న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రోహిత్ శర్మ వచ్చేశాడు.. వేటు ఎవరిపైనో? తల నొప్పిగా మారిన టీమ్ సెలెక్షన్!

India vs Australia: Where will Rohit Sharma bat? Who will be in, who out?

హైదరాబాద్: బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో రెండు టెస్ట్‌లు ముగిశాయి. కానీ టీమిండియా ఓపెనింగ్ సమస్య మాత్రం ఇంకా తీరలేదు. ఇప్పటివరకైతే సిరీస్ 1-1తో సమంగా ఉంది కాబట్టి పెద్దగా ఇబ్బంది లేదు. కానీ మెల్‌బోర్న్ ఓటమితో కంగారూలు ఉడికిపోతున్నారు. ఈ నేపథ్యంలో సిడ్నీ టెస్ట్‌లో ఆసీస్‌ను ఆపాలంటే.. టీమిండియా ఓపెనింగ్ సమస్య పరిష్కారం కావాలి. మరి ఈ సమస్యను తీర్చే కొత్త ఓపెనర్ ఎవరు? కేఎల్ రాహులా? రోహిత్ శర్మనా? వీళ్లలో ఒకర్ని తీసుకుంటే వేటు ఎవరిపై వేయాలి. ఇద్దర్నీ తీసుకుంటే మిడిలార్డర్‌ భారం మోసేదెవరు..? ఇవన్నీ టీమ్‌మేనేజ్‌మెంట్ ముందున్న ప్రశ్నలు. కానీ బ్యాటింగ్ బలహీనతకు చెక్‌‌‌‌ పెట్టాలంటే మాత్రం మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందే. మరీ ముఖ్యంగా రోహిత్‌ అందుబాటులోకి రావడంతో ఓపెనర్‌ స్థానాన్ని ఖరారు చేయడం సవాలుగా మారింది.

రోహిత్‌కు ప్లేసుందా?

రోహిత్‌కు ప్లేసుందా?

స్టార్‌‌‌‌ బ్యాట్స్‌‌‌‌మన్‌‌‌‌ రోహిత్‌‌‌‌ శర్మ జట్టుతో కలవడంతో ఓపెనింగ్ జోడీపై అందరి దృష్టి నెలకొంది. స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్‌‌‌‌ ద్వారా టెస్ట్‌‌‌‌ ఓపెనర్‌‌‌‌గా రోహిత్‌‌‌‌ సూపర్‌‌‌‌ సక్సెస్‌‌‌‌ సాధించాడు. తొడకండరాల గాయం‌‌‌ నుంచి కోలుకుని ఆసీస్‌‌‌‌ వెళ్లిన రోహిత్‌‌‌‌.. రెండు వారాల క్వారంటైన్‌‌‌‌ పూర్తి చేసుకుని బుధవారం టీమ్‌‌‌‌తో కలిశాడు. రోహిత్‌‌‌‌ ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ లెవెల్స్‌‌‌‌పై ఓ అంచనాకు వచ్చాకే అతనిపై తుది నిర్ణయం తీసుకుంటామని కోచ్‌‌‌‌ రవిశాస్త్రి ఇప్పటికే చెప్పాడు. అయితే హిట్‌‌‌‌మ్యాన్‌‌‌‌ ఫిట్‌‌‌‌గా ఉండి థర్డ్‌‌‌‌ టెస్ట్‌‌‌‌ సెలెక్షన్‌‌‌‌కు అందుబాటులోకి వస్తే.. ఏ ప్లేస్‌‌‌‌లో ఆడిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.

గిల్‌కు నో టెన్షన్..

గిల్‌కు నో టెన్షన్..

రోహిత్‌‌‌‌ను ఓపెనర్‌‌‌‌గానే కొనసాగించాలంటే.. ఇప్పుడున్న యంగ్‌‌‌‌ ఓపెనర్లలో ఒకరిపై వేటు వేయాలి. అప్పుడు మయాంక్‌‌‌‌, గిల్‌‌‌‌లో ఒకరు తమ ప్లేస్‌‌‌‌ను త్యాగం చెయ్యాలి. బాక్సింగ్‌‌‌‌ డే టెస్ట్‌‌‌‌లో అరంగేట్రం చేసిన గిల్‌‌‌‌.. రెండు ఇన్నింగ్స్‌‌‌‌ల్లోనూ మంచి మార్కులే కొట్టేశాడు. దీంతో ఈ యంగ్‌‌‌‌స్టర్‌‌‌‌ ప్లేస్‌‌‌‌కు ప్రస్తుతానికి ఢోకా లేదు. దీంతో ఫామ్‌‌‌‌ కోసం తంటాలు పడుతున్న మయాంక్‌‌‌‌పై వేటు వెయ్యాలి. మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ ఆ పని చేస్తుందా అంటే.. అవునని చెప్పలేం.

