న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రికార్డులు బద్దలుకొట్టేందుకు కోహ్లీకి ఉన్న చివరి అవకాశం ఇదే..

మెల్‌బోర్న్‌: ఇప్పటికే సమంగా సాగుతోన్న ఆస్ట్రేలియాతో సిరీస్ 1-1ని కోహ్లీసేన బ్రేక్ చేయాల్సింది. సిరీస్ విజయం అటుంచితే ఈ ఏడాది ఇరు జట్లకు ఇదే ఆఖరి టెస్టు మ్యాచ్. అంతేకాకుండా ఆఖరి టెస్టులో ఆత్మవిశ్వాసంతో ప్రత్యర్థిని ఎదుర్కొంటుంది. దాంతో పాటు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యక్తిగత రికార్డులు కొల్లగొట్టేందుకు సైతం ఇదే ఆఖరి అవకాశం. ఈ ఏడాదిని అద్భుతంగా ముగించడానికి కోహ్లీకి ఉన్న సువర్ణావకాశం ఈ బాక్సింగ్ డే టెస్ట్. ప్రస్తుతం కోహ్లీ ముందున్న రికార్డులు ఊరిస్తుండగా.. కెప్టెన్‌గానూ, బ్యాట్స్‌మన్‌గానూ సెంచరీలు బాదుతాడా.. జట్టును గెలిపిస్తాడా అంటూ సగటు అభిమానిలో ఉత్కంఠ పెరుగుతుంది.

 ఒక్క మాచ్ గెలిస్తే కెప్టెన్‌గా గంగూలీ సరసన

ఒక్క మాచ్ గెలిస్తే కెప్టెన్‌గా గంగూలీ సరసన

అడిలైడ్ వేదికగా గెలిచిన తొలి టెస్టుతో పాటు.. ఇంకొక్క టెస్టులో భారత్ విజయం సాధిస్తే ఆసియా వెలుపల జట్టును గెలిపించిన అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా గంగూలీ సరసన కోహ్లీ నిలుస్తాడు. ప్రస్తుతం కోహ్లీ కెప్టెన్సీలోని టీమిండియా ఆసియా బయట 5 విజయాలు అందుకుంది. 6 విజయాలతో అగ్రస్థానంలో ఉన్నాడు.

ఆసీస్ గడ్డపై మరో సెంచరీ చేస్తే..

ఆసీస్ గడ్డపై మరో సెంచరీ చేస్తే..

మెల్‌బౌర్న్‌ క్రికెట్ గ్రౌండ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తే ఆస్ట్రేలియాలో ఇది అతనికి ఐదో సెంచరీ అవుతుంది. దీంతో ఆస్ట్రేలియా అత్యధిక సెంచరీలు సాధించిన పర్యటక కెప్టెన్‌గా కోహ్లీ రికార్డుకెక్కుతాడు. ప్రస్తుతం క్లైవ్ లాయిడ్ సరసన కోహ్లీ ఉన్నాడు.

ఒక ఏడాదిలో అధిక సెంచరీలు సాధించాలంటే..

ఒక ఏడాదిలో అధిక సెంచరీలు సాధించాలంటే..

మెల్‌బోర్న్‌లో సెంచరీ సాధిస్తే అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో వెస్టిండీస్ దిగ్గజం గ్యారీ సోబర్స్ సరసన కోహ్లీ నిలుస్తాడు. సచిన్ టెండూల్కర్ ప్రపంచ రికార్డును సమం చేసినవాడవుతాడు. సచిన్ ఒక ఏడాదిలో (1998లో) 12 సెంచరీలు సాధించి ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ ఏడాది కోహ్లీ ఖాతాలో ఐదు టెస్టు సెంచరీలు, ఆరు వన్డే సెంచరీలు ఉన్నాయి.

