న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసియాకప్ ఆఖరి ఓవర్‌లో సింగిల్స్: ప్రత్యర్ధిపై ఒత్తిడి పెంచి భారత్ విజయం

India vs Bangladesh: Relive the final over-thriller that gave Men in Blue 7th Asia Cup title, watch video

హైదరాబాద్: బంగ్లాదేశ్‌తో శుక్రవారం జరిగిన ఫైనల్లో భారత్‌ 3 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇది భారత్‌కు ఏడో ఆసియా కప్‌ టైటిల్‌. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో ఫలితం వచ్చింది. ఆసియాకప్ ఫైనల్ ఆఖరి ఓవర్. భారత విజయానికి ఆరు బంతుల్లో ఆరు పరుగులు చేయాలి.. చేతిలో మూడు వికెట్లు ఉన్నాయి.

1
44058

ఈ దశలో ఏ జట్టు అయినా.. ఓవర్ ఆరంభంలోనే ఫోర్ లేదా సిక్స్ కోసం ప్రయత్నిస్తుంది. అయితే, బంగ్లాదేశ్‌తో శుక్రవారం ముగిసిన ఫైనల్లో మాత్రం టీమిండియా ఇందుకు భిన్నంగా వ్యవహారించింది. ఆఖరి ఓవర్‌లో సింగిల్స్ తీసి విజయాన్ని అందుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

ఎలాంటి అద్భుతాలు చేయకుండా

ఎలాంటి అద్భుతాలు చేయకుండా

ఆఖరి ఓవర్‌లో క్రీజులో ఉన్న కేదార్ జాదవ్ (23), కుల్దీప్ యాదవ్ (5 నాటౌట్) ఎలాంటి అద్భుతాలు చేయకుండా విజయాన్ని కట్టబెట్టారు. వీరిద్దరిలో ఒత్తిడి అనేదే కనిపించలేదు. మరోవైపు బంగ్లాదేశ్‌ మాత్రం తీవ్ర ఒత్తిడికి గురైంది. ఆ జట్టు కెప్టెన్ మొర్తజా సుదీర్ఘ చర్చల తర్వాత ఆఖరి ఓవర్ బౌలింగ్‌ కోసం తొలుత సౌమ్య సర్కార్‌కి బంతినిచ్చినా ఆ తర్వాత మళ్లీ స్పిన్నర్ మహ్మదుల్లా చేతికి బంతినిచ్చాడు.

ఆఖరి ఓవర్ తొలి బంతికి సింగిల్ తీసిన కుల్దీప్

ఆఖరి ఓవర్ తొలి బంతికి సింగిల్ తీసిన కుల్దీప్

ఆఖరి ఓవర్ తొలి బంతికి కుల్దీప్ యాదవ్ సింగిల్ తీయడంతో స్ట్రైకింగ్‌కి వెళ్లిన టాపార్డర్ బ్యాట్స్‌మెన్ కేదార్ జాదవ్ మిగిలిన ఐదు బంతుల్నీ తానే ఆడి భారత్‌ని గెలిపిస్తాడని ఉత్కంఠగా మ్యాచ్‌ని వీక్షిస్తోన్న ప్రేక్షుకులు భావించారు. అయితే, అనూహ్యంగా రెండో బంతికి తాను ఓ సింగిల్ తీసి నాన్‌స్ట్రైక్ వైపు వెళ్లిపోయాడు. దీంతో మళ్లీ స్ట్రైక్ కుల్దీప్‌కి వచ్చింది.

మూడో బంతిని ఫీల్డర్ల తలమీదుగా మిడ్ వికెట్ దిశగా

మూడో బంతిని ఫీల్డర్ల తలమీదుగా మిడ్ వికెట్ దిశగా

దీంతో కెప్టెన్ మొర్తజా ఫీల్డర్లను అతని దగ్గరగా మొహరించాడు. మూడో బంతిని ఫీల్డర్ల తలమీదుగా మిడ్ వికెట్ దిశగా బౌండరీ లైన్‌కి సమీపంలో పడేలా బంతిని కుల్దీప్ కొట్టాడు. దీంతో రెండు పరుగులొచ్చాయి. ఆ తర్వాత బంతి వృథా కావడంతో సమీకరణం రెండు బంతుల్లో రెండు పరుగులుగా మారిపోయింది. దీంతో మ్యాచ్ చూస్తోన్న ప్రతిఒక్కరూ ఉత్కంఠకు గురయ్యారు.

 ఆఖరి బంతికి సింగిల్ తీసిన కేదార్ జాదవ్

ఆఖరి బంతికి సింగిల్ తీసిన కేదార్ జాదవ్

ఐదో బంతికి కుల్దీప్ సింగిల్.. ఆఖరి బంతికి కేదార్ ఓ సింగిల్ తీయడంతో భారత శిబిరంలో గెలుపు ఉత్సవాలు మొదలయ్యాయి. ఈ ఏడాది ముగిసిన ఐపీఎల్‌ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన కేదార్ జాదవ్.. తొలి మ్యాచ్‌లోనే తీవ్ర ఉత్కంఠ మధ్య ఆఖరి ఓవర్‌లో ఆ జట్టుకు విజయాన్ని అందించాడు.

కుల్దీప్ యాదవ్‌తో కలిసి ఆఖరి ఓవర్‌లో సింగిల్స్ ప్లాన్

ఇప్పుడు అదే అనుభవాన్ని ఆసియాకప్ ఫైనల్లో కుల్దీప్ యాదవ్‌తో కలిసి అమలు చేశాడు. ఆఖరి ఓవర్‌కు ముందుగా వీరిద్దరూ సింగిల్స్ పథకాన్ని రచించారు. అందులో భాగంగా తొలి మూడు బంతుల్లో వికెట్ చేజార్చుకోకుండా.. ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచడం, ఆ తర్వాత అవసరమైతే హిట్టింగ్ చేయాలని కేదార్ భావించాడు. అదే వ్యూహాన్ని అమలు చేయడంతో భారత్ విజయం సాధించింది.

Story first published: Saturday, September 29, 2018, 14:49 [IST]
Other articles published on Sep 29, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X