భారీ ఆధిక్యంలో భారత్.. 151కే కుప్పకూలిన ఆసీస్


మెల్‌బౌర్న్: మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో భారత్ జట్టు పట్టు బిగిచింది. ఆటలో మూడో రోజైన శుక్రవారం 8/0తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆస్ట్రేలియా జట్టు.. జస్‌ప్రీత్ బుమ్రా (6/33) ధాటికి 151 పరుగులకే కుప్పకూలిపోయింది. ఆ జట్టులో హారిస్ (22: 35 బంతుల్లో 2ఫోర్లు), కెప్టెన్ టిమ్‌పైన్ (22: 85 బంతుల్లో 1ఫోర్) టాప్ స్కోరర్స్‌గా నిలవగా.. భారత బౌలర్లలో బుమ్రాతో పాటు జడేజా (2/45), ఇషాంత్ (1/41), మహ్మద్ షమీ (1/27) మెరిశారు. గురువారం చతేశ్వర్ పుజారా (106: 319 బంతుల్లో 10ఫోర్లతో) సెంచరీ బాదడంతో భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్‌ని 443/7తో డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే.
రెండో ఇన్నింగ్స్ ఆరంభమైన కాసేపటికే వికెట్
292 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించిన కోహ్లీసేన ఆస్ట్రేలియాపై విజయకాంక్షతో బరిలోకి దిగింది. రెండో ఇన్నింగ్స్ మొదలైన కాసేపటికే 13 ఓవర్లు పూర్తయ్యేసరికి 28 పరుగులు చేసి రెండు వికెట్లను నష్టపోయింది. హనుమ విహారీ (13), చతేశ్వర్ పూజారా(0)కే పెవిలియన్ చేరారు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీకి మించిన స్కోరుతో రాణించిన పూజారా కేవలం సున్నా పరుగులకే అవుటవడం గమనార్హం. క్రీజులో మయాంక్ అగర్వాల్(15), విరాట్ కోహ్లీ(10)తో ఉన్నారు.
జడేజా కళ్లెం వేయగా.. హారిస్ బోల్తా
శుక్రవారం తొలి సెషన్ ఆరంభంలోనే భారత్‌కి ఓపెనర్ ఆరోన్ ఫించ్ (8: 36 బంతుల్లో ఒక ఫోర్) రూపంలో వికెట్ లభించింది. జట్టు స్కోరు 24 వద్ద ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో బంతిని హిట్ చేయబోయిన అరోన్ ఫించ్.. ఫీల్డర్ మయాంక్ అగర్వాల్ చేతికి చిక్కాడు. అయితే.. మరో ఓపెనర్ హారిస్ (22: 35 బంతుల్లో 2ఫోర్ల)తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించిన ఉస్మాన్ ఖవాజా (21: 32 బంతుల్లో 3ఫోర్ల) సిరీస్‌లో తొలిసారి దూకుడుగా ఆడాడు. కానీ.. అతని దూకుడుకి జడేజా కళ్లెం వేయగా.. హారిస్ బుమ్రా బోల్తా కొట్టించాడు.
బుమ్రా చేతికి చిక్కిన 6 వికెట్లు
దీంతో.. 53/3తో ఆస్ట్రేలియా ఇబ్బందుల్లో పడిపోయింది. ఈ దశలో షాన్ మార్ష్ (19: 61 బంతుల్లో 1ఫోర్) క్రీజులో పాతుకుపోయి వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేయాలని ప్రయత్నించినా.. లంచ్ విరామానికి ముందే అతడ్ని బుమ్రా పెవిలియన్ బాట పట్టించాడు. బుమ్రా బంతిని అంచనా వేయడంలో విఫలమైన మార్ష్ వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఆసీస్ బ్యాట్స్‌మెన్లు సాధించిన పరుగుల్లో అత్యధిక స్కోర్ 22 అంటే టీమిండియా బౌలర్లు ఏస్థాయిలో విరుచుకుపడ్డారో అర్థమవుతోంది. ఈ ఇన్నింగ్స్‌లో బుమ్రా ఆరు వికెట్లు తీసి తన కెరీర్ బెస్ట్ నమోదు చేశాడు. జడేజా రెండు వికెట్లు, ఇషాంత్, షమీ చెరొక వికెట్ తీశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications