న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విజయమే లక్ష్యంగా టీమిండియా: తొలి టెస్టుకు ముందు ఇలా (ఫోటోలు)

India vs Australia: Virat Kohli undergoes circuit training ahead of Adelaide Test

హైదరాబాద్: ఆసీస్ గడ్డపై టీమిండియా మరో కఠిన సవాల్‌కు సిద్ధమవుతోంది. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య డిసెంబర్ 6 నుంచి అడిలైడ్ వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. తొలి టెస్టుకు ముందు క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డ్ ఎలెవన్ జట్టుతో ఆడిన వార్మప్ మ్యాచ్‌‌లో భారత బ్యాట్స్‌మెన్ పరుగుల వరద పారించిన సంగతి తెలిసిందే.

<strong>సువర్ణావకాశం... ఆసీస్ గడ్డపై ఓపెనర్లు ఆటే ఎంతో కీలకం: సచిన్</strong>సువర్ణావకాశం... ఆసీస్ గడ్డపై ఓపెనర్లు ఆటే ఎంతో కీలకం: సచిన్

ప్రస్తుతం టీమిండియా టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలొ కొనసాగుతోంది. ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టుతో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండు హాఫ్ సెంచరీలతో అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్నాడు. మరోవైపు వార్మప్ మ్యాచ్‌లో రహానే, విహారి, విజయ్, పుజారా సైతం సత్తా చాటారు.

వార్మప్ మ్యాచ్ ముగిసిన తర్వాత

ఇక, బౌలర్ల విషయానికి వస్తే భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్ ఆశించిన స్థాయిలో రాణించారు. ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టుతో వార్మప్ మ్యాచ్ ముగిసిన తర్వాత భారత ఆటగాళ్లు ఏ మాత్రం విశ్రాంతి తీసుకోకుండా జిమ్‌లో చెమటోడ్చుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోని కోహ్లీ తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకున్నాడు.

అడిలైడ్ వేదికగా తొలి టెస్టు

అడిలైడ్ వేదికగా తొలి టెస్టు

డిసెంబర్ 6 నుంచి అడిలైడ్ ఓవల్ స్టేడియం వేదికగా తొలి టెస్ట్ జరగనుంది. వార్మప్ మ్యాచ్‌లో గాయపడిన పృథ్వీ షా తొలి టెస్టుకు దూరమయ్యాడు. దీంతో తొలి టెస్టులో మురళీ విజయ్‌తో కలిసి ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ఆరంభించడం దాదాపు ఖాయమైంది. మరోవైపు అడిలైడ్ టెస్టుకు వర్ష సూచన ఉంది.

టెస్ట్ సిరిస్‌కు వర్ష సూచన

టెస్ట్ సిరిస్‌కు వర్ష సూచన

దీంతో సిరిస్‌లో భాగంగా ఆరంభమయ్యే తొలి టెస్టుకు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సిరిస్‌లో ముగిసిన మూడు టీ20ల సిరిస్‌ను టీమిండియా 1-1తో సమం చేసింది. బ్రిస్బేన్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌‌లో ఆసీస్ నెగ్గగా... సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి టీ20లో భారత్ విజయం సాధించింది.

 టెస్టు సిరిస్ అనంతరం మూడు వన్డేల సిరిస్

టెస్టు సిరిస్ అనంతరం మూడు వన్డేల సిరిస్

ఇక, వర్షం కారణంగా మెల్ బోర్న్ వేదికగా జరగాల్సిన రెండో టీ20 రద్దైన సంగతి తెలిసిందే. దీంతో కోహ్లీసేన మూడు టీ20ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఇప్పుడు ఇరు జట్ల మధ్య నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ గురువారం నుంచి ఆరంభం కానుంది. అనంతరం ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరిస్ జరగనుంది.

భారత జట్టు:

భారత జట్టు:

విరాట్ కొహ్లీ ( కెప్టెన్ ), అజింక్యా రహానె ( వైస్ కెప్టెన్ ), రోహిత్ శర్మ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), మురళీ విజయ్, పృథ్వీషా, చటేశ్వర్ పూజారా, హనుమ విహారి, పార్థీవ్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా

Story first published: Monday, December 3, 2018, 17:37 [IST]
Other articles published on Dec 3, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X