న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసియాకప్ ఫైనల్: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

India Vs Bangladesh, Asia Cup 2018 Final: Live Updates: Both the teams eye ultimate glory

న్యూ ఢిల్లీ: న్యూ ఢిల్లీ: ఆసియా కప్‌లో భాగంగా ఫైనల్‌కు చేరిన భారత్.. బంగ్లాలు తలపడుతున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన వెంటనే కెప్టెన్ రోహిత్ శర్మ మరోమాటకు తావులేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ టోర్నీలో భారత్ టాస్ గెలిచిన ప్రతీసారి ఫీల్డింగ్ ఎంచుకోవడం విశేషం.

గత మ్యాచ్‌లో జట్టుకు దూరమైన ఐదుగురు తిరిగి ఈ మ్యాచ్‌లో ఆడుతున్నట్టు రోహిత్ చెప్పాడు. ఇంగ్లాండ్ పర్యటన తర్వాత టీమిండియా ఆడుతోన్న ప్రతిష్టాత్మక సిరీస్ ఆసియా కప్. లీగ్ దశను ముగించుకుని సూపర్ 4దశ దాటి ఫైనల్‌లో అడుగుపెట్టింది టీమిండియా.

1
44058

ఈ క్రమంలో భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య శుక్రవారం జరగనున్న నేపథ్యంలో భారత ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ తోటి ఆటగాళ్లందరికీ కొన్ని ‌హెచ్చరికలు జారీ చేశాడు. ఫైనల్‌ మ్యాచ్‌లో టైటిల్‌ కోసం జరుగుతున్న పోరులో బంగ్లాదేశ్‌ జట్టును ఎట్టి పరిస్థితుల్లోనూ తక్కువగా అంచనా వేయొద్దని సూచించాడు.

ఆసియా కప్‌ చరిత్రలో భారత్, బంగ్లాదేశ్ జట్లు ఇప్పటి వరకు 11 సార్లు తలపడగా.. టీమిండియా ఏకంగా 10 సార్లు విజయాల్ని అందుకుంది. 2016 ఆసియా కప్ ఫైనల్లోనూ బంగ్లాదేశ్‌తో ఢీకొన్న భారత్ జట్టు అలవోక విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

ఇండియా జట్టు:
Rohit Sharma (c), Shikhar Dhawan, Ambati Rayudu, Dinesh Karthik, MS Dhoni (wk), Kedar Jadhav, Ravindra Jadeja, Bhuvneshwar Kumar, Yuzvendra Chahal, Kuldeep Yadav, Jasprit Bumrah

బంగ్లాదేశ్ జట్టు:
Liton Das, Soumya Sarkar, Mushfiqur Rahim (wk), Mohammad Mithun, Imrul Kayes, Mahmudullah, Mehedi Hasan, Mashrafe Mortaza (c), Nazmul Islam, Rubel Hossain, Mustafizur Rahman

Story first published: Friday, September 28, 2018, 17:08 [IST]
Other articles published on Sep 28, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X