న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పెర్త్‌లో రెండో టెస్టు: బుమ్రాకే తొలి వికెట్, మార్కస్ హాఫ్ సెంచరీ (వీడియో)

India vs Australia Live Score, 2nd Test Day 1: Marcus Harris’ maiden Test fifty

హైదరాబాద్: పెర్త్ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఓపెనర్ మార్కస్ హారిస్ హాఫ్ సెంచరీ సాధించాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టులో ఓపెనర్లు ఆరోన్ ఫించ్, మార్కస్ హారిస్ ఆచితూచి ఆడుతున్నారు. ఈ క్రమంలో మార్కస్ 90 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీని సాధించాడు.

వికెట్‌ కోసం బౌలర్ల విశ్వప్రయత్నాలు: లంచ్ విరామానికి ఆసీస్ 66/0వికెట్‌ కోసం బౌలర్ల విశ్వప్రయత్నాలు: లంచ్ విరామానికి ఆసీస్ 66/0

టెస్టుల్లో మార్కస్ హారిస్‌కు ఇది మొట్టమొదటి హాఫ్ సెంచరీ కావడం విశేషం. పిచ్‌పై పచ్చిక ఉండటంతో పేస్, బౌన్స్ అతిగా సహకరిస్తుందని వార్తలు వచ్చినప్పటికీ పెర్త్ పిచ్ బౌలర్లకు పెద్దగా సహకారం లభించలేదు. దీంతో వికెట్ కోసం భారత బౌలర్లు చెమటోడ్చారు.

1
43624

ఆరోన్ ఫించ్ హాఫ్ సెంచరీ

మరోవైపు మార్కస్ హాఫ్ సెంచరీ చేసిన కొద్ది సేపటికే మరో ఓపెనర్ ఆరోన్ ఫించ్ (50; 103 బంతుల్లో; 6 ఫోర్లు) కూడా హాఫ్ సెంచరీని సాధించాడు. టెస్టుల్లో ఆస్ట్రేలియా గడ్డపై ఆరోన్ ఫించ్‌కు ఇదే మొదటి హాఫ్ సెంచరీ కావడం విశేషం. అయితే, ఫించ్ హాఫ్ సెంచరీ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు.

బుమ్రాకే తొలి వికెట్

బుమ్రాకే తొలి వికెట్

జస్ప్రీత్ బుమ్రా వేసిన ఇన్నింగ్స్ 36వ ఓవర్ రెండో బంతికి ఆరోన్ ఫించ్ (50) పరుగుల వద్ద ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో జట్టు స్కోరు 112 పరుగుల వద్ద ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 36 ఓవర్లకు గాను ఆస్ట్రేలియా వికెట్ నష్టానికి 112 పరుగులు చేసింది.

భారత్ తరఫున నలుగురు పేస్ బౌలర్లు

క్రీజులో మార్కస్ హారిస్(55), ఉస్మాన్ ఖవాజా పరుగులేమీ చేయకుండా ఉన్నారు. అంతకముందు ఓపెనర్లు జోడీని విడదీయడానికి టీమిండియా బౌలర్లు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. భారత్ తరఫున నలుగురు పేస్ బౌలర్లు శ్రమించినా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు.

రెండు మార్పులతో బరిలోకి భారత్

ఈ మ్యాచ్‌లో పర్యాటక టీమిండియా జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగింది. గాయపడిన అశ్విన్, రోహిత్ స్థానాల్లో ఉమేష్ యాదవ్, హనుమ విహారి తుది జట్టులోకి వచ్చారు. పెర్త్ పిచ్ పేస్, బౌన్స్‌కు అనుకూలించేది కావడంతో స్పిన్నర్ లేకుండా మొత్తం నలుగురు పేస్ బౌలర్లతోనే భారత్ బరిలోకి దిగింది.

Story first published: Friday, December 14, 2018, 11:32 [IST]
Other articles published on Dec 14, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X