
తల తిరిగింది:
తాజాగా స్టీవ్ స్మిత్ మాట్లాడుతూ... 'రెండో వన్డేకు ముందు నా ఆరోగ్యం బాలేదు. తల తిరిగింది. తిన్నగా కూడా కూర్చోలేకపోయా. బరిలో దిగుతానా అనే అనుమానం కలిగింది. చాలా సమయం అటు ఇటు తిరిగినా పరిస్థితిలో మార్పు రాలేదు. చెవి లోపలి పొరల్లో ఏర్పడిన ఇబ్బంది వల్ల అలా జరిగింది. ఈ స్థితిలో జట్టు వైద్యుడు లీ గోల్డింగ్.. కొన్ని వ్యాయామాలు చేయించాడు. చెవి నుంచి చిన్న రాళ్లు బయటకు తీయడంతో.. కాసేపటికి మళ్లీ మామూలు స్థితికి వచ్చా. అలాంటి పరిస్థితి నుంచి మ్యాచ్ ఆడి సిరీస్‌ను గెలిపించే సెంచరీ కొట్టడం చాలా ఆనందంగా అనిపించింది' అని అన్నాడు.

అలా చేస్తేనే మ్యాచ్‌లో పైచేయి సాధించగలం
'ఎదుర్కొన్న తొలి బంతి నుంచే మంచి టచ్‌లో ఉన్నట్లు అనిపించింది. మా ఓపెనర్లు ఆరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్ ఇచ్చిన ఘనమైన ఆరంభం వల్లే నేను, గ్లెన్ మ్యాక్స్‌వెల్ గొప్పగా ఆడాం. పరిస్థితులకు తగ్గట్లుగా ఆడటమే మా ముందు ఉన్న పని. భారత్‌కు వ్యతిరేకంగా ఆడినప్పుడు మాత్రం కచ్చితంగా భారీ స్కోర్లు సాధించాలి. అలా చేస్తేనే మ్యాచ్‌లో పైచేయి సాధించగలం. అదృష్టవశాత్తు గత రెండు మ్యాచ్‌ల్లోనూ మేం ఇలానే చేశాం' అని స్టీవ్ స్మిత్ తెలిపాడు. తొలి వన్డేలో 66 బంతుల్లో 105 పరుగులు చేసిన స్మిత్.. రెండో వన్డేలో 64 బంతుల్లో 104 పరుగులు చేశాడు. అంతేకాదు రెండో వన్డేలో ఫీల్డింగ్‌లోనూ రాణించాడు. శ్రేయస్ అయ్యర్‌ను ఓ మెరుపు క్యాచ్‌తో పెవిలియన్ చేర్చాడు.

అత్యంత వేగంగా సెంచరీ
62 బంతుల్లో సెంచరీ చేసిన స్టీవ్ స్మిత్ ఓ అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఆసీస్ తరపున వన్డేల్లో అత్యంత వేగంగా సెంచరీ బాదిన మూడో బ్యాట్స్‌మన్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. ఈ జాబితాలో 51 బంతుల్లోనే శతకం బాదిన గ్లెన్ మాక్స్‌వెల్ అగ్ర స్థానంలో ఉన్నాడు. ఓవరాల్‌గా వన్డేల్లో స్టీవ్ స్మిత్ ఇప్పటివరకు 11 సెంచరీలు చేయగా.. అందులో టీమిండియాపైనే 5 సాధించాడు. భారత్‌పై 5 కంటే ఎక్కువ సెంచరీలు సాధించిన ఆసీస్ ఆటగాళ్లలో రికీ పాంటింగ్ తర్వాతి స్థానంలో నిలిచాడు. పాంటింగ్ టీమిండియాపై ఆరు సెంచరీలు సాధించి మొదటి స్థానంలో ఉన్నాడు.
'స్టీవ్ స్మిత్ బలహీనత భారత బౌలర్లకి తెలియదా?.. ఆ బంతులను ఎందుకు వేయట్లేదు'


Click it and Unblock the Notifications












