న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్-బంగ్లాదేశ్‌ చివరి టీ20.. నాగ్‌పూర్‌లో గెలిచేదెవరు.. ఒక మార్పుతో భారత్?

India vs Bangladesh 3rd T20I Preview, Predicted XI, Live Streaming, Weather forecast and Pitch report

నాగ్‌పూర్: బంగ్లాదేశ్‌తో టీ20 సమరంలో భారత జట్టుకు ఎదురుండదు. మొత్తం ఏకపక్ష విజయాలు ఉంటాయని అంతా భావించారు. కానీ.. బంగ్లాదేశ్‌ అంచనాలను తలక్రిందులు చేసి తొలి టీ20లో అద్భుత విజయాన్ని అందుకుంది. రెండో మ్యాచ్‌లో మంచి విజయం సాధించిన రోహిత్‌ సేన మూడో పోరును నిర్ణయాత్మకం చేసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో చెరోటి గెలిచి సమంగా ఉన్న ఇరు జట్లు సిరీస్ దక్కించుకోవాలనే పట్టుదలతో ఉన్నాయి. ఢిల్లీ విజయమిచ్చిన ఆత్మవిశ్వాసంతో బంగ్లా కనిపిస్తుంటే.. రాజ్‌కోట్‌లో ప్రతీకార విజయంతో రోహిత్‌సేన జోరు కొనసాగించాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.

<strong>టోక్యో ఒలింపిక్‌ బెర్త్‌ పట్టేసిన తేజస్విని.. భారత్‌కు 12వది!!</strong>టోక్యో ఒలింపిక్‌ బెర్త్‌ పట్టేసిన తేజస్విని.. భారత్‌కు 12వది!!

ఒక మార్పుతో భారత్:

ఒక మార్పుతో భారత్:

తొలి మ్యాచ్ ఓడినా.. రెండో పోరులో అదే జట్టుతో కెప్టెన్ రోహిత్ శర్మ బరిలోకి దిగాడు. అయితే కీలక మ్యాచ్ అయిన రాజ్‌కోట్‌లో మాత్రం కచ్చితంగా ఒక మార్పుతో బరిలోకిదిగే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లో పేసర్ ఖలీల్‌ అహ్మద్‌ పూర్తిగా నిరాశపరిచాడు. రెండు మ్యాచ్‌ల్లోనూ భారీగా పరుగులిచ్చాడు. దాంతో రాజ్‌కోట్‌ మ్యాచ్‌కు ఖలీల్‌ స్థానంలో శార్దూల్‌ ఠాకూర్‌ జట్టులోకి వచ్చే అవకాశాలున్నాయి. గత మ్యాచ్‌లో తడబాటును దృష్టిలో ఉంచుకొని వికెట్ కీపర్ రిషబ్ పంత్ స్థానంలో సంజు శాంసన్‌ను తీసుకునే అవకాశం లేకపోలేదు.

హిట్‌మ్యాన్ మరోసారి:

హిట్‌మ్యాన్ మరోసారి:

రెండో మ్యాచ్‌లో బ్యాట్‌తో విరుచుకుపడిన హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ మరోసారి అదే ఊపులో బంగ్లా ఆటకట్టించాలని భావిస్తున్నాడు. శిఖర్ ధావన్‌ పరుగులు చేసినా.. తగినంత ధాటి అతని బ్యాటింగ్‌లో కనిపించడం లేదు. దీంతో ధావన్‌ బ్యాటింగ్‌పై అందరి దృష్టి నిలవడం ఖాయం. క్రీజులో ఉన్నంతసేపు శ్రేయస్‌ అయ్యర్ పరుగుల పారిస్తున్నాడు. సిరీస్‌లో ఇంత వరకు ప్రభావం చూపని కేఎల్ రాహుల్, పంత్ బ్యాట్ జులిపించాల్సిన అవసరం ఉంది.

