న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తొలి భారత క్రికెటర్‌గా రికార్డు సొంతం చేసుకున్న బుమ్రా

India vs Australia: Jasprit Bumrah breaks 39-year-old Indian record at the MCG

మెల్‌బౌర్న్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు విజృంభించారు. ఆసీస్ పతనాన్ని శాసించారు. మూడో టెస్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీసేనకు శుభారంభమే దక్కింది. మొదటి రెండ్రోజులు తీవ్రంగా శ్రమించి పరుగులు సాధించిన పూజారా.. పిచ్ స్వభావం క్రమంగా మారుతుందని ఆసీస్ పరుగులు చేయడం అంత సులభమేమి కాదంటూ వ్యాఖ్యానించాడు. అది నిజమైనట్లుగా కనిపిస్తోంది. ఆసీస్ కేవలం 151 పరుగులకే పరిమితమై ఇన్నింగ్స్ పూర్తి చేసుకుంది.

5 రోజుల ఫార్మాట్‌లోకి అరంగేట్రం

5 రోజుల ఫార్మాట్‌లోకి అరంగేట్రం

ఈ ఇన్నింగ్స్‌లో భారత ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా టెస్టుల్లో అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో మెల్‌బౌర్న్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో 3 వికెట్లు పడగొట్టిన బుమ్రా.. టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఏడాదిలోనే అత్యధిక వికెట్లు పడగొట్టిన తొలి భారత ఫాస్ట్ బౌలర్‌గా రికార్డును సొంతం చేసుకున్నాడు. 2018 జనవరి 5న దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌తో 5 రోజుల ఫార్మాట్‌లోకి అరంగేట్రం చేశాడు జస్ప్రీత్ బుమ్రా.

భారీ ఆధిక్యంలో భారత్.. 151కే కుప్పకూలిన ఆసీస్

9 టెస్టులాడి ఏకంగా 42 వికెట్లు

9 టెస్టులాడి ఏకంగా 42 వికెట్లు

బుమ్రా కెరీర్‌లో ఇప్పటి వరకు 9 టెస్టులాడి ఏకంగా 42 వికెట్లు పడగొట్టాడు. సుదీర్ఘ భారత టెస్టు క్రికెట్ చరిత్రలో అరంగేట్రం చేసిన ఏడాదే అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాని ఓసారి పరిశీలిస్తే.. 1979లో దిలీప్ దోషి 40 వికెట్లు కొల్లగొట్టిన రికార్డును బుమ్రా తాజాగా తుడిచిపెట్టేశాడు. ఇక మూడో స్థానంలో 1996వ సంవత్సరంలో వెంకటేశ్ ప్రసాద్ 37 వికెట్లతో ఉండగా.. 1996లో నరేంద్ర హిర్వాణీ 36 వికెట్లు తీయగలిగాడు. శ్రీశాంత్ (2006) 35 వికెట్లతో టాప్-5లో కొనసాగుతున్నారు.

తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 292 ఆధిక్యం

తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 292 ఆధిక్యం

మెల్‌బౌర్న్ వేదికగా గురువారం మ్యాచ్‌లో బుమ్రా ఏ దశలోనూ ఆతిథ్య జట్టు బ్యాట్స్‌మెన్‌ను కోలుకోనివ్వలేదు. ఈ ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ బ్యాట్స్‌మెన్లు సాధించిన పరుగుల్లో అత్యధికంగా 22 పరుగులకు మించి చేయలేదంటే టీమిండియా బౌలర్లు ఏస్థాయిలో విరుచుకు పడ్డారో అర్థమవుతోంది. ఈ ఇన్నింగ్స్‌లో బుమ్రా ఆరు వికెట్లు తీసి తన కెరీర్‌ బెస్ట్‌ నమోదు చేశాడు. జడేజా రెండు వికెట్లు, ఇషాంత్‌, షమీ చెరొక వికెట్‌ తీశారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 292 పరుగుల ఆధిక్యం లభించింది.

1
43625
Story first published: Friday, December 28, 2018, 11:58 [IST]
Other articles published on Dec 28, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X