న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కామెంటేటర్ నోరు నొక్కేసిన సోనీ మీడియా.. ఎందుకంటే..?

India vs Australia 4th Test: Controversial commentator Kerry OKeeffe will not be heard during the Test match

సిడ్నీ: మీడియా ఛానెళ్లు కేవలం టీఆర్‌పీ రేటింగ్స్ కోసమే కాదు. జాతి వివక్షత అనేది పెరగకుండా తోడ్పడేలా చర్యలు తీసుకుంటున్నాయి. ఆస్ట్రేలియా తలపడుతోన్న టీమిండియా మూడో టెస్టులో కామెంటేటర్ చేసిన వ్యాఖ్యలు కొన్ని రోజుల పాటు వైరల్‌గా మారాయి. తనంతట తానే క్షమాపణ చెప్పుకునే వరకూ అవి రోజూ అంటుకుంటూనే ఉన్నాయి. మెల్‌బౌర్న్ వేదికగా బరిలోకి దిగిన భారత యువ ఓపెనర్‌(మయాంక్)ను హేళన చేస్తున్నట్లుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు ఆస్ట్రేలియన్ కామెంటేటర్ కెర్రీ ఒకీఫ్.

ముంబై స్టూడియోలో మరొకరితో కామెంట్రీ

ముంబై స్టూడియోలో మరొకరితో కామెంట్రీ

మరోసారి కెర్రీ వ్యాఖ్యలు ఇక్కడ వివాదాస్పదం కాకుండా ఆయన కామెంట్రీని ప్రసారం చేయలేదు. గురువారం భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య సిడ్నీలో ప్రారంభమైన ఆఖరి టెస్టుకు కెర్రీ ఒకీఫ్ కూడా ఓ 30 నిమిషాలపాటు కామెంట్రీ చెప్పారు. ఆయన చెప్తున్నంతసేపు ఆడియోను ప్రసారం చేయలేదు. కెర్రీ కామెంట్రీకి బదులుగా తమ ముంబై స్టూడియోలో మరొకరితో కామెంట్రీ చెప్పించి దాన్నే ప్రసారం చేసినట్లు ఛానెల్ వర్గాలు వెల్లడించాయి.

మయాంక్ ఆడుతున్నప్పుడు కెర్రీ కామెంట్రీ

మయాంక్ ఆడుతున్నప్పుడు కెర్రీ కామెంట్రీ

మెల్‌బౌర్న్ టెస్టులో మయాంక్ అగర్వాల్ ఆడుతున్నప్పుడు కామెంట్రీ చెప్పిన కెర్రీ.. భారత దేశవాళీ క్రికెట్‌ను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారు. రంజీల్లో మయాంక్ చేసిన ట్రిపుల్ సెంచరీని ప్రస్తావిస్తూ.. రైల్వే క్యాంటీన్‌ జట్టుపై ట్రిపుల్ సెంచరీ చేసి ఉంటాడని ఎగతాళి చేశాడు. ‘చెఫ్‌లు, వెయిటర్లు వంటి రైల్వే స్టాఫ్‌తో నిండిన జట్టుపై మయాంక్ ట్రిపుల్ సెంచరీ చేశాడు' అని కామెంట్రీలో భాగంగా కెర్రీ వ్యాఖ్యానించారు.

ఛతేశ్వర జడేజా అని పేరేందుకు

ఛతేశ్వర జడేజా అని పేరేందుకు

అంతటితో ఆగకుండా ‘మీ అబ్బాయికి ఛతేశ్వర జడేజా అని పేరేందుకు పెట్టకూడదు?' అంటూ మరోసారి నోరుజారాడు. దీంతో పెద్ద ఎత్తున ఆయనపై విమర్శలు చెలరేగాయి. ఆయనతో కామెంట్రీ చెప్పించొద్దంటూ సోనీ ఇండియాకు భారీగా ఫిర్యాదులు వచ్చాయట. దీంతో అప్రమత్తమైన సోనీ బ్రాడ్‌కాస్టర్ ఛానెల్ మళ్లీ కెర్రీ ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారోనని భయపడి ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంది. ఈ క్రమంలోనే కామెంట్రీని ప్రసారం చేయకుండా ఆపేసింది.

 వీడియో ప్రసారాలను ‘ఫాక్స్ క్రికెట్' ద్వారా

వీడియో ప్రసారాలను ‘ఫాక్స్ క్రికెట్' ద్వారా

వాస్తవానికి ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఈ సిరీస్ వీడియో ప్రసారాలను ‘ఫాక్స్ క్రికెట్' ద్వారా సోనీ తీసుకుంటోంది. కాబట్టి అక్కడ కామెంటేటర్లను నియమించుకునే అంశంలో సోనీకి గానీ, బీసీసీఐకి గానీ ఎలాంటి అధికారం ఉండదు. ఈ వీలు ఉండటంతో సిడ్నీ టెస్టులో తొలిరోజు 30 నిమిషాలు పాటు కెర్రీ చేసిన కామెంట్రీని భారత్‌లో ప్రసారం కాకుండా సోనీ ముందుగానే జాగ్రత్తపడింది. అతని స్థానంలో వేరొకరితో కామెంట్రీ చెప్పించింది. ఆ 30 నిమిషాల తరవాత యథావిథిగా ఫాక్స్ కామెంట్రీనే తీసుకుంది. తొలి రోజు మాత్రమే కాకుండా.. టెస్టు మొత్తం కెర్రీ చేయబోయే కామెంట్రీని ఈ విధంగానే తప్పించనున్నారట.

Story first published: Thursday, January 3, 2019, 15:38 [IST]
Other articles published on Jan 3, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X