ఖలీల్‌ అహ్మద్‌ వైఫల్యం:

ఖలీల్‌ అహ్మద్‌ వైఫల్యం:

ఏమంత ఆడకపోయినా యువ ఆటగాడు శివమ్‌ దూబేను ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించవచ్చు. బ్యాట్‌, బంతితోనూ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్న కృనాల్ పాండ్య ఫామ్‌లోకి రావాలని జట్టు కోరుకుంటోంది. వాషింగ్టన్ సుందర్ పరుగులు కట్టడి చేస్తున్నా.. అంచనాలకు తగ్గట్టు వికెట్లు పడగొట్టలేకపోతున్నాడు. మధ్య ఓవర్లలో ప్రత్యర్థిని కట్టడి చేయడంలో తన విలువేమిటో చహల్‌ మరోసారి నిరూపించాడు. ఖలీల్‌ అహ్మద్‌ వైఫల్యం శార్దుల్‌ ఠాకూర్‌ను తుది జట్టులోకి తీసుకురానుంది. దీపక్ చాహర్ మాత్రం రాణిస్తున్నాడు.

సీనియర్లపై భారం:

సీనియర్లపై భారం:

బంగ్లాదేశ్‌ తొలి మ్యాచ్‌ విజయంలో ముష్ఫికర్‌ రహీమ్‌దే కీలక పాత్ర. రహీమ్‌ గత మ్యాచ్‌లో విఫలం కాగా.. కెప్టెన్‌ మహ్ముదుల్లా ఫర్వాలేదనిపించాడు. సీనియర్లయిన వీరిద్దరు మరోసారి రాణించడంపై ఆ జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. నయీమ్‌, సౌమ్య సర్కార్, లిటన్‌ దాస్‌లు దూకుడుగా ఆడితేనే భారీ స్కోరు చేసేందుకు అవకాశం ఉంటుంది. ముస్తఫిజుర్‌ తన స్థాయికి తగినట్లుగా బౌలింగ్‌ చేయలేకపోవడం బంగ్లాకు సమస్యగా మారింది. అమీనుల్, అల్‌ అమీన్‌లకు పెద్దగా అనుభవం లేదు. గత మ్యాచ్‌లో భారీగా పరుగులిచ్చిన పేసర్‌ షఫీయుల్‌ స్థానంలో స్పిన్నర్‌ తైజుల్‌కు చాన్స్‌ దక్కవచ్చు.

పిచ్, వాతావరణం:

పిచ్, వాతావరణం:

నాగ్‌పూర్ పిచ్ సాధారణ బ్యాటింగ్‌ వికెట్‌. పిచ్ స్పిన్ బౌలింగ్‌కు అనుకూలించనుంది. దేశంలోని పెద్ద గ్రౌండ్‌లలో ఒకటి. భారీ స్కోర్లకు అవకాశం తక్కువ. ముందుగా బ్యాటింగ్‌ చేసిన జట్టుకే అనుకూలం. ఇక్కడ జరిగిన గత 11 మ్యాచ్‌ల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టే 8సార్లు గెలిచింది. వర్షం పడే అవకాశాలు చాలా తక్కువ. రాత్రి 7 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌-1లో ప్రత్యక్ష ప్రసారం అవనుంది.

జట్లు (అంచనా):

జట్లు (అంచనా):

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధవన్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్)/సంజు శాంసన్, శివమ్ దూబే, కృనాల్ పాండ్య, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, ఖలీల్ అహ్మద్/శార్దూల్ ఠాకూర్, చాహల్.

బంగ్లాదేశ్: లిటన్ దాస్, మహమ్మద్ నయీమ్, సౌమ్య సర్కార్, ముష్ఫికర్ రహీమ్ (వికెట్ కీపర్), మహ్ముదుల్లా (కెప్టెన్), అఫిఫ్ హుసేన్, మొసాద్దీక్, అమినుల్ ఇస్లాం, షఫియుల్/తైజుల్ ఇస్లాం, అల్‌అమీన్ హుసేన్, ముస్తాఫిజుర్ రహ్మాన్.

Story first published: Sunday, November 10, 2019, 11:49 [IST]
Other articles published on Nov 10, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X