో రెండో వికెట్‌కు 51 పరుగు ల భాగస్వామ్యం ముగిసింది. పుజారా, కోహ్లీ మరో వికెట్‌ పడకుండా ఆటను ముగించారు.

Story first published: Monday, August 20, 2018, 11:16 [IST]
Other articles published on Aug 20, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X