న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs Australia : ఆసీస్‌పై మూడో టీ20లో భారత్ విజయానికి టాప్ 5 కారణాలివే..!

India Vs Australia : Top 5 Reasons For India To Defeat Australia In 3rd T20I

హైదరాబాద్ : ఆద్యంతం రసవత్తరంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య టీ20 సిరీస్లోని మూడో టీ20 మ్యాచ్ సాగింది. అయితే చివరి ఓవర్ వరకు అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో చివరికి భారత్‌నే విజయం వరించింది. చివరి 2ఓవర్లో 21పరుగులు కావాల్సిన దశలో 19వ ఓవర్లో 10పరుగులు రాగా.. చివరి ఓవర్లో గెలుపునకు 11పరుగులు కావాల్సిన తరుణంలో మరో బంతి మిగిలి ఉండగానే.. భారత్ గెలుపు గీతను దాటింది. కోహ్లీ తొలి బంతికి సిక్స్ కొట్టి 2వ బంతికి క్యాచ్ ఔట్ కావడంతో ఉత్కంఠ తారస్థాయికి చేరిన క్రమంలో.. హార్దిక్ 2బంతుల్లో 4పరుగులు కావాల్సిన తరుణంలో అల్ట్రా కాన్ఫిడెన్స్‌తో బ్యాక్ సైడ్ ఫోర్ కొట్టడంతో ఇండియా గెలుపొందింది. ఇక ఈ మ్యాచ్ భారత్ గెలవడానికి అయిదు ప్రధాన కారణాలను గనుక విశ్లేషిస్తే..

అక్షర్ పటేల్ సూపర్ బౌలింగ్..

అక్షర్ పటేల్ సూపర్ బౌలింగ్..

చెప్పాలంటే ఈ సిరీస్లో అక్షర్ పటేల్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. మరోవైపు మిగతా బౌలర్లు గేట్లేత్తెసి పరుగులు భారీగా ఇచ్చుకుంటూ వికెట్లేమీ తీయకపోతుంటే.. అక్షర్ మాత్రం పరుగులు కట్టడి చేయడమే కాకుండా.. 8వికెట్లు కూడా తీసి భారత్ సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా అందుకున్నాడు. ఇక డిసైడర్ అయిన మూడో మ్యాచ్‌లో అక్షర్ పటేల్ (4-0-33-3) నాలుగు ఓవర్లలో మూడు కీలక వికెట్లు తీయడంతో పాటు ఓ కీలక రనౌట్ చేసి రాణించాడు. అతను ఫించ్ (7), వేడ్(1), జోష్ ఇంగ్లీస్(24) వికెట్లు తీసి స్కోరు పెరగకుండా చూడడమే కాకుండా.. భీకర హిట్టర్ అయిన మ్యాక్సీ‌(6)ని డైరెక్ట్ త్రోతో రనౌట్ చేసి ఆసీస్‌‌ను గట్టి దెబ్బ కొట్టాడు.

కోహ్లీ ఛేజింగ్ మంత్ర

కోహ్లీ ఛేజింగ్ మంత్ర

నంబర్ 3 పొజిషన్లో కోహ్లీ ఎంతటి విలువైన ప్లేయర్ ఈ మ్యాచ్ ద్వారా మరోసారి చూపించాడు. ఛేజింగ్లో రారాజుగా పేరొందిన కోహ్లీ నేటి మ్యాచ్‌లో దానికి నిలువుటద్దంలా నిలిచే ఇన్నింగ్స్ ఆడాడు. అవసరమైనంత సేపు క్రీజులో ఉండి.. ఇన్నింగ్స్ రిక్వయిడ్ రన్ రేట్ పడిపోకుండా ఓ పద్ధతి ప్రకారం.. గులాబీ మొక్కకు అంటుకట్టినట్లు.. చాలా శ్రద్ధగా ఆడాడు.. ఆడు మొగడ్రా బుజ్జీ అనే రేంజులో కోహ్లీ ఛేజింగ్ మంత్ర సాగింది. తొలుత రోహిత్, తర్వాత సూర్య, ఆ తర్వాత హార్దిక్‌తో కలిసి ఇన్నింగ్స్ నడిపించిన కోహ్లీ.. దాదాపు మ్యాచ్ గెలుపు అంచులవరకు క్రీజులోనే ఉన్నాడు. కోహ్లీ (63పరుగులు 48బంతుల్లో 3ఫోర్లు, 4సిక్సర్లు) ఇన్నింగ్స్.. జట్టు విజయానికి వెన్నెముకలా నిలిచింది.

