న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నెట్స్‌లో ముమ్మరంగా ప్రాక్టీసు చేస్తోన్న టీమిండియా(వీడియో)

India vs Australia: Virat Kohli & Co practice hard ahead of Boxing Day Test

మెల్‌బోర్న్‌: ఆతిధ్య ఆస్ట్రేలియాతో డిసెంబరు 26న జరగనున్నబాక్సింగ్ డే టెస్టు సందర్భంగా మెల్‌బౌర్న్‌లో కోహ్లీ సేన సోమవారం ముమ్మరంగా నెట్ ప్రాక్టీస్ చేసింది. ఇప్పటికే రెండు టెస్టుల్లో 1-1తో సమానంగా నిలిచిన ఆసీస్-భారత్‌లు మూడో టెస్టు ఆధిక్యం సాధించేందుకు తీవ్రంగా శ్రమించాయి. ఈ సందర్భంగా తమ అభిమాన క్రికెట్ స్టార్లను తిలకించేందుకు భారత అభిమానులే కాకుండా ఆస్ట్రేలియా జట్టు అభిమానులు సైతం మద్దతు తెలుపుతూ పెద్ద సంఖ్యలో నెట్ ప్రాక్టీస్‌లను తిలకించారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సహా మిగిలిన క్రికెటర్ల నెట్ ప్రాక్టీస్ సెషన్‌కు హాజరైన అభిమానులను ప్రోత్సహిస్తున్న ఫొటోలను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) వీడియో రూపంలో విడుదల చేసింది.

పర్యవేక్షణలో జట్టు సభ్యులంతా కఠోర సాధన

జట్టు ప్రధాన కోచ్ రవి శాస్త్రి పర్యవేక్షణలో జట్టు సభ్యులంతా కఠోర సాధన చేశారు. టీమిండియాలో తాజాగా చోటు దక్కించుకున్న ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య కూడా నెట్ ప్రాక్టీస్‌లో చెమటోడ్చడం అభిమానులను మరింత ఉత్సాహానికి గురిచేసింది. అడిలైడ్ వేదికగా 31 పరుగులతో ఓడిన ఆస్ట్రేలియా రెండో టెస్టులో మాత్రం టీమిండియాను146 పరుగుల ఆధిక్యంతో శాసించింది. దీంతో 1-1తో సిరీస్‌ను సమం చేసుకుని మూడో టెస్టుకు సిద్ధమవుతోంది.

మయాంక్‌ను అనూహ్యంగా ఆస్ట్రేలియా రప్పించి

పెర్త్‌లో ఓపెనర్లు నిరాశపరచడంతో జట్టులో కీలక మార్పులు చేపట్టిన టీమిండియా కర్ణాటక క్రికెటర్ మయాంక్ అగర్వాల్‌ను అనూహ్యంగా ఆస్ట్రేలియా రప్పించి జట్టులో స్థానం కల్పించింది. గాయం కారణంగా జట్టుకు దూరమైన హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మలకు జట్టులో స్థానం కల్పించారు. పాండ్యా.. ఆసియా కప్ జరుగుతన్న సమయంలో నడుం కింది భాగంలో గాయం కారణంగా జట్టుకు దూరమైయ్యాడు. పృథ్వీ షా సిరీస్‌ మొత్తానికి దూరమైన సంగతి తెలిసిందే.

అశ్విన్ అనుకున్నంత స్థాయిలో రాణించలేక

రవిచంద్రన్ అశ్విన్‌ గాయం నుంచి కోలుకోకపోవడంతో మూడో టెస్టుకు దూరమైయ్యాడు. గాయంతోనే పెర్త్ టెస్టులో ఆడిన అశ్విన్ అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయాడు. ఫిట్‌నెస్‌‌ను త్వరగా సాధించాడని మూడో టెస్టులోకి తీసుకుంది టీమిండియా.

Story first published: Tuesday, December 25, 2018, 12:06 [IST]
Other articles published on Dec 25, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X