న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇండియా vs ఆస్ట్రేలియా, 5th ODI: తుది జట్టులో చోటు వీరికే!

India Vs Australia : 5th ODI Match Preview,Last Chance For Pant & Rahul | Oneindia Telugu
India vs Australia, 5th ODI: Heres the probable XI of India

హైదరాబాద్: ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆఖరి వన్డే బుధవారం జరగనుంది. ఈ సిరిస్‌లో ఇరు జట్లు చెరో రెండు మ్యాచ్‌లు గెలవడంతో సిరిస్ 2-2తో సమం అయింది. వరల్డ్‌కప్‌కు ముందు యువ ఆటగాళ్లను పరీక్షించాలని భావించి జట్టు మేనేజ్‌మెంట్ ప్రయోగాలు చేసింది. ఇందులో భాగంగా నాలుగో వన్డేలో వికెట్ కీపర్ ధోనీకి విశ్రాంతినిచ్చి అనూహ్యంగా రిషబ్‌ పంత్‌కు చోటిచ్చారు. అయితే, నాలుగో వన్డేలో బ్యాట్‌తో మెరిసిన పంత్... కీపింగ్‌లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు.

<strong>భారత్ vs ఆసీస్: కోట్లాలో గత రికార్డులు ఎలా ఉన్నాయో తెలుసా?</strong>భారత్ vs ఆసీస్: కోట్లాలో గత రికార్డులు ఎలా ఉన్నాయో తెలుసా?

మ్యాచ్‌ను ఆస్ట్రేలియా వైపు లాగేసుకున్న ఆస్టన్‌ టర్నర్‌ను స్టంపింగ్‌ చేసే విషయంలో భారత యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్ చేసిన పొరపాటు కూడా భారత్ ఓటమికి ప్రధాన కారణం. ఆస్టన్‌ టర్నర్‌ను రెండు సార్లు స్టంపింగ్‌ చేసే అవకాశం వచ్చినా రిషభ్‌ దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ధోనీలా రనౌట్ చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. కోహ్లీ సైతం పంత్ ప్రదర్శనపై తీవ్ర అసహనానికి గురైన సంగతి తెలిసిందే.

దీంతో ఆఖరి వన్డేలో భారత జట్టులో పలు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. నాలుగో వన్డేలో ఆసీస్‌ విజయం సాధించడంతో సిరీస్‌ను 2-2తో సమం చేసింది. దీంతో ఆఖరి మ్యాచ్ ఇరు జట్లకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఫిరోజ్‌ షా కోట్ల మైదానంలో జరిగే ఫైనల్‌ మ్యాచ్‌ కోసం ఇరు జట్లు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నాయి. బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకి ఐదో వన్డే జరగనున్న సంగతి తెలిసిందే.

ఐదో వన్డే తుదిజట్టులో చోటు వీరికి దక్కనుందా?:

శిఖర్‌ధావన్‌

శిఖర్‌ధావన్‌

గత ఆరు నెలలుగా పేలవమైన ఫామ్‌తో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ధావన్‌ ఎట్టకేలకు నాలుగో వన్డేతో ఫామ్ లోకి వచ్చాడు. నాలుగో వన్డేలో సెంచరీతో పాటు కెరీర్‌లోనే అత్యధిక స్కోరు నమోదు చేశాడు.

రోహిత్‌ శర్మ

రోహిత్‌ శర్మ

ఈ సిరిస్‌లో రోహిత్‌ శర్మ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. నాలుగో వన్డేలో మాత్రం ఫరవాలేదనిపించాడు. నాలుగో వన్డేలో అతడి ఇన్నింగ్స్‌ చూస్తే రోహిత్‌ గాడిలో పడినట్లు కనిపిస్తోంది.

కేఎల్‌ రాహుల్‌

కేఎల్‌ రాహుల్‌

నాలుగో వన్డేలో అంబటి రాయుడు స్థానంలో అనూహ్యంగా తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే, ఆశించిన స్థాయిలో మాత్రం రాణించలేదు. ఐదో వన్డేలోనూ కేఎ్ రాహుల్ చోటు దక్కించుకునే అవకాశం ఉంది. ప్రపంచకప్‌ ముందు పరీక్షించాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది.