 సూర్యకుమార్ యాదవ్ దండయాత్ర

సూర్యకుమార్ యాదవ్ దండయాత్ర

నంబర్ 4లో భారత్‌కు ఎలాంటి ప్లేయర్ కావాలో అలాంటి ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్. నయా మిస్టర్ 360.. కుదురుకుంటే ఎంతటి మ్యాచ్ అయినా వన్ సైడ్ కావాల్సిందే. ఈ మ్యాచ్‌లో కీలక సమయంలో బ్యాటింగ్ దిగిన సూర్య.. వచ్చీ రాగానే హిట్టింగ్ మొదలెట్టకుండా కాసేపు జాగ్రత్తగానే ఆడాడు. కాస్త కుదురుకున్నాక ఆసీస్ బౌలర్లకు తన మాస్టర్ క్లాస్ షాట్ల రుచి చూపించాడు. సూర్య ఉన్నంత సేపు ఆసీస్ బౌలర్లు లయ తప్పినట్లే కన్పించింది. ఫలితంగా స్కోరు బోర్డు ఎక్కడా ఆగకుండా అమాంతం దూసుకెళ్లింది. సూర్య (69పరుగులు 36బంతుల్లో 5ఫోర్లు, 5సిక్సర్లు) విధ్వంసం.. కోహ్లీ అండగా సాగింది. ఇక అతను ఔటయినప్పటికీ.. అప్పటికీ భారత్ ఛేజింగ్‌కు అనువైన స్కోరును కలిగి ఉండేలా చేశాడు.

హర్షల్ పటేల్ చివరి ఓవర్

హర్షల్ పటేల్ చివరి ఓవర్

హైదరాబాద్ పిచ్‌లో పేసర్లు భారీగా పరుగులిచ్చుకుంటున్న తరుణంలో.. హర్షల్ పటేల్ చివరి ఓవర్ బౌలింగ్ వేయడానికి బరిలోకి దిగడంతో మినిమం 15పరుగులు వస్తాయేమోననే డౌట్ నెలకొంది. అయితే అందరి అంచనాలు తలకిందులు చేస్తూ హర్షల్ పటేల్ చివరి ఓవర్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. అతను తొలి బంతికి డేవిడ్‌కు సిక్సర్ సమర్పించుకున్నా.. తరువాత అయిదు బంతుల్లో 1వికెట్ సహా 1రన్ మాత్రమే ఇచ్చాడు. దీంతో ఆ ఓవర్లో కేవలం 7పరుగులు మాత్రమే వచ్చాయి. ఫలితంగా ఆసీస్ 186కు కట్టడి అయింది. అయిదారు పరుగులు హర్షల్ అదనంగా ఇచ్చి ఉంటే మ్యాచ్ పరిస్థితి తలకిందులయ్యేదేమో.

 మిడిల్ ఓవర్లలో యుజ్వేంద్ర చాహల్ ఢిఫెన్సివ్ బౌలింగ్

మిడిల్ ఓవర్లలో యుజ్వేంద్ర చాహల్ ఢిఫెన్సివ్ బౌలింగ్

ఆసీస్ స్కోరు 5ఓవర్లకు 62పరుగులు. కెమరూన్ గ్రీన్ అప్పుడే ఔటయ్యాడు. కేవలం 2వికెట్లు కోల్పోయిన ఆసీస్.. బ్యాటింగ్ లైనప్‌లో ఇంకా అయిదుగురు బ్యాటర్లు, అలాగే కమిన్స్ కూడా బ్యాటరే మొత్తం ఆరుగురు ప్లేయర్లున్నారు. ఆసీస్ ఇంటెంట్ చూస్తుంటే 200కు పైచిలుకు పోవడం ఖాయమనిపించింది. అయితే మిడిల్ ఓవర్లలో యుజ్వేంద్ర చాహల్ చాలా పొదుపుగా బౌలింగ్ చేసి ఆసీస్ లయ తప్పేలా చేశాడు. అతను తన 4ఓవర్లలో కేవలం 22 పరుగులు ఇచ్చి.. స్టీవ్ స్మిత్ (9)ను స్టంపౌట్ చేశాడు. అలాగే అంతకుముందు 7వ ఓవర్లో మ్యాక్సీ సైతం చాహల్ బౌలింగ్లో రనౌట్ అవుతాడు. దీంతో స్కోరు బోర్డుకు కళ్లెం పడింది. చాహల్ గేట్లెత్తేసి ఉంటే.. స్కోరు ఈజీగా 200 దాటి ఉండేది.

 అవార్డులు

అవార్డులు

1 ఏసీసీ ట్రస్టెడ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ : కామెరూన్ గ్రేన్ (లక్ష రూపాయలు)

2. హ్యుందాయ్ ఎనర్జిటిక్ అవార్డ్ - మాథ్యూ వేడ్ (లక్ష రూపాయలు)

3. మాస్టర్ కార్డ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ - సూర్యకుమార్ యాదవ్ (లక్ష రూపాయలు)

4.హ్యుందాయ్ ఎనర్జిటిక్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ - విరాట్ కోహ్లీ (2.50లక్షల రూపాయలు)

5. మాస్టర్ కార్డ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ - అక్షర్ పటేల్ (2.50లక్షల రూపాయలు)

Story first published: Monday, September 26, 2022, 7:38 [IST]
Other articles published on Sep 26, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X