న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆరోన్ ఫించ్ క్లీన్‌బౌల్డ్: గాల్లోకి ఎగిరిమరీ కోహ్లీ సంబరాలు (వీడియో)

India vs Australia: Virat Kohli Sets Adelaide Alight With Fiery Celebration As Ishant Sharma Dismisses Aaron Finch – Watch

హైదరాబాద్: అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో ఇషాంత్ శర్మ టీమిండియాకు అద్భుతమైన శుభారంభాన్నిచ్చాడు. తొలి టెస్టులో రెండో రోజైన శుక్రవారం ఓవర్ నైట్ 250/9 స్కోరుతో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన టీమిండియా తొలి బంతికే షమీ వికెట్‌ను కోల్పోయింది.

<strong>అడిలైడ్ టెస్టు, డే 2: టీ విరామానికి ఆస్ట్రేలియా 117/4</strong>అడిలైడ్ టెస్టు, డే 2: టీ విరామానికి ఆస్ట్రేలియా 117/4

దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 250 పరుగులకి ఆలౌట్‌ కాగా, ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ను నిలకడగా ఆరంభించే ప్రయత్నం చేసింది. అయితే టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ మాత్రం భారత్‌కి చక్కటి శుభారంభాన్నిచ్చాడు. ఈ మ్యాచ్‌లో తొలి ఓవర్ వేసిన ఇషాంత్ మూడో బంతికే ఆసీస్ ఓపెనర్ అరోన్ ఫించ్(0) క్లీన్‌బౌల్డ్ చేశాడు.

ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా పడిన బంతిని

ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా పడిన బంతిని ఆడేందుకు అరోన్ ఫించ్ ప్రయత్నించాడు. అయితే, బ్యాట్‌కి ఎడ్జ్ తీసుకున్న బంతి నేరుగా వెళ్లి ఆఫ్, మిడిల్ స్టంప్‌లను గిరాటేసింది. దీంతో ఆ రెండు స్టంప్స్ గాల్లోకి విసురుగా ఎగిరి దూరంగా పడిపోయాయి. దీంతో కెప్టెన్ కోహ్లీ ఆనందంతో గాల్లోకి ఎగురుతూ పంచ్‌లిస్తూ సంబరాలు చేసుకున్నాడు.

ఆరోన్ ఫించ్ క్లీన్ బౌల్డ్

ఆరోన్ ఫించ్ క్లీన్ బౌల్డ్ రెండోరోజైన శుక్రవారం మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇదిలా ఉంటే, రెండో రోజు టీ విరామానికి నాలుగు వికెట్లు కోల్పోయి 117 పరుగులు చేసింది. శుక్రవారం ఆటలో భాగంగా తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆస్ట్రేలియా ఇషాంత్‌ శర్మ వేసిన తొలి ఓవర్‌లోనే ఆరోన్ ఫించ్‌ వికెట్‌ను చేజార్చుకుంది.

ఆసీస్‌కు ఆదిలోనే షాక్‌

ఆసీస్‌కు ఆదిలోనే షాక్‌

తొలి ఓవర్‌ మూడో బంతికి ఫించ్‌ బౌల్డ్‌ కావడంతో ఆసీస్‌కు ఆదిలోనే షాక్‌ తగిలింది. అనంతరం క్రీజులోకి వచ్చిన మార్కస్‌ హారిస్‌-ఉస్మాన్‌ ఖవాజాల జోడి స్కోరు బోర్డుని నడిపిస్తున్నారు. వీరిద్దరూ కలిసి 45 పరుగులు జోడించిన తర్వాత హారిస్‌(26) రెండో వికెట్‌గా అశ్విన్‌ బౌలింగ్‌లో మురళీ విజయ్‌కు క్యాచ్‌ ఇచ్చి హారిస్‌ పెవిలియన్‌ చేరాడు.

250 పరుగులకు ఆలౌటైన టీమిండియా

250 పరుగులకు ఆలౌటైన టీమిండియా

ఆ తర్వాత స్పల్ప వ్యవధిలోనే షాన్‌ మార్ష్‌(2)ని అశ్విన్‌ పెవిలియన్‌కు చేర్చడంతో ఆస్ట్రేలియా 59 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత మరో 28 పరుగుల వ్యవధిలోనే ఉస్మాన్ ఖవాజా(28) కూడా అశ్విన్‌ బౌలింగ్‌లో ఔట్‌ కావడంతో ఆస్ట్రేలియా 87 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి దిగిన పీటర్ హ్యాండ్‌స్కాంబ్‌-ట్రావిస్‌ హెడ్‌ల జోడీ నిలకడగా ఆడటంతో తిరిగి ఆస్ట్రేలియా గాడిలో పడింది. తొలి ఇ‍న్నింగ్స్‌లో టీమిండియా 250 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.

1
43623
Story first published: Friday, December 7, 2018, 12:32 [IST]
Other articles published on Dec 7, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X