విరాట్‌కోహ్లీ

విరాట్‌కోహ్లీ

ఇప్పటికే ఈ సిరీస్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ వరసుగా రెండు సెంచరీలు సాధించాడు. సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. నాలుగో వన్డేలో మాత్రం నాలుగో స్థానంలో బరిలోకి దిగి నిరాశపరిచాడు.

రిషభ్‌ పంత్‌

రిషభ్‌ పంత్‌

వికెట్ కీపర్ ధోనికి చివరి రెండు వన్డేల నుంచి విశ్రాంతినివ్వడంతో నాలుగో వన్డేలో వికెట్ కీపర్‌గా చోటు దక్కింది. కీపర్‌గా విఫలమైనా బ్యాట్‌తో రాణించాడు.

కేదార్‌జాదవ్‌

కేదార్‌జాదవ్‌

రెండో వన్డేలో ధోనీతో కలిసి మ్యాచ్‌ని గెలిపించడంలో కీలకపాత్ర పోషించాడు. పార్ట్ టైమ్ స్పిన్నర్‌గా బౌలింగ్‌లోనూ ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంలో విఫలమయ్యాడు. జాదవ్‌ బౌలింగ్‌లో ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ అధిక పరుగులు రాబట్టారు. ఈ మ్యాచ్‌ మినహా జాదవ్‌ ఆల్‌రౌండర్‌గా బాగానే రాణిస్తున్నాడు.

విజయ్‌శంకర్‌

విజయ్‌శంకర్‌

నాలుగో వన్డేలో 15 బంతుల్లో 26 పరుగులు చేశాడు. ఆల్ రౌండర్‌గా బాగానే రాణిస్తున్నాడు. అలాగే బౌలింగ్‌లో వికెట్లేమీ తీయకపోయినప్పటికీ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశాడు. నాలుగో వన్డేలో ఐదు ఓవర్లకు 29 పరుగులే మంచి ప్రదర్శనే చేశాడు.

రవీంద్ర జడేజా

రవీంద్ర జడేజా

ఐదో వన్డేలోనూ రవీంద్ర జడేజాకు తుది జట్టులో చోటు దక్కనుంది. ఒకవేళ విజయ్‌శంకర్‌ లేదా యజువేంద్ర చాహల్‌ ఇద్దరిలో ఎవరిని తప్పించినా ఐదో వన్డేలో జడేజాకు ఆడే అవకాశం రానుంది.

భువనేశ్వర్‌ కుమార్‌

భువనేశ్వర్‌ కుమార్‌

నాలుగో వన్డేలో రాణించకపోయినా సీనియర్‌ పేస్‌ బౌలర్‌గా కావడంతో తుది జట్టులో భువీకి చోటు దక్కడం ఖాయం. ఐదో వన్డేలోనైనా ఆస్టేలియా బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేస్తాడని అభిమానులు భావిస్తున్నారు.

కుల్దీప్‌ యాదవ్‌

కుల్దీప్‌ యాదవ్‌

నాలుగో వన్డేలో కీలక సమయంలో వికెట్ తీసి ఆకట్టుకున్నాడు. గత నాలుగు వన్డేల్లోనూ కుల్దీప్ ప్రదర్శన ఫరవాలేదు. దీంతో ఐదో వన్డేలో కూడా చోటు దక్కొచ్చు. మిడిల్ ఓవర్లలో పరుగులను నియంత్రించి వికెట్లు తీయడానికి కుల్దీప్‌ పనికొస్తాడని జట్టు భావిస్తోంది.

జస్ప్రీత్‌ బుమ్రా

జస్ప్రీత్‌ బుమ్రా

టీమిండియా ప్రధాన బౌలర్‌గా పేరొందిన బుమ్రా ప్రస్తుతం అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ఆసీస్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేస్తూ పరుగులు ఎక్కువగా ఇవ్వకుండా జాగ్రత్తగా బౌలింగ్ వేయడంలో బుమ్రా దిట్ట. ముఖ్యంగా డెత్ ఓవర్లలో అతడి బౌలింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు.

Story first published: Tuesday, March 12, 2019, 17:34 [IST]
Other articles published on Mar 12, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X