న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఢిల్లీ టీ20: తీవ్ర వాయుకాలుష్యంలో మ్యాచ్.. వాంతి చేసుకున్న ఇద్దరు బంగ్లా క్రికెటర్లు!!

India vs Bangladesh 2019 : Two Bangladeshi Cricketers Vomited During 1st T20I In Delhi || Oneindia
India vs Bangladesh: Two Bangladeshi cricketers vomited during 1st T20I match due to Delhi poor air condition

ఢిల్లీ: మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య ఈ నెల 3న అరుణ్‌ జైట్లీ స్టేడియంలో తొలి టీ20 మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్య స్థాయి తీవ్రంగా ఉండడంతో మ్యాచ్ జరిగిన ఆదివారం రోజున ఇద్దరు బంగ్లాదేశ్ క్రికెటర్లు వాంతులు చేసుకున్నారని సమాచారం తెలుస్తోంది. ఇద్దరిలో ఒకరు స్టార్ ప్లేయర్ సౌమ్య సర్కార్ కాగా.. మరో ఆటగాడి పేరు తెలియరాలేదు.

<strong>'ఆధునిక క్రికెట్ పరంగా సెలెక్టర్ల ఆలోచన బాగాలేదు.. మనకు మంచి సెలక్టర్లు అవసరం'</strong>'ఆధునిక క్రికెట్ పరంగా సెలెక్టర్ల ఆలోచన బాగాలేదు.. మనకు మంచి సెలక్టర్లు అవసరం'

ప్రమాద స్థాయిలో కాలుష్యం:

ప్రమాద స్థాయిలో కాలుష్యం:

గత ఆదివారం రోజున ఢిల్లీ మొత్తం దుమ్మూ, ధూళీ, పొగ మంచుతో కప్పబడి ఉంది. దీంతో వాయు కాలుష్యం ప్రమాద స్థాయికి చేరింది. ఆ రోజు ఉదయం 9 గంటలకు గాలి నాణ్యత (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) 473గా ఉన్నట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది. 400 దాటితే తీవ్రమైన వాయు కాలుష్యంగా పరిగణిస్తారు. కానీ. ఆ రోజు మాత్రం దాదాపు 500లకు దగ్గరా ఉంది.

వాంతి చేసుకున్న సౌమ్య సర్కార్:

వాంతి చేసుకున్న సౌమ్య సర్కార్:

తీవ్ర కాలుష్యంలో కనీసం మాస్కులు లేకుండా భారత్-బంగ్లాదేశ్ ఆటగాళ్లు మ్యాచ్ ఆడారు. దాదాపు 3 గంటలు మైదానంలోనే ఉన్నారు. దీంతో బంగ్లాదేశ్ జట్టులోని ఇద్దరు ఆటగాళ్లు వాంతులు చేసుకున్నారని సమాచారం తెలుస్తోంది. ఇద్దరిలో ఒకరు సౌమ్య సర్కార్ కాగా.. మరో ఆటగాడి పేరు తెలియరాలేదు. ఆరోగ్య కారణాలను పరిగణనలోకి తీసుకోకుండా ఢిల్లీలో మ్యాచ్ నిర్వహించినందుకు బీసీసీఐపై చాలా విమర్శలు వస్తున్నాయి.

మ్యాచ్ ఆడతాం:

మ్యాచ్ ఆడతాం:

ప్రాక్టీస్ సమయంలో ముఖాలకు మాస్కులు ధరించిన ఆటగాళ్లు.. మ్యాచ్‌లో మాత్రం వేసుకోలేదు. మ్యాచ్‌కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వాయు కాలుష్యం అంతగా ఏమి లేదు, మ్యాచ్ ఆడతాం అని అన్న విషయం తెలిసిందే. మరోవైపు బంగ్లా కెప్టెన్, కోచ్ కూడా మ్యాచ్ ఆడడానికి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని అన్నారు.

బంగ్లా విజయం:

బంగ్లా విజయం:

తొలి టీ20 మ్యాచ్‌లో బంగ్లా 7 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. శిఖర్‌ ధావన్‌ (42 బంతుల్లో 41; 3 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్ స్కోరర్. లక్ష చేధనలో బంగ్లాదేశ్‌ 19.3 ఓవర్లలో 3 వికెట్లకు 154 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ముష్ఫికర్‌ రహీమ్‌ (43 బంతుల్లో 60 నాటౌట్‌; 8 ఫోర్లు, 1 సిక్స్‌), సౌమ్య సర్కార్‌ (35 బంతుల్లో 39; 1 ఫోర్, 2 సిక్సర్లు) విజయంలో కీలక పాత్ర పోషించారు.

Story first published: Tuesday, November 5, 2019, 11:00 [IST]
Other articles published on Nov 5, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X