న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs ENG: హాఫ్ సెంచరీ చేసినా.. జడేజాకు హ్యాండిచ్చిన సంజయ్ మంజ్రేకర్! ఇది కచ్చితంగా ప్రతీకారమే!!

India vs England 2nd Test: Sanjay Manjrekar misses Out Ravindra Jadeja, He Picks R Ashwin

ముంబై: నాటింగ్‌హామ్ వేదికగా ఆదివారం ముగిసిన తొలి టెస్టు మ్యాచ్ డ్రాగా ముగియగా.. రెండో మ్యాచ్ లార్డ్స్ వేదికగా గురువారం ప్రారంభం కానుంది. తొలి టెస్ట్‌లో వర్షం కారణంగా విజయాన్ని చేజార్చుకున్న కోహ్లీసేన రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగనుంది. విజయం దక్కకపోయినా.. దాదాపు భారత్ గెలిసినట్టే. దీంతో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని అందుకుంది. మరోవైపు తృటిలో ఒటమి నుంచి బయటపడిన ఇంగ్లండ్.. తప్పిదాలను సరిదిద్దుకునే పనిలో పడింది.

సొంతగడ్డపై లభించే అడ్వాంటేజ్‌తో కోహ్లీసేను ఓడించాలనే పట్టుదలతో ఉంది. దాంతో రెండో టెస్ట్ కూడా రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. లార్డ్స్ టెస్ట్ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ తన తుది జట్టును ప్రకటించాడు.

మరోసారి అక్కసు

మరోసారి అక్కసు

భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై సంజయ్ మంజ్రేకర్ మరోసారి తన అక్కసు వెళ్లగక్కాడు. గురువారం నుంచి లార్డ్స్ వేదికగా జరగనున్న రెండో టెస్టుకి జడేజాపై వేటు వేయాలని మంజ్రేకర్ సూచించాడు. రెండో టెస్టు కోసం తుది జట్టుని అంచనా వేసిన మంజ్రేకర్.. జడేజాకి అందులో చోటివ్వలేదు. అతడి స్థానంలో రవిచంద్రన్ అశ్విన్‌కు చోటు ఇచ్చాడు. యాష్ తొలి టెస్ట్ ఆడని విషయం తెలిసిందే.

అలానే మరో ఆల్‌రౌండర్‌ శార్ధూల్ ఠాకూర్‌పైనా మంజ్రేకర్ వేటు వేశాడు. శార్ధూల్ స్థానంలో తెలుగు ఆటగాడు హనుమ విహారికి మంజ్రేకర్ చోటిచ్చాడు. విహారి కూడా మొదటి టెస్ట్ ఆడలేదు. ఈ ఇద్దరిని మినహాయిస్తే.. తొలి టెస్ట్ ఆడిన ఆటగాళ్లనే సంజయ్ ఎంచుకున్నాడు.

IPL 2021: ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్స్ వచ్చేస్తున్నారు.. బెంగళూరు, ముంబై జట్లకు పండగే!!

ఇది కచ్చితంగా ప్రతీకారమే

ఇది కచ్చితంగా ప్రతీకారమే

నాటింగ్‌హామ్ వేదికగా జరిగిన తొలి ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా 86 బంతులాడి 56 పరుగులు చేశాడు. ఇందులో 8 ఫోర్లు, ఒక సిక్స్ ఉంది. చెత్త షాట్లకు పోకుండా అద్భుతంగా ఆడాడు. సింగల్స్ తీస్తూనే.. బౌండరీలు బాదాడు. కీ క్రమంలో ఆరో వికెట్‌కి కేఎల్ రాహుల్‌తో కలిసి విలువైన 84 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అక్కడే భారత్ ఆధిపత్యం చెలాయించింది.

అయితే పిచ్ పేస్‌కి అనుకూలించడంతో జడేజాతో పెద్దగా కెప్టెన్ విరాట్ కోహ్లీ బౌలింగ్ చేయించలేదు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 16 ఓవర్లు వేసిన జడేజా.. 50 పరుగులిచ్చాడు. అయితే ఒక వికెట్ తీయలేకపోయాడు. మంచి ప్రదర్శన చేసినా జడేజాపై వేటువేయమని పరోక్షంగా సంజయ్ మంజ్రేకర్ సూచించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇది కచ్చితంగా ప్రతీకారమే అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

డబ్ల్యూటీసీ ఫైనల్‌లో కూడా

డబ్ల్యూటీసీ ఫైనల్‌లో కూడా

2019 వన్డే ప్రపంచకప్ నుంచి సంజయ్ మంజ్రేకర్, రవీంద్ర జడేజాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. జ‌డేజా ఓ బిట్స్ అండ్ పీసెస్ క్రికెట‌ర్ అని మెగా టోర్నీ సంద‌ర్భంగా మంజ్రేక‌ర్ విమ‌ర్శించాడు. 'నేను అరకొర ఆటగాళ్లని పెద్దగా అభిమానించను. వన్డేల్లో రవీంద్ర జడేజా ఇప్పుడు ఆ కోవకి చెందిన ప్లేయర్.

టెస్టుల్లో జడేజా మంచి బౌలర్. కానీ వన్డేల్లో అతను బ్యాట్స్‌మెన్‌ కాదు. అలా అని బౌలర్ కూడా కాదు' అని జడేజాను తేలిక చేసి మాట్లాడాడు. ఇందుకు జడేజా ఘాటుగా స్పందించాడు. 'మంజ్రేకర్ నీ కెరీర్‌లో నువ్వు ఆడిన మ్యాచ్‌ల కంటే రెట్టింపు మ్యాచ్‌లను నేను ఆడాను. ఇప్పటికీ ఆడుతున్నాను. ఏదైనా సాధించిన వారిని గౌరవించడం నేర్చుకో. ఇకనైనా నీ నోటి విరోచనాలు ఆపు' అని జడేజా ఫైర్ అయ్యాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో కూడా సంజయ్ తన జట్టులో జడ్డూకు చోటివ్వలేదు.

సంజయ్ మంజ్రేకర్ జట్టు ఇదే

సంజయ్ మంజ్రేకర్ జట్టు ఇదే

రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, హనుమ విహారి, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.

Story first published: Tuesday, August 10, 2021, 15:23 [IST]
Other articles published on Aug 10, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X