న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇండియా vs ఆస్ట్రేలియా: పుజారా వ్యాఖ్యలకు కౌంటరిచ్చిన డీన్ జోన్స్

 India vs Australia: Dean Jones dismisses Cheteshwar Pujara’s comments on India’s bowling

హైదరాబాద్: మునుపటి పోలిస్తే... ప్రస్తుతం కోహ్లీ సేనలోని భారత పేస్ బౌలింగ్ దళం కాస్తంత పటిష్టంగానే ఉంది. ఈ ఏడాది జనవరిలో ముగిసిన దక్షిణాఫ్రికా పర్యటనతో పాటు ఇటీవలే ముగిసిన ఇంగ్లాండ్‌ పర్యటనల్లో ఇదే నిరూపితమైంది. అయితే, క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో మాత్రం భారత బౌలర్లు అనుకున్న స్థాయిలో రాణించలేదు.

<strong>టీమిండియా ఫోటోషూట్: కొత్త లుక్‌లో కోహ్లీ, రోహిత్ శర్మ... ఫోటోలు వైరల్</strong>టీమిండియా ఫోటోషూట్: కొత్త లుక్‌లో కోహ్లీ, రోహిత్ శర్మ... ఫోటోలు వైరల్

క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టు ముందు భారత బౌలర్లు తేలిపోయారు. ఒక్క మహమ్మద్ షమీ తప్ప మిగతా వారంతా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. దీంతో ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 500 పరుగులు చేసింది. ఆసీస్ ఎలెవన్ జట్టులో హ్యారీ నీల్సన్‌ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు.

మరోవైపు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ బ్యాట్స్‌మెన్ కూడా రాణించడంతో ఈ వార్మప్ మ్యాచ్ డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య డిసెంబర్ 6 నుంచి అడిలైడ్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో తొలి టెస్టుకు ముందు పుజారా మీడియాతో మాట్లాడాడు.

వార్మప్ మ్యాచ్‌లో 500 పరుగులు ఇవ్వడంపై

వార్మప్ మ్యాచ్‌లో 500 పరుగులు ఇవ్వడంపై

"వార్మప్ మ్యాచ్‌లో 500 పరుగులు ఇవ్వడంలో విశేషమేమీ లేదు. దాని గురించి మేం బాధపడడం లేదు. మా బౌలర్లకు ఏం చేయాలో తెలుసు. ఆస్ట్రేలియాలో ఏ లైన్‌ అండ్‌ లెంగ్త్‌లో బంతులు విసరాలో అనుభవం ఉంది. మా బౌలింగ్‌ విభాగం పటిష్ఠంగా, ఆత్మవిశ్వాసంతో ఉంది" అని పుజారా చెప్పుకొచ్చాడు.

ట్విట్టర్‌లో డీన్ జోన్స్

అయితే పుజారా వ్యాఖ్యలతో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు డీన్‌ జోన్స్‌ కాస్త వ్యంగ్యంగా మాట్లాడాడు. ఈ మేరకు ట్విట్టర్‌లో "అవును, ఆస్ట్రేలియా కుర్రాళ్లు 500 పరుగులు చేయడంలో మాత్రం అర్థముంది" అని ట్వీట్‌ చేశాడు.

ఆసీస్ పర్యటనలో అశ్విన్ కీలకం

ఆసీస్ పర్యటనలో అశ్విన్ కీలకం

ఇదిలా ఉంటే, ప్రస్తుత ఆస్ట్రేలియా పర్యటనలో వెటరన్ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ కీలకంగా మారుతాడని ఇరు దేశాలకు చెందిన మాజీ క్రికెటర్లు భావిస్తున్నారు. అశ్విన్ ఆస్ట్రేలియాలో ఆడిన గత ఆరు టెస్టుల్లో 54.71 యావరేజితో 21వికెట్లు తీశాడు. ఇప్పటివరకు అశ్విన్ తన కేరీర్‌లో 25.44 యావరేజితో 336 వికెట్లు తీశాడు.

ఎన్ని మార్పులు చోటు చేసుకున్నాయి

అశ్విన్ గురించి పుజారా మాట్లాడుతూ "ఈ మధ్య కాలంలో అశ్విన్‌ బౌలింగ్ గమనిస్తే, ఎన్ని మార్పులు చోటు చేసుకున్నాయో అర్థం అవుతుంది. వాటి గురించి చెప్పలేను. కానీ, ఈ పర్యటనలో అశ్విన్ తన ప్రదర్శనను తప్పక మెరుగు పరచుకుంటాడు. మాకు కావాల్సినంత ప్రాక్టీస్‌ లభించింది. ఈ రోజు విశ్రాంతి తీసుకుని, మిగిలిన రెండు రోజులు ప్రాక్టీస్ చేస్తాం" అని అన్నాడు.

Story first published: Monday, December 3, 2018, 18:33 [IST]
Other articles published on Dec 3, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X