విహారి త్యాగం చేస్తాడా?

విహారి త్యాగం చేస్తాడా?

అలా కాకుండా రోహిత్‌‌‌‌, మయాంక్‌‌‌‌ ఇద్దరినీ తుది జట్టులో ఆడించాలనుకుంటే మిడిలార్డర్‌‌‌‌లో హనుమ విహారిపై వేటు వేయాలి. రోహిత్‌‌‌‌ను ఓపెనర్‌‌‌‌గా పంపాలన్నా.. అతనికి సరైన మ్యాచ్‌‌‌‌ ప్రాక్టీస్‌‌‌‌ లేదు. కాబట్టి ఇక తప్పదు మిడిలార్డర్‌‌‌‌లోనే ఆడించాలంటే మాత్రం విహారి త్యాగం చేయాల్సిందే. కానీ ఈ సమీకరణానికి రహానే ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే ఓపెనింగ్‌‌‌‌లో మయాంక్‌‌‌‌ను తప్పించి రోహిత్‌‌‌‌ను తీసుకుంటే అనుభవం‌‌‌ పెరుగుతుంది. అయితే ఈ ఏడాది ప్రారంభంలో న్యూజిలాండ్‌‌‌‌లో జరిగిన సిరీస్‌‌‌‌లో రోహిత్ టెస్ట్‌‌‌‌ ఓపెనర్‌‌‌‌గా ఆడాల్సి ఉంది. కానీ గాయం వల్ల సిరీస్‌‌‌‌ నుంచి మధ్యలోనే తప్పుకున్నాడు. మరోపక్క అసలు రోహిత్‌‌‌‌ ఏ స్థానంలో ఆడేందుకు ఆసక్తి చూపిస్తున్నాడనేది కూడా తేలాల్సి ఉంది. అసలు మూడో టెస్ట్‌‌‌ నుంచి రోహిత్‌‌‌‌ను పూర్తిగా తప్పించి రాహుల్‌‌‌‌కు చాన్స్‌‌‌‌ ఇచ్చే అవకాశం లేకపోలేదు.

మయాంక్‌‌‌‌‌‌ను తప్పించలేరా?

మయాంక్‌‌‌‌‌‌ను తప్పించలేరా?

ఓపెనర్‌‌‌‌గా రోహిత్‌‌‌‌.. ఫైనల్‌‌‌‌ ఎలెవన్‌‌‌‌లోకి రావాలంటే ఇప్పుడున్న ఆప్షన్‌‌‌‌ ప్రకారం మయాంక్‌‌‌‌పై వేటు పడుతుంది. కానీ గత 18 నెలల్లో సెంచరీలు, డబుల్‌‌‌‌ సెంచరీలు చేసిన మయాంక్‌‌‌‌ను పక్కనబెట్టడం కఠినమైన నిర్ణయమేనని మాజీ చీఫ్‌‌‌‌ సెలెక్టర్‌‌‌‌ ఎమ్మెస్కే ప్రసాద్‌‌‌‌ అన్నాడు. ‘రోహిత్‌‌‌‌ వస్తే మయాంక్‌‌‌‌, విహారిలో ఒకరు బయటకు వెళ్లాల్సిందే. కానీ గత ఫామ్‌‌‌‌ ప్రకారం మయాంక్‌‌‌‌ను పక్కనపెట్టడం అంటే అది కఠినమైన నిర్ణయమే. పైగా లాంగ్‌‌‌‌ బ్రేక్‌‌‌‌ తర్వాత వస్తుండటంతో రోహిత్‌‌‌‌ కూడా ఓపెనింగ్‌‌‌‌కు ఇష్టపడతాడని నేను అనుకోవడం లేదు. ఓపెనింగా? మిడిలార్డరా ? హిట్‌‌‌‌మ్యాన్‌‌‌‌ ఏం కోరుకుంటాడో తేలాలి ' అని ఎమ్మెస్కే అభిప్రాయపడ్డాడు. మయాంక్‌‌‌‌, విహారి ప్లేస్‌‌‌‌లను రోహిత్‌‌‌‌, రాహుల్‌‌‌‌తో భర్తీ చేసి జట్టును మరింత బలోపేతం చేయాలని మరో మాజీ సెలెక్టర్‌‌‌‌ దిలీప్‌‌‌‌ వెంగ్‌‌‌‌సర్కార్‌‌‌‌ సూచించాడు.

Story first published: Thursday, December 31, 2020, 9:02 [IST]
Other articles published on Dec 31, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X