 మరో టెస్టులో సెంచరీతో

మరో టెస్టులో సెంచరీతో

ఆస్ట్రేలియాపై సునీల్ గవాస్కర్ 8 టెస్టు సెంచరీలు బాదాడు. సచిన్(11) తర్వాత ఆసీస్‌పై అత్యధిక సెంచరీలు సాధించిన భారత బ్యాట్స్‌మన్ గవాస్కర్. ఈ టెస్టులో సెంచరీ చేస్తే గవాస్కర్ రికార్డును కోహ్లీ సమం చేయొచ్చు.

 సచిన్.. పాంటింగ్.. తర్వాత కోహ్లీ?

సచిన్.. పాంటింగ్.. తర్వాత కోహ్లీ?

ఇంకొక్క సెంచరీ సాధిస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన మూడో బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ నిలుస్తాడు. ప్రస్తుతం 63 సెంచరీలతో కుమార సంగక్కర సరసన కోహ్లీ ఉన్నాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ 100 సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు. రెండో స్థానంలో రికీ పాంటింగ్ (71) ఉన్నాడు.

అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్‌గా

అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్‌గా

అన్ని ఫార్మాట్లలో కలుపుకొని ఒక ఏడాదిలో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు సాధించడానికి కోహ్లీ ఇంకా 134 పరుగులు వెనకబడి ఉన్నాడు. 2018లో ఇప్పటి వరకు కోహ్లీ 2700 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఈ రికార్డు రికీ పాంటింగ్ పేరిట 2005లో (2833)గా ఉంది.

 విదేశీ గడ్డపై అధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా

విదేశీ గడ్డపై అధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా

ఒక ఏడాదిలో విదేశీ గడ్డపై టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన భారత బ్యాట్స్‌మన్‌గా దిగ్గజం రాహుల్ ద్రవిడ్ రికార్డును కూడా కోహ్లీ బ్రేక్ చేసే అవకాశం ఉంది. 2002లో రాహుల్ ద్రవిడ్ విదేశీ గడ్డపై ఆడిన టెస్టుల్లో 1137 పరుగులు సాధించాడు. ఈ ఏడాది కోహ్లీ ఖాతాలో 1112 పరుగులున్నాయి. మరో 36 పరుగులు సాధిస్తే ద్రవిడ్ రికార్డు బద్దలైపోతుంది.

 టెస్టు కెప్టెన్‌గా విదేశీ గడ్డపై..

టెస్టు కెప్టెన్‌గా విదేశీ గడ్డపై..

విదేశీ గడ్డపై ఒక ఏడాది కాలంలో అత్యధిక పరుగులు చేసిన టెస్టు కెప్టెన్‌గానూ గ్రేమ్ స్మిత్ రికార్డును బద్దలుకొట్టే అవకాశం కోహ్లీ ముందుంది. స్మిత్ 2008లో 20 ఇన్నింగ్స్‌ల్లో 1212 పరుగులు చేశాడు. దీనికి ప్రస్తుతం కోహ్లీ 109 పరుగుల దూరంలో ఉన్నాడు. ఈ రికార్డును బద్దలుకొడితే విదేశాల్లో ఒక ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గానూ కోహ్లీ నిలుస్తాడు.

ఆసీస్ గడ్డపై పర్యాటక కెప్టెన్‌గా

ఆసీస్ గడ్డపై పర్యాటక కెప్టెన్‌గా

విరాట్ కోహ్లీ మరో 76 పరుగులు సాధిస్తే ఆస్ట్రేలియా గడ్డపై అత్యధిక పరుగులు సాధించిన రెండో పర్యటక కెప్టెన్‌గా రికార్డుకెక్కుతాడు. ఇప్పటి వరకు ఆస్ట్రేలియాలో కోహ్లీ 673 పరుగులు సాధించాడు. ఈ జాబితాలో క్లైవ్ లాయిడ్ (1301), గ్రేమ్ స్మిత్ (748), ఆర్కీ మెక్‌లారెన్ (709).

Story first published: Wednesday, December 26, 2018, 18:27 [IST]
Other articles published on Dec 26, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X