న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs Australia: రోహిత్‌కు విశ్రాంతి: భారత్‌ జట్టులో కేఎల్ రాహుల్, రహానే?

Ind Vs Aus : Rohit Sharma Likely To Be Rested For Part Of ODI Series Vs Australia | Oneindia Telugu
India vs Australia: Return for KL Rahul, Ajinkya Rahane and rest for Rohit Sharma ahead of ICC World Cup?

హైదరాబాద్: ఫిబ్రవరి 24 నుంచి ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. భారత పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా జట్టు రెండు టీ20లు, ఐదు వన్డేల సిరిస్ ఆడనుంది. భారత్ వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న ఈ సుదీర్ఘ సిరీస్‌లో ఓపెనర్ రోహిత్ శర్మకి విశ్రాంతినిచ్చే ఆలోచనలో సెలక్టర్లు ఉన్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

మార్చి 23 నుంచి ఐపీఎల్ 2019 సీజన్

మార్చి 23 నుంచి ఐపీఎల్ 2019 సీజన్

ఆస్ట్రేలియాతో సుదీర్ఘ సిరిస్ ముగిసిన తర్వాత మార్చి 23 నుంచి ఐపీఎల్ 2019 సీజన్ ఆరంభం కానుంది. ఐపీఎల్ 2019 సీజన్ ముగిసిన రెండు వారాల వ్యవధిలోనే మే 30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సీనియర్ క్రికెటర్ల పని ఒత్తిడిని పరిగణనలోకి తీసుకున్న సెలక్టర్లు రొటేషన్ పద్ధతిలో వారికి తగినంత విశ్రాంతినివ్వాలని యోచిస్తున్నారు.

న్యూజిలాండ్ పర్యటనకు కోహ్లీకి విశ్రాంతి

న్యూజిలాండ్ పర్యటనకు కోహ్లీకి విశ్రాంతి

ఇందులో భాగంగా ఇటీవల న్యూజిలాండ్ పర్యటనకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రాలకు విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు.. తాజాగా రోహిత్ శర్మ, ఫాస్ట్ బౌలర్లు భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీలకి విశ్రాంతినివ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాతో జరిగే రెండు టీ20లతో పాటు ఐదు వన్డేల సిరిస్‌కు ఓపెనర్ రోహిత్ శర్మకి విశ్రాంతినిస్తే అతని స్థానంలో జట్టులోకి కేఎల్ రాహుల్‌ని తీసుకునే అవకాశం ఉంది.

కేఎల్ రాహుల్‌తో పాటు రహానే

కేఎల్ రాహుల్‌తో పాటు రహానే

కేఎల్ రాహుల్‌తో పాటు లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన టీమిండియా టెస్టు వైస్ కెప్టెన్ అజింక్యె రహానేను మూడో ఓపెనర్‌గా పరీక్షించే అవకాశాలు ఉన్నాయి. ఇక, మిడిలార్డర్‌లో రిషబ్ పంత్, విజయ్ శంకర్‌లకి మరోసారి అవకాశం ఇచ్చి.. సిరీస్‌లో ప్రదర్శన ఆధారంగా వరల్డ్‌కప్ జట్టు ఎంపికపై స్పష్టత తెచ్చుకోవాలని సెలక్టర్లు భావిస్తున్నారు.

చాహల్, కుల్దీప్‌లకు కూడా విశ్రాంతి

చాహల్, కుల్దీప్‌లకు కూడా విశ్రాంతి

రిషబ్ పంత్, విజయ్ శంకర్‌లతో పాటు హార్దిక్ పాండ్యా, అంబటి రాయుడు, దినేశ్ కార్తీక్‌‌లను కూడా జట్టులో కొనసాగించనున్నారు. మరోవైపు గతేడాది కాలంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో నిలకడగా రాణిస్తోన్న మణికట్టు స్పిన్నర్లు యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్‌లకి కూడా విశ్రాంతినివ్వాలనే సెలక్టర్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌లో ఆస్ట్రేలియా పర్యటనకు జట్టు ఎంపికపై ఎలా ఉండబోతుందనే ఆసక్తి అందరిలో నెలకొంది.

Story first published: Tuesday, February 12, 2019, 17:26 [IST]
Other articles published on Feb 